✍.... నేటి కథ
ఒక నెమలి 🦚అక్కడే ఉన్న సరస్సులో నివసించే ఒక కప్పతో 🐸స్నేహం చేసింది.
కొద్దిరోజుల్లోనే అవి రెండూ మంచి స్నేహితులై పోయాయి.🤝
ఒకరోజు ఒక వేటగాడు ఆ అడవికి వచ్చాడు.🕵
సరస్సు దగ్గరున్న నెమలిని చూసాడు. 🦚
వల విసిరి దాన్ని పట్టుకున్నాడు. అది చూసి కప్ప🐸 బాధతో విలవిల్లాడి పోయింది.
‘‘దయచేసి నా స్నేహితురాలిని వదిలిపెట్టు’’ అంటూ కప్ప వేటగాడిని ప్రాధేయపడింది🐸
.‘‘నీ స్నేహితురాలిని విడిచిపెడితే నాకేం లాభం? దీన్ని సంతలోకి తీసుకెళ్ళి అమ్మితే నాకు బోలెడంత డబ్బు వస్తుంది’’ అన్నాడు వేటగాడు.🕵
కప్ప ఒక్క క్షణం ఆలోచించింది. ‘‘ఒకవేళ నీకు ధనం ఇస్తే నెమలిని వదిలిపెడతావా?’’ అని అడిగింది.
‘‘తప్పకుండా!’’ అన్నాడు వేటగాడు.
కప్ప నీటిలోకి మునిగి, కాస్సేపటి తరువాత పైకి
లేచింది. దాని చేతిలో ఒక పెద్ద 💰ముత్యం ఉంది. ‘‘ఇది తీసుకుని నా స్నేహితురాలిని వదిలిపెట్టు’’ అని అంది.
వేటగాడు ఆ ముత్యాన్ని చూసి ఎంతో సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాడు.
నెమలిని వదిలేసి ముత్యం తీసుకుని ఇంటి దారి పట్టాడు.
ఇంటికి చేరుకున్న తరువాత వేటగాడి భార్య ‘‘వెర్రినాగన్న! ఇది ఎంతో విలువైన ముత్యం. ఒక్కటే తీసుకుని వచ్చావు. ఆ కప్ప దగ్గర ఇంకా చాలా ఉండి ఉంటాయి. వెళ్ళి మొత్తం పట్రా!’’ అని చెప్పింది.👵
వేటగాడు తీరిగి సరస్సు దగ్గరకు వెళ్ళి కప్పను కలుసుకున్నాడు. ‘‘మళ్ళీ వచ్చావేమిటి?’’ అని అడిగింది కప్ప.
‘‘నాకు ఇలాంటి ముత్యాలు ఇంకొన్ని కావాలి. నువ్వు ఇవ్వకపోతే నీ స్నేహితురాలిని పట్టుకుపోతాను’’ అని బెదిరించాడు.🕵
‘‘సరే, నీ చేతిలోని ముత్యం ఇలా ఇవ్వు. అలాంటివే వెదికి తెస్తాను’’ అంది కప్ప. 🐸
వేటగాడు ముత్యాన్ని కప్పకు ఇచ్చాడు. కప్ప వేటగాడికి అందనంత దూరంగా ఈది వెళ్ళి ‘‘అత్యాశతో చేతిలో ఉన్నది కాస్తా పొగొట్టుకున్నావు. నా స్నేహితురాలు అడవిలోకి వెళ్ళిపోయింది. నీకు దొరకదు. నేను కూడా దొరకను. వస్తా’’ అని చెప్పి బుడుంగున నీటిలోకి మునిగిపోయింది.
🌸🌸🌸🌸🌸🌸🌸
ఆశా, నామ, మనుష్యాణామ్, శృంఖలా, కాచిత్, అద్భుతా,
యయా, బద్ధాః , ప్ర ధావన్తి, ముక్తాః, తిష్టన్తి, పంగువత్
ఆశ అనే శృంఖలాలచే బధ్ధుడైన వాడు జీవితంలో పరుగులు పెడతాడు. వాటి నుండి విముక్తుడైన వాడు అవిటివాని వలె చతికిల పడతాడు అని తాత్పర్యం.🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

No comments:
Post a Comment