Tuesday, February 18, 2020

అమ్మ...నాన్న...కన్నీళ్లు...

💐🌼🌺అమ్మ...నాన్న...కన్నీళ్లు🌺🌼💐

💐🌺🏝 మనిషి జీవితంలోనూ
అమ్మా నాన్న అనే అనుబంధం
మరపురాని మహోన్నత బంధం
సృష్టికి మూలం భగవంతుడు అయితే
మన జీవితానికి మూలం అమ్మానాన్నలు.

🌺 మనం అందరూ కూడా అనేక సందర్భాలలో అమ్మానాన్నలను చాలా చాలా కష్ట పెట్టి ఉండవచ్చు
వారు పడ్డ కష్టాలు మనల్ని జీవితంలో ఉన్నత స్థానానికి తీసుకు రావటానికి వారు చేసిన కృషి వారు చేసిన త్యాగాలు ఎన్నో ఎన్నో అవి మనం తెలుసుకో లేక పోవచ్చు మనకు అందులో పదో వంతు కూడా గుర్తు ఉండకపోవచ్చు

🌺 వారి త్యాగాలను కష్టాలను గుర్తుంచుకోవటం లేకపోగా పైగా వారిని ఎన్నో విధాల మనమే బాధపెట్టి ఉండవచ్చు
ఎలాగూ వారు చేసిన త్యాగాలలో మనం తిరిగి వారికి పదో వంతు సేవలు కూడా చేయలేము

🌺 తల్లి తండ్రుల చేత మన కన్నీరు పెట్టించ కూడదు
మనం చేసే ప్రేమ పూర్వకమైన పనుల ద్వారా
చిన్న చిన్న త్యాగాలు ద్వారా వారి కళ్ళల్లో ఆనందబాష్పాలు వచ్చేలా చేయాలి
మన తల్లితండ్రులు మనం చేసే చిన్నచిన్న
సేవల ద్వారా ఎంత ఆనందంగా ఉంటారో చూడండి

🌺 ఏరోజైనా మీ తల్లిదండ్రుల పాదాలను
సుతిమెత్తగా తాకారా....
వాటిని మృదువుగా నొక్కారా ఈ రోజే
ఆ పాదాలను తాకిండి సుతిమెత్తగా ఒత్తండి
మీరు చేసిన తప్పులకు మనసులోని క్షమాపణ కోరుకుంటూ మీ తల్లిదండ్రుల పాదాలకు
మీ కన్నీళ్లతో అభిషేకం చేయండి

🌺 ప్రతి ఒక్కరూ ముందు తల్లిదండ్రుల జీవితాన్ని అధ్యయనం చేయండి వారు చేసిన త్యాగాలను
అన్నిటినీ గుర్తించండి.....ఎన్ని కష్టాలు పడి మనల్ని ఉన్నత స్థితికి తీసుకొని వచ్చారో తెలుసుకోండి.

🌺 కాలం కరిగిపోయాక లోకం విడిచి వెళ్ళాక
ఇక తల్లితండ్రులు రమ్మన్నా రారు
అప్పుడు మనం ఎంత బాధ పడ్డా
ఎంత ప్రేమను వ్యక్తపరచాలి అనుకున్నా
తల్లిదండ్రులు మనకు అందరు
ఆ అమూల్యమైన గడియలు ఇక రానే రావు.

🌺 అమ్మ హృదయం ఎంత త్యాగమయమో
ఎప్పుడైనా చూశారా... తెలుసుకున్నారా
ఎన్నో కష్టాలకోర్చి మనల్ని గొప్పగా తీర్చిదిద్ది_
బండ భారిపోయిన నాన్న చేతులను
ఏనాడైనా పరీక్షగా చూశారా
తన కష్టాలను మనసు విప్పి చెప్పుకోలేని
మూగజీవి నాన్న

🌺 తల్లిదండ్రులను హీనంగా చూసేవారు
ఎన్ని పూజలు చేసినా..... భగవంతునికి
చేరువ అవటానికి ఎంత ప్రయత్నించినా
మన ప్రయత్నం నిస్ప్రయోజనం అవుతుంది
తల్లి తండ్రుల మించిన దైవాలు లేదని
మన వేదాలలోనూ పురాణాలలోనూ కూడా
చెప్పబడింది

🌺 ముందుగా తల్లిదండ్రుల దీవెనలు అందుకోక పోతే
మన జీవితంలో ఉన్నతమైన స్థానానికి మనం వెళ్ళలేము
ఎవరైతే తల్లిదండ్రులను ఉన్నతంగా చూసుకుంటారో
ఎవరైతే తల్లిదండ్రులకు మంచి సేవలు చేస్తారో
వారికే భగవంతుని కరుణ కటాక్షాలు కూడా లభిస్తాయి
మనలో ఎవరైనా సరే జీవితంలో ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలి అనుకుంటే ముందుగా తల్లిదండ్రుల దీవెనలు తీసుకోండి

🌺 పండరి పురాణంలో పుండరీకుని కథ తెలుసుకుంటే
తల్లిదండ్రులు సేవలు ఎలా చేయాలో ప్రతి ఒక్కరికి తెలుస్తుంది పుండరీకునికి భగవంతుడు ప్రత్యక్షమైతే కూడా నా తల్లిదండ్రులు సేవలు అయిన తరువాతే నీ చెంతకు వస్తాను స్వామి అంటాడు
భగవంతుడు ప్రత్యక్షమైతే కూడా తల్లిదండ్రుల సేవలు పూర్తి అయిన తరువాతే భగవంతుని దగ్గరకు వెళ్ళాడు అప్పుడు ఆ పుండరీకుని గొప్పతనం పాండురంగడు గుర్తించి ఎంతో మెచ్చుకుని తరువాత ఎన్నో వరాలను ఇస్తాడు...పండరీకుని పేరుమీద పాండురంగని
దివ్య క్షేత్రం పండరీపురం వెలుస్తుంది

🌺 మనం తల్లిదండ్రులకు చేసే సేవలను
గుర్తించి భగవంతుడు ఎంతో మెచ్చుకుంటాడు
ఎన్నో వరాలను మనకు కానుకగా ఇస్తాడు
అందరూ తల్లితండ్రులను గౌరవించండి..
పూజించండి...సేవించండి... సేవలు చేయండి.
తల్లిదండ్రుల సేవ భారతీయ సాంప్రదాయాల లోనూ భారతీయ ధర్మలలోనూ ప్రముఖమైనది.💐🌼🌺

No comments:

Post a Comment