Friday, March 13, 2020

"కరోనా" ..ఒక దైవాగ్రహ శిక్ష

"కరోనా" ..ఒక దైవాగ్రహ శిక్ష..!!??

లోకంలో ..దుర్మార్గం పెరిగి పోయింది ..!
లోకంలో ..అరాచకం హద్దు మీరి పోయింది ..!
లోకంలో ..అశ్లీలం పెచ్చురిల్లి
పోయింది ..!
లోకంలో ..దాష్టీకం విపరీ తమైంది ..!
లోకంలో ..హింసా దౌర్జన్యం అనంతమైంది ..!
లోకంలో స్త్రీ జాతిని చంపడం ఎక్కువైంది ..!
లోకంలో పసి పిల్లలపై ..అమానుషం రాజ్యమేలుతోంది ..!
లోకంలో మంచి మనుష్యులను నిరాదరించటం . . దుష్టులను ప్రేమించడం అధికమైంది ..!
దైవారాధన లేకుండా పోతోంది ..!
దాన ధర్మాలు ..మరపులోకి లేకుండా పోయాయి ..!
అవినీతి ,అధర్మ కార్యాలకు
అడ్డుకట్ట లేకుండా పోయింది ..!
నడ్డి విరిచే ..వడ్డీ వ్యాపారం మామూలై పోయింది ..!
అక్రమ సంబంధాలు ,
ప్రేమలు, మోసం , దొంగతనం, అసభ్య ,అక్రమ..డేటింగ్..
తల్లిదండ్రులపై ..కనికరం
లేని సంతానం ..
భార్యా భర్తలు ఒకర్నొకరు చంపుకోవడం ..ఇరువైపులతెలియని అక్రమ లైంగిక వ్యవహారాలూ ..పెళ్లి గాకుండానే ..తల్లులవుతున్న చదువుకొనే అమ్మాయిలూ ..
అక్రమ అధర్మ సంపాదన,ఆస్తి పాస్తులు ..కూడబెట్టుకోవడం
అధర్మ అద్దె గర్భాలు, ఆడ-ఆడ , మగ-మగ ప్రకృతి విరుధ్ధ వివాహాలు ..
భ్రూణ హత్యలు , మాన భంగాలు, బలాత్కారాలు ..పాపపు పాడు పనులు .. వ్యభిచారం జీవనోపాధి గావడం..
లోకంలోని అందరిలో కెల్లా ..ఈ మనుష్య జాతిలో ..సాటి మనిషి పట్ల ప్రేమ,దయ,కరుణ ..లేకుండా
దాని బదులు .. ద్వేషం,కుట్ర,మోసం,దోపిడీ దొంగతనం,స్వార్థం,..ఇంకా అనేకానేక.. అమానవీయ లక్షణాలు పెరిగి ..మానవీయ తత్వాలు కనుమరుగవుతున్న ..సందర్భాల్లోనే .. ఎయిడ్స్,సార్స్,కరోనా .. లాంటి కొత్త కొత్త
వ్యాధులు .. మనుష్య జాతి అంతాన్ని చూస్తున్నట్లు తోస్తోంది ..! ఈ సందర్బంగా
దైవాగ్రహం .. కానవస్తోందని మనమందరం .. గ్రహించక తప్పదు .. !! ???మనవైఖరి మార్చుకొనక తప్పదు ..!!??.

No comments:

Post a Comment