Wednesday, April 22, 2020

ముక్కుపుడక - కబీర్ దాస్ గారు

💫ముక్కుపుడక - కబీర్ దాస్ గారు :
🕉🌞🌏🌙🌟🚩

ఒకసారి సంత్ కబీర్ దాస్ గారు, హరి భజన చేస్తూ ఒక వీధిలో నుంచి వెళుతున్నారు. ఆయన ముందు కొంత మంది స్త్రీలు నడుచుకుంటూ వెళుతున్నారు. అందులో ఒక అమ్మాయికి అప్పుడే పెళ్లి కుదిరింది, ఆమె అత్తింటివారు నిశ్చితార్థం సారె తో పాటూ ఒక ఖరీదైన బంగారు ముక్కుపుడక పంపించారు. ఆ అమ్మాయి ఆ ముక్కుపుడక ను నలుగురికీ చూపిస్తూ ఎంతో మురిసిపోతోంది, తన అత్తింటివారిని వారు పంపిన ఆ ముక్కుపుడకను తెగ పొగిడేస్తోంది, ముక్కుపుడక అలా ఉంది, ఇలా ఉంది, మా అత్తారు నాకొసమే ప్రత్యేకంగా చేయించి పంపారు, వాళ్ళు అంతటి వాళ్ళు ఇంతటి వాళ్ళు అని తెగ పొగుడుతోంది.


వాళ్ళ వెనుక వస్తున్న కబీర్ దాస్ గారి చెవిలో ఈ మాటలు పడ్డాయి, వారు వెంటనే గబగబా రెండడుగులు ముందుకు వేసి,
ఆ అమ్మాయి వద్దకు వచ్చారు. వచ్చి ఇలా అన్నారు...

"అమ్మాయి నీకు ముక్కుపుడక ఇచ్చిన మీ వాళ్ళను ఇంతలా పొగుడుతూ, నానా విధాలా కీర్తుస్తున్నవే...,
మరి?
నీకు అంతటి అందమైనముక్కుని ప్రసాదించిన వాడిని (ఆ భగవంతుడిని) ఏనాడైనా గుర్తుచేసుకున్నవా? కనీసం ఒక్కసారైనా మనసారా కీర్తించావా..?" అని అడిగారు.

ఓ సాధు జీవులరా...!
అసలు ముక్కే లేకుంటే ఇక ముక్కెర (ముక్కుపుడక) ఎక్కడ పెట్టుకుంటారు.? అని హితబోధ చేశారు.

నిత్య జీవితంలో సరిగ్గా మనం చేసేది కూడా ఇదే..!


అశాశ్వతమైన ఈ భౌతిక/ప్రాపాంచిక వస్తువులను నిరంతరం గుర్తుంచుకుంటాం, కానీ.,


అతి దుర్లభమైన ఎంతో విలువైన ఈ మానవ జన్మని ప్రసాదించిన ఆ పరమాత్మను మాత్రం ఏమాత్రం గుర్తుంచుకోము,.


ఈ శరీరంతో సంబంధం ఉన్న ప్రతీ వారినీ మనం గుర్తుంచుకుంటాము, కానీ దీన్ని మనకు ప్రసాదించిన ఆ పరమాత్మని గుర్తుచేసుకోడానికి/స్మరించడానికి మాత్రం మనకు సమయం ఉండదు.

🕉🌞🌏🌙🌟🚩

No comments:

Post a Comment