Tuesday, April 28, 2020

నిద్ర అతి విలువైన సంపద.

నిద్ర అతి విలువైన సంపద.
భాహ్య జగత్తు కన్నా అంతర జగత్తు శ్రేష్టం. చెవిలో అద్భుతమైన శ్రావణ కేంద్రం ఉంది . ఇది ఎంతో దూరం నుండి శబ్దాలను విన గలదు కంఠ ప్రదేశంలో ఒక నిద్రా స్థానం ఉంది. మన జాగ్రదవస్థలో కలిగే శ్రమనంతటిని ఇది పోగొడుతుంది.

🦃 మానవుడి జాగ్రదవస్థలో అంటే, పగటిపూట ఎంత సంపాదించినా చివరకు మిగిలేది శ్రమ మాత్రమే.

🔥 గుర్రము మీద స్వారీ చేసినా, మరి యే ఇతర వాహనంలోగాని, ప్రయాణం చేసిన ప్రొద్దుగుంకే సమయానికి అలసిపోతాడు మానవుడు.

🦃 ధనము సంపాదించిన, బంగారం సంపాదించిన, రాజ్యము సంపాదించిన, రోజంతా గడిచిన తరువాత చివరికి మిగిలేది అలసట.

🔥 ఇలా ఈ బాహ్య ప్రపంచంలో ఎంత పని చేసిన భోగాభాగ్యము లచే ఆనందం పొందిన రోజు ముగిసిన తరువాత చివరికి మిగిలేది అలసట మాత్రమే.

🌹 ఈ విశ్వానికి నీవు ప్రభువైన చివరికి అలసట తప్ప ఇంకేమియు మిగలదు.

🦆 అలసట పోగొట్టుకోవడానికి రాత్రి గాని లేదా పగటి పూట గాని నిద్ర పోయినప్పుడు , శ్రమ అంతా " కంఠ స్థానం"లో నివారణ అవుతుంది. మనకు నిద్ర వచ్చేది ఆ స్థానంలోనే.

🔥 మీరు సంపాదించిన సంపద గురించి మరచి పోకలిగినప్పుడే మీకు నిద్ర పడుతుంది లేకపోతే నిద్ర మాత్రలు వేసుకోవాలి.

నిద్ర నుంచి లేచినప్పుడు హాయిగా ఉంటుంది .ఉత్సాహంగా ఉంటుంది. నిద్రరానప్పుడు అశాంతంగా ఉంటుంది. పిచ్చి పట్టినట్లు ఉంటుంది..... ఎంతో బాధాకరంగా అలసటగా ఉంటుంది.

🔥 నిద్ర నిజంగా సంపద...... కంఠం దీని స్థానం. ఇది విశుద్ధ చక్రం.

🦆 కావున ప్రతిరోజు ఒక గంట "ధ్యానం " చేస్తే మనము మూడు గంటలు నిద్ర పోయినంత శక్తి వస్తుంది.

🥬🥑🍆🥕🍠🌽🥦🥒🥥🍅🍇🥜🥐🥖🍒🍉🍍

🧘 నోటు:-- మానవుల ఆహారము "శాఖాహారం". ప్రతిరోజు "శాఖాహారం" నే భుజింపవలెను. ప్రతిరోజు ప్రతి వ్యక్తి " శ్వాస పై ధ్యాస" పెట్టి "ధ్యానం" చేయాలి.
🧘🧘🧘🧘🧘🧘🧘🧘?

No comments:

Post a Comment