Wednesday, April 29, 2020

కాశీలో వదిలేయడం!

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

కాశీలో వదిలేయడం!
➖➖➖✍️

కాశీకి వెళ్లినప్పుడు ఇష్టమైన వాటిని ఎందుకు వదులుతారో తెలుసా?

పరమాత్మ....
ఈశరీరం,ఇంద్రియాలు,బుద్ది,మనస్సు,
అవయవాలు అన్నిటిని ఇచ్చారు!

పరమాత్మ ఇచ్చిన వీటితో ఆయనకు సేవ చేయాలి. మనస్సుతో ధ్యానం చేయటం, చేతులతో పూజ చేయటం, నాలుకతో భగవంతుణ్ణి నామస్మరణ చేయటం, కనులతో స్వామిని చూడటం, చెవులతో భగవంతుని కథలను వినటం, భగవంతుని పాదాలపై ఉంచిన తులసి మాలని ముక్కుతో వాసన చూడటం, కాళ్లతో దేవాలయాలకు, భక్తుల ఇళ్లకి వెళ్ళటం, మాట్లాడిన నాలుగు మాటలలో ఒకటి భగవంతుని గురించి మాట్లాడటం వంటివి చేస్తే సంసారంలో
ఉన్నా సన్యాసంలో ఉన్నట్టే!

కానీ కన్ను, ముక్కు, చెవులు, నాలుకకు ప్రకృతిలో లభించేవే ఇష్టం!

ఇలా చేయటం ఎవరికైనా కష్టమే.
మన ఇష్టాల కోసం భగవంతుడిని కూడా వదులుకుంటున్నాం. ఈవిధంగా చేయటం వలన మనకు కష్టాలే ఎక్కువగా వస్తాయి.

ఎక్కువగా తింటే అజీర్ణ వంటివి వస్తాయి. భగవంతుణ్ణి వదిలి ఇష్టాలను పట్టుకుంటే కష్టాలు ఎదురవుతాయి.

అదే మన శరీరానికి బాగా ఇష్టమైన వాటిని భగవంతుని కోసం వదిలితే మనసు, బుద్ధి, శరీరం ప్రసన్నంగా, ఆరోగ్యంగా ఉంటాయి.

ఇలా ఇష్టమైన అన్నింటినీ వదిలేస్తే కష్టం కాబట్టి ఒక్కో క్షేత్రంలో ఒక్క ఇష్టాన్ని వదిలితే కోరికలు తగ్గుతాయి. అలా కాశీలో వదిలిన వాటిని జీవితంలో అసలు ముట్టుకోరు.
కాశీలో వదిలిన కూరగాయ, పండు ఇలా ఏదైనా ఒకసారి వదిలితే వాటి జోలికి అసలు వెళ్ళరు. ఇలా వదలటంలో పరమార్ధం ఏమిటంటే శరీరంలో కోరికలు తగ్గి మనస్సు ప్రశాంతంగా, నిగ్రహంగా ఉంటుంది...✍️
🙏హర హర మహాదేవ శంభో శంకర🙏

🌷🙏🌷

🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

No comments:

Post a Comment