‘చిత్రగుప్తా! ఈ మానవజాతికి ఏదైనా కొత్త తెగులు సోకినదా, జనాలు పిట్టల్లా రాలిపోతున్నారెందుకు... అసలేం జరుగుతోంది భూలోకంలో?’
‘యమరాజా! అదేదో కరోనా అనే సూక్ష్మక్రిమి అట. కంటికి కనిపించని ఆ ప్రాణి బారినపడి భూలోకమంతా అల్లకల్లోలమై, హాహాకారాలు పెడుతోంది ప్రభో...’
‘ఔరా! భూలోకాన తమంతటివారు లేరని మీసం మెలితిప్పే మానవ జాతిని ముప్పుతిప్పలు పెట్టి, మున్నూరు చెరువుల నీళ్లు తాగిస్తున్న ఆ సూక్ష్మక్రిమి- ఇంకెంత గట్టి పిండమో కదా!’
‘అవును ప్రభూ! భూలోకానికి తూరుపు దిక్కున ఉన్న చీనా దేశం మీకు ఎరుకే కదా... చూడటానికి పొట్టిగా కనిపించే ఈ జాతీయులు... మన స్వర్గ నరకాల దూరానికి సరిపడా పొడవున్న అతిపెద్ద గోడను ఏనాడో కట్టిన అసాధ్యులు. ఈ కరోనా క్రిమి జన్మస్థలం ఆ చైనాయే. వాస్తవానికి కుప్పలు తెప్పలుగా, తామరతంపరగా వస్తువుల్ని ఉత్పత్తి చేయడంలో ఆ దేశం దిట్ట. అదిప్పుడు వైరసుల్ని కూడా తయారు చేసిందనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అన్నట్లు, చైనా వస్తువుల్లో పెద్ద నాణ్యత ఉండదనేది ఓ బలమైన ఆరోపణ. కానీ, ఈ చైనా ప్రాంత కరోనా క్రిమి మాత్రం మహా ఉక్కుపిండం ప్రభూ!’
‘అయ్యారే! సృష్టి చేసేడివాడు బ్రహ్మయని; శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని వేదవాక్కు కదా. అలాంటిది ఇలా కొత్త క్రిములు ఎడాపెడా ఎక్కడపడితే అక్కడ ప్రాణం పోసుకోవడం ఏమిటి? అదలా లోకమంతా జడలు విప్పి కరాళనృత్యం చేయడమేమిటి? కడు చిత్రముగానున్నది చిత్రగుప్తా!’
‘నాకూ అదే అంతుపట్టకుండా ఉన్నది స్వామీ. కాలగమనంలో కొత్త కొత్త సూక్ష్మక్రిములు పుట్టుకొస్తాయని తెలుసు. ప్లేగు, మశూచి, కలరా లాంటి సూక్ష్మక్రిముల కథా కమామిషు మనకు తెలిసినదే. కానీ, ఈ కరోనా మాత్రం భూలోకంలో ఇప్పటిదాకా పుట్టుకొచ్చిన అన్ని సూక్ష్మక్రిముల కంటే మహత్తర శక్తిమంతమైనదని లోకమంతా కోడై కూస్తున్నది ప్రభూ!’
‘అయ్యారే... ఇప్పటిదాకా ఏ గ్రహశకలాలు ఢీ కొడతాయనో, భూకంపాలు సునామీల్లాంటివి వస్తాయనో, అగ్నిపర్వతాలు బద్దలవుతాయనో, వరదలు విలయతాండవం చేస్తాయనో, అణుయుద్ధాలు సంభవిస్తాయనో ఈ మనిషి కాస్తోకూస్తో జంకేవాడు. గ్రహాంతరయానాలే సాగిస్తున్న అంతటి మనిషి ముక్కూచెవులూ పిండి, నోటికి తాళమేసి, ఒక మూలకు విసిరేసిన ఆ క్రిమి ఎంతటి బలశాలియో కదా!’
‘నిజమే ప్రభూ... ఈ క్రిమి అల్పమైనదే అయినా అది చేస్తున్న విధ్వంసం అనల్పమైనది. గతంలో ప్రపంచీకరణతో ఎల్లల్ని చెరిపేసుకున్న దేశాలన్నీ నేడు తిరిగి సరిహద్దులు మూసేసి కంచెలు నిర్మించుకున్నాయి. నేటి భూలోక దుస్థితి వర్ణనాతీతం ప్రభూ. కుల, మత, ప్రాంత, జాతి వైషమ్యాలు లేవు. పల్లెలు, పట్టణాలు, నగరాలు, దేశాలనే వ్యత్యాసం లేదు. కళలు, క్రీడలు, సినిమాలు, వివాహాలు, వేడుకల ఊసే లేదు. ఆలయాలు, మసీదులు, చర్చీల తలుపులు మూసేశాయి. ఇలా అన్నింటిని, అందరిని కట్టగట్టి ఇంట్లో గోడకుర్చీ వేయించిన ఘనత కరోనాదే. ఈ క్రిమి సృష్టిస్తున్న ఆర్థిక, ఆరోగ్య నష్టం అపారమైనదని భోగట్టా.’
‘తామే భువికి అధినాథులమని విర్రవీగిన నరుడికి తగిన శాస్తే జరిగింది సుమీ. మరి ఈ క్రిమి విపత్తు నుంచి బయటపడే మార్గాన్నేమైనా కనిపెట్టినారా ఈ మానవులు?’
‘ప్రస్తుతానికైతే అంతా అగమ్యగోచరమే ప్రభూ. ఏదో శుచీ శుభ్రతా మంత్రం జపిస్తున్నారు. సంఘజీవిగా మొదలెట్టినవాడు కొంతకాలం సంఘాన్ని బహిష్కరించమని ఉపదేశాలు మొదలెట్టాడు. తోచిన మందులేవో వాడుతున్నాడు. ప్రకృతి వనరుల్ని మితంగా వాడటం మొదలెట్టాడు. భయంతో ఒళ్లు దగ్గర పెట్టుకుని జీవిస్తున్నాడు. ఇదీ ఒకందుకు మంచిదేలే ప్రభూ!’
‘భేష్! కొంతకాలంగా వీక్షిస్తున్నాముగా, ఈ నర మానవులకు పాపపుణ్యాల చింతనగాని, స్వర్గనరకాల భయభీతిగానీ ఏవీ లేకుండా పోతున్నాయి. ప్రకృతితో సహజీవనం చేయడమే నరుడికైనా, నారాయణుడికైనా పరమోత్కృష్టమైన ధర్మం. నేను అన్నింటికీ అతీతుడను అన్న అహంభావం, గర్వాతిశయం ఎన్నడూ పనికిరాదు. అన్నట్లు, సమీప భవిష్యత్తులో మన నరక లోకంలో క్రిమిభోజన శిక్షతోపాటు, కరోనా పీడనం అనే కొత్త శిక్షను కూడా చేర్చి అమలు చేద్దాం, ఇంతకూ కరోనా తాలూకు జాతక చక్రం మన దగ్గర ఏమైనా ఉందా?’
‘హతవిధీ! ఆ దిక్కుమాలిన క్రిమికి జన్యుపటమే ఉండదట ప్రభూ. ఇక జాతకచక్రం ఎక్కడి నుంచి లభ్యమవుతుంది. ఆ నరజాతి వానర చేష్టల వల్ల ఉద్భవించిన తలాతోకా లేని ప్రాణి అది. ఆ నరులే ఆ క్రిమి తాలూకు టీకా తాత్పర్యాలు త్వరలో ఆవిష్కరిస్తారు. అందాకా మనమూ జాగ్రత్తగా ఉండవలె మహాప్రభూ.’
‘అటులైన, ఆ కరోనా రుజగ్రస్థమై తనువు చాలించిన వేలమందిలో భువి నుంచి కొంతమందైనా మన లోకానికి చేరుకుంటారు కదా... మరి వారిని ఏమి చేద్దామంటావు?’
‘ఏముంది స్వామీ. ప్రస్తుతానికి మనం కూడా నరకలోకాన్ని కొంతకాలం పాటు లాక్‌డౌన్ చేయడం మినహా వేరే గత్యంతరం లేదు ప్రభూ’
‘మరిప్పుడీ మానవ మహా విషాద యాత్రికుల్ని ఎక్కడ ఉంచాలంటావూ?’
‘మనకిప్పుడు ఒకే ఒక మార్గాంతరం ఉంది స్వామీ. కరోనా క్రిమిది ఎలాగైతే చావు పుట్టుకల మధ్య ఊగిసలాడే పరిస్థితో; అలాగే స్వర్గ నరకాల మధ్య డోలాయమానంలో తేలియాడే త్రిశంకు స్వర్గంలో వారిని కొంతకాలం ‘క్వారంటైన్’ చేద్దాం ప్రభూ!’
‘హతోస్మి!’

No comments:
Post a Comment