Monday, March 30, 2020

ప్రశ్న: ప్రాణాయామము అంటే ?

🕉️☀️💥🧘‍♀️🧘‍♂️🧘‍♀️🧘‍♂️🧘‍♀️💥☀️🕉️

30-03-2020

☀️ "అమర చైతన్యం" ☀️
( శ్రీ రమణ మహర్షి బోధనలు )

ప్రశ్న: ప్రాణాయామము అంటే ?

జవాబు: ప్రాణము ఆత్మతో సమానము. అదియే జీవశక్తి. మనసు, ప్రాణము ఒకే మూలము నుంచి ఉద్భవించినవి. శరీరాన్ని, ఇంద్రియాలను, మనసును శ్వాస ద్వారా నియమించుదురు. ఇదే ప్రాణాయామము. అభ్యాసముతో ఈ రకంగా మనసు స్వాధీనం కాబడి చివరకు నశించిపోతుంది. మనసు సద్దు మణిగి ఒక తెలియని శూన్యస్థితి ఏర్పడుతుంది. అది ప్రశాంత స్థితియే అయినప్పటికి అది తాత్కాలికమే. యోగికి ఎప్పుడు ఆ స్థితి కావలసినా, ప్రాణాయామము చేయవలసిందే. యోగి ఆ స్థితి కంటే కూడా ఇంకా సాధన చేసి మనసు మీద నేరుగా అధీనము పెరిగి చివరకు సహజసమాధి స్థితిలోకి రావాలి. తాత్కాలికమైన సమాధి కాదు.

మనసును అధీనములో ఉంచుకోలేని వాళ్ళకు ప్రాణాయామము ఉపయోగపడుతుంది. శ్వాసను గమనించడం ద్వారా కూడా ఇది సాధ్యమే. కేవలం శ్వాస మీద దృష్టి పెడితే మనసు ఇతర విషయాల మీదకు వెళ్ళక మనసు, శ్వాస స్వాధీనంలో ఉంటాయి. ధ్యానంలో కొద్ది సేపటికి మనసు స్థిమితంగా ఉంటుంది. అదిచాలు. శ్వాసను గమనిస్తే శ్వాసను నియత్రించవచ్చు. శ్వాసను గమనించినా, మనసుని గమనించినా, రెండింటిని నియత్రించవచ్చు. గురువు సమీపంలో లేని వారికి శ్వాస మీద ధ్యాస పనికి వస్తుంది. సమర్థుడైన గురువు సమక్షంలో మనసే స్ఠిమితంగా ఉంటుంది.

నేను అన్న ఆలోచన ఎక్కడ పుడుతుందో గమనించు. అక్కడే ప్రాణం (శ్వాస) ఆగుతుంది. ఆలోచన ఆగుతుంది. ప్రాణం, ఆలోచన ఒక్కసారే లేస్తాయి. ఒక్కసారే అణుగుతాయి. ఆలోచనలు ఆగినపుడు ఏ ప్రశాంతత, ఏ ఆనందం అనుభవానికి వస్తుందో అదే ఆత్మ. అది దివ్యమైన వెలుగు. అది శాశ్వతమైనది. అవధులు లేనిది. అదే గమ్యము. అదే భగవంతుడు. సాధనలో నీవు ఏ వెలుగునీ ఊహించుకొనవద్దు. తనంత తానే అనుభవానికి వస్తుంది. ప్రయత్నం చేస్తూంటే అదే గమ్యం చేరుస్తుంది.

No comments:

Post a Comment