Wednesday, March 25, 2020

కరుణ లేక కరోనా

కరుణ లేక కరోనా
అహింసో పరమో ధర్మః
భగవంతుడు మానవుడితోపాటు అన్ని జీవులను సృష్టించెను. అయితే మనకు ఎలాంటి హాని చేయని, మన జోలికి రాని కోడి, మేక, గొర్రె, చేప, ఆవు, ఎద్దు, పంది, ఒంటె, కప్ప, తేలు, పాము, ఇంకా ఎన్నో జంతువులను క్రూరంగా హింసించి, చంపి, వాటి ఆర్తనాదాలు పట్టించుకోకుండా, భరించరాని చెడు వాసనను మరిచిపోవుటకు మసాలాలు దట్టించి హాయిగా భోంచేస్తున్నారు. అది తినకపోతే బలం రాదని సాకులు చెప్తున్నారు.
ప్రక్రృతి లోని జంతువులని హింస పెట్టి చంపుతున్నపుడు
ప్రక్రృతి సంహించదు.

సైన్స్ – మాంసకృత్తులు
మాంసాహారం లోనే
ఉంటాయంటే అది మన పొరపాటు.
మెడికల్ సైన్స్ నివేదిక ప్రకారం
మాంసకృత్తులు శాకాహారంలోనే ఎక్కువ పాళ్ళలో వుంటాయి.
శాకాహారమే శ్రేష్ఠం.
ఒక జంతువును చంపుతున్నపుడు, జంతువులోపల భయంతో కెమికల్ రియాక్షన్ జరిగి అవి విషపదార్థాలను విడుదల చేస్తాయి. మానవుడు మాంసం తీసుకొన్నపుడు ఆ విషపదార్థాలు మానవ శరీరంలో ప్రవేశించి హాని కలుగుతుంది అని సైన్స్ చెబుతోంది.

ప్రపంచమంతా కనిపించని సూక్ష్మ క్రిమి వలన పరుగులు ఆపి, అన్ని వ్యాపారాలు, ఉద్యోగాలకు, కార్యక్రమాలకు సెలవులు పెట్టారు.
చైనా దేశంలో జంతువు వల్ల ఈ కరోనా వైరస్ వచ్చింది అన్న ఒక నివేదిక ప్రకారం మాంసాహారం పూర్తిగా బ్యాన్ చేసింది.
ప్రక్రృతి లోని జంతువులని చంపుతుంటే, ప్రక్రృతి కరోనా అన్న చిన్న వైరస్ ని పంపింది.
ఒక్క చిన్న వైరస్ నిలువెత్తు ఉన్న మనిషిని సమాథి లో పడుకోపెడుతుంది.
ఇంత జరుగుతున్నా కూడా భారతదేశంలో మాంసాహారం చికన్, మటన్ అమ్మ డం, తినడం చేస్తున్నారు. వ్యాపార లాభాపేక్ష దృష్టితో కరోనాకి మాంసాహారానికి సంబంధం లేదని వాదిస్తున్నారు. టివిలలో, పేపర్ లలో యాడ్స్ ఇచ్చి ప్రత్యేకమైన ఆఫర్ తో మాంసాహారం చికన్, మటన్ అమ్మ డం చేస్తున్నారు.
చైనాలో ఎంతో టెక్నాలజీ ఉంది. డాక్టర్లు ఉన్నారు.
అందరూ రీసెర్చ్ చేసి కరోణా జంతువుల నుండి వచ్చింది అని తెలసుకొని మాంసాహారం బ్యాన్ చేశారు.
హింస పెడితే ప్రతిహింస జరుగుతుంది.

WHO: ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organisation)నివేదిక
ప్రకారం ఇప్పటి వరకు ఏ ఒక్క శాకాహారికి కూడా కరోనా వ్యాధి సోకలేదు.

" అహింసో పరమో ధర్మః " ఏ జీవినీ చంపే హక్కు ఎవరికీ లేదు అని ప్రపంచం లోని మేధావులు, తత్వవేత్తలు నొక్కి వక్కాణించారు. సత్యము చేదుగా ఉన్నప్పటికీ, శాశ్వతం గా నిలబడుతుంది.

వీరబ్రహ్మేంద్రస్వామి వారు కాలజ్ఞానం లో కోరంకి(కరోనా) గురించి వ్రాశారు.
అలాగే జీవహింస గురించి కాళికాంబ సప్తసతి లో

“ జీవులను వధించి జీవికి వేసిన జీవదోషములనుజిక్కువడును.
జీవహింస చేత చిక్కునా మోక్షంబు?
కాళికాంబ ! హంస కాళికాంబ !"

మహా యోగి వేమన
”పక్షిజాతిని బట్టి పరగ హింసల బెట్టి
కుక్షినిండ కూడు కూరుటకును
వండి తినెడివాడు వసుధ ఛండాలుడు
విశ్వదాభిరామ వినురవేమ !”

శ్రీక్రిష్ణ
“ఓ అర్జునా ! ఎవ్వరు సమస్త భూతకోటి యొక్క సుఖ దుఃఖాలు తన సుఖ దుఃఖాలుగా చూస్తాడో అలాంటివాడు అందరిలో నాకు ఎక్కువ ప్రియుడు. ”
భగవద్గీత 6-32

మనుస్మృతి
“జీవులను చంపేవారు, చంపించేవారు, అమ్మేవారు, వండేవారు, వడ్డించేవారు, మాంసం కోసేవారు, తినేవారు, తినిపించేవారు ఈ ఎనిమిది రకాల వారు హత్యలో భాగస్వాములే.”

" ఏ జీవిని చంపే హక్కు ఎవరికీ లేదు. అన్ని జీవుల పట్ల కరుణతో ఉండాలి. అపుడే దేవుని రాజ్యం లోకి ప్రవేశిస్తారు." -జీసస్

ఇప్పటికైనా మేలుకొందాం. ఇప్పటివరకు చేసిన జీవహింస కు జంతువులకు క్షమాపణ చెప్పి, మాంసాహారం మానివేయాలి. లేనిచో భగవంతుడు కూడా క్షమించడని తెలుసుకోవాలి. కారణం భగవంతుని చిన్న బిడ్డలే పక్షులు, జంతువులు.

సాంకేతికంగా, జ్ఞానపరంగా అభివృద్ధి చెందామంటే మూగ జీవులపట్ల కరుణ కలిగి వుండాలి. వాటికి రక్షణగా నిలవాలి. వాటిని భక్షించకూడదు.

No comments:

Post a Comment