Tuesday, February 11, 2020

కష్టాలు వరాలు

కష్టాలు వరాలు
🕉🔱🌞🌎🏵🚩

నా జీవితం లోనివి కష్టాలు కాదు, భగవంతుని వరాలు...

•నేను శక్తిని అడిగాను -- భగవంతుడు నాకు కష్టాన్ని ఇచ్చి శక్తిని పొందమన్నాడు .

నేను సంపదను అడిగాను-- భగవంతుడు నాకు మట్టిని ఇచ్చి బంగారం చేసుకోమన్నాడు.

నేను ధైర్యాన్ని అడిగాను -- భగవంతుడు నాకు ప్రమాదాలు ఇచ్చి ధైర్యం వహించమన్నాడు.

•నేను వరాలు అడిగాను -- భగవంతుడు నాకు అవకాశాలు ఇచ్చాడు .

•నేను ఆయన ప్రేమను అడిగాను- భగవంతుడు ఆపదల్లో ఉన్నవారి చెంతకు నన్ను పంపించాడు .

నేను జ్ఞానాన్ని అడిగాను - భగవంతుడు నాకు సమస్యల్ని ఇచ్చి పరిష్కరించమన్నాడు .

నేను పురోగతి అడిగాను - భగవంతుడు నాకు అవరోధాలు కల్పించి సాధించమన్నాడు .

•నేను లోకానికి మంచి చెయ్యాలని అడిగాను - భగవంతుడు ఇబ్బందులు కల్పించి అధిగమించమన్నాడు .

నేను ఆయన్ను మరువకూడదు అని అడిగాను -- భగవంతుడు భాధలు ఇచ్చి ఆయన్ను గుర్తుంచుకోమన్నాడు .

నేను పాపాలు క్షమించమని అడిగాను -- భగవంతుడు ధ్యాన సాధన చేసుకోమన్నాడు.

అలా జీవితంలో నేను కోరుకున్నదేదీ పొందలేదు - నాకు కావలసిందే నేను పొందాను.

ఈ విధంగా జీవితంలో జరిగే ప్రతీ సంఘటననుండి నాకు అవసరమైనది పొందటం నేను నేర్చుకున్నాను.

చివరకు ఏది జరిగినా నా మంచికే అని అర్ధం చేసుకున్నాను .

జరిగేది అంతా మన మంచికే.

ఓం నమఃశివాయ.

🕉🌞🔱🏵🌼🚩

No comments:

Post a Comment