యధార్ధ సంఘటన
🙏 అది 1970 వ సంవత్సరం. తిరువనంతపురం(త్రివేడ్రం)సముద్రపు ఒడ్డున ఒక పెద్దమనిషి భగవద్గీత పఠనములో ఉన్నాడు. అక్కడికి నాస్తికుడైన ఒక కుర్రవాడు వచ్చి ఆయన పక్కన కూర్చున్నాడు.
ఆ కుర్రవాడు ఈ పెద్దమనిషినితో " ఈకాలంలో కూడా ఇలాంటి పుస్తకాలు చదవడం వలన, మీరంతా మూర్ఖులుగా మిగులుతున్నారు. మాకు సిగ్గుగా ఉన్నది" అని మాట్లాడము మొదలుపెట్టి, పైగా "మీలాంటి వారు ఇలాంటి పుస్తకాలు కాకుండా సైన్సు పుస్తకాలు చదువుతూంటే, మనదేశం ఈపాటికి చాలా అభివృద్ధిని సాధించి ఉండేది" అని ఆవేశంతో అన్నాడు.
ఆ పెద్దమనిషి ఆ కుర్రవాని గురించి అడిగాడు. అప్పుడా కుర్రవాడు " నేను కలకత్తానుండి వచ్చిన సైన్స్ పట్టభద్రుడిని. ఇక్కడ భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్లో పనిచేయటానికి వచ్చాను" అని గర్వంగా చెబుతూ"మీరు వెళ్ళి ఈ భగవద్గీత లాంటి పుస్తకాలు కాకుండా సైన్సు పుస్తకాలు చదవమని, ఇలాంటి పుస్తకాలు చదవడం వలన జీవితంలో సాధించేది ఏదీ ఉండదని" ఓ ఉచిత సలహా కూడా ఇచ్చాడు.
ఆ పెద్దమనిషి నవ్వి, అక్కడనుండి వెళ్ళడానికి ఉపక్రమించాడు. ఆయన అలా లేవగానే నలుగురు రక్షకదళ భటులు ఆయనను చుట్టుముట్టి, ఆయనకు రక్షణగా నిలబడ్డారు. ఆయన కోసం ఒక అధికార ఎర్రబుగ్గ కారు వచ్చింది. ఇదంతా చూసి, ఆ కుర్రవాడు భయపడి, ఆ పెద్దమనిషిని "మీరెవర"ని అనడిగాడు. ఆ పెద్దమనిషి తనపేరు "విక్రంసారాభాయి" అని చెప్పాడు. ఆ కుర్రవానికి తను పనిచేయబోయే సంస్థకు ఆయన ఛైర్మన్ అని అర్ధం అయ్యింది. అప్పటికి భారతదేశంలో 13 రీసెర్చ్ సంస్థలు విక్రం సారాభాయి పేరుమీద నడుస్తున్నాయి. అణువిజ్జాన పధకాలు రచించే సంస్థకు ఆయన అధిపతి. అప్పుడు ఆ కుర్రవాడు వలవలా ఏడుస్తూ, ఆయన కాళ్ళమీద పడ్డాడు. అప్పుడు విక్రం సారాభాయి చెప్పిన గొప్ప విషయం ఇది. "ఈ విశ్వంలో ప్రతీ వస్తువు పరమాత్మ చే సృష్టించబడినదే. అది పురాణకాలం కావచ్చును, మహాభారత సమయం కావచ్చును, ప్రస్తుత సమయం కావచ్చును. మిత్రమా!! దైవాన్ని ఎన్నడూ మరువకు" అని ఆ కుర్రవానికి బోధించాడు.
ఇప్పటి నాస్తికులు ప్రతిదీ హేతువాదం చేయవచ్చును. కానీ సైన్సును అభివృద్ది చేసింది మటుకు ఆస్తికులే అని చరిత్ర చెబుతోంది. దైవం నిత్య సత్యం. భగవద్గీత ఒక అమోఘమైన విజ్ఞానఖని. దానిలో చెప్పినది ఆచరించి ప్రపంచంలో ఎందరో లాభం పొందుతున్నారు. ప్రపంచములో ఉన్న సమస్యలన్నిటికీ భగవద్గీతలో పరిష్కారాలున్నాయి.
శ్రీమత్భగవద్గీత సకలశాస్త్రాలసారం !.🙏

No comments:
Post a Comment