జన్మజన్మల చెడు ఖర్మల చిట్టా(చిత్రగుప్తుని చిట్టా) మన నాడీ మండలంలో మనజన్మతోపాటే జన్మ తీసుకుంటుంది గాని వాడిని తిట్టావు వీడిని గిల్లావు వాడట్లా వీడిట్లా అని కలం కాగితం పట్టుకుని ఎవరూ(చిత్రగుప్తుడు)వ్రాయడు...ప్రతిది ఎవరి అంతరంలలో రికార్డ్ కాబడుతుంది...ధ్యానం చేయడంవలన జ్ఞానాగ్ని ద్వారా చెడు ఖర్మల చిట్టా దగ్ధం అవుతుంది...అపుడు చిట్టా వుండదు...చెడు ఖర్మలు ఉండవు...నుదురు(బ్రహ్మవ్రాతలంటారుగా)తెల్లకాగితంగా మారుతుంది...అపుడు అద్భుతమైన ఆలోచనల ద్వారా ఆనందకరమైన జీవితాన్ని అద్బుతంగా (నీ ఆలోచనలే నీ నుదుటి బ్రహ్మ వ్రాత)వ్రాసుకోవచ్చు...బాహ్య ప్రపంచపు ఆలోచనలు కన్నా అంతరు ప్రపంచ ఆలోచనలు చాలా శక్తివంతమైనవి మరియు త్వరగా వాస్తవరూపం చెంది నీ భౌతిక ప్రపంచంలోకి వస్తాయి...ఆత్మకు శ్వాస ద్వారా చెప్పుకోవడమే అంతరు ప్రపంచ ఆలోచనలు...ఇన్నిరోజులు తెలియక రకరకాల దేవుళ్ళను రకరకాలుగా యాచించాం...కమీషన్లు (ముడుపులు,మొక్కులు)కూడా ఇస్తామని మొక్కుకున్నారు...ధ్యానం లో నీకేమి కావాలో శాసించడమే గాని యాచించం ఉండదని గమనించండి/తెలుసుకోండి
ఎవరి అనుమతి లేకుండా ఎవరి జీవితాలలో ఏవి ప్రవేశించలేవు మంచైనా /చెడైనా... అనుమతులు అనేవి తెలిసో తెలియకో మన ఊహలు, ఆలోచనలు,, ఆకర్షణలు, మాటలు, చేతల ద్వారా ఇస్తాం... కావున నిరంతరం పాజిటివ్ ఆలోచనలు చేయాలి... పాజిటివ్ ఫలితాలు పొందాలి... యద్భావం -తద్భవతి
ధ్యానం చేయనప్పుడు ఏది కావాలన్నా కొంత కస్టపడి కొంత సమయాన్ని తీసుకున్నాక అదికూడా వస్తే వస్తుంది లేకుంటే రాకుండా కూడా ఉంటుంది... అదే సాధకులు సాధన చేసాక వారి చేతిలో అక్షయపాత్ర ఉంటుంది (మాటే మంత్రం )... అపుడు ఏది కావాలాలన్న అనుకున్నదే తడవుగా అనుభవించి తీరుతారు...
నిమ్మ పులుపు, మిర్చి కారం, చెరకు తీపి, కాకర చేదు... ఇవన్నీ ఎలా తెలిసినవి.. తినడం వలెనే గదా.. ధ్యానం సర్వరోగ నివారిణి, సకల సమస్యల పరిష్కారిని ఆత్మజ్ఞాన ప్రభోధిని... ఎలా నమ్మాలి. .. సాధన ద్వారా మాత్రమే తెలుస్తుంది... ఇక్కడ ఎవరి అనుభవాలు వారివి... ఒకరి అనుభవాలతో ఇంకొకరి అనుభవాలు కలవక పోవచ్చు
... పోల్చుకోవలసిన అవసరం కూడా లేదు... సాధన చేసుకుంటూ పోవడమే సాధకుల ముందున్న తక్షణ కర్తవ్యం... ఒక్కోసారి మనసు మాయావల్ల కూడా భ్రమలు కలుగుతాయి... ఇక్కడ ఎరుక స్థితి (awareness )చాలా చాలా ముఖ్యం మరియూ అవసరం కూడా..

No comments:
Post a Comment