ఈశ్వరో గురు రాత్మేతి.....
"ఈశ్వరోగురురాత్మేతి" అంటే ఈశ్వరుడు, గురువు, ఆత్మ అందరూ ఓక్కటే..
మానవుడు అసంతృప్తితో ఆరంభించి. అతడు ప్రపంచముతో తృప్తి చెందక ఈశ్వర ప్రార్ధనతో నిర్మలమగును. కోర్కెలను నెరవేర్చుకోనుటకు ప్రయత్నించి, అప్పుడు అందున అతని మనస్సు నిర్మలమగును.
మానవుడు ఎప్పుడైతె తన శారీరక వాంఛలను నెరవేర్చుకొనుట కంటే అధికముగా భగవంతుడుని తెలిసు కొనుటకు గాఢముగా అభిలషించునో అపుడు భగవదనుగ్రహము అభివ్యక్తమవుట మొదలవును. భగవంతుడు గురు రూపమును ధరించి భక్తునకు కనిపించి అతనికి సత్యమును బోధించి తన ప్రబోధములతో సంపర్కముతో మనస్సును నిర్మలము గావించెదరు.
అప్పుడు ఆ మనస్సు బలమును పొంది అంతర్ముఖమగుటకు సమర్ధమై. అది ధ్యానముతో ఇంకను అధికముగా పవిత్రమయి చివరకు కొంచెము కూడా క్షోభము లేకుండా నిశ్చలముగానుండును. ఆ నిశ్చలత్వమే ఆత్మ.
గురువు బాహ్యరూపము గలవాడుగా, అంతర్గతుడుగా రెండు విధములుగా ఉండును. ఆయన బాహ్యరూపము వలన మనస్సుకు అంతర్ముఖమగుటకు ప్రేరణనిచ్చును. లోపలి నుండి ఆయన మనస్సును ఆత్మవైపు లాగి నిశ్చలత్వమును సాధించుటకయి మనస్సునకు సాయపడును. అదే అనుగ్రహము.
కావున ఈశ్వరునకు, గురువునకు, ఆత్మకు మధ్య ఎటువంటి భేదము లేదు...
|| ఓం నమః శివాయ ||

No comments:
Post a Comment