Thursday, April 23, 2020

నమస్కారం మహత్తు

నమస్కారం మహత్తు ...

🍁🍁🍁🍁


-------సాక్షి పత్రిక సేకరణ.

నమస్కారాన్ని దండం అని, దణ్ణం అనీ అంటాం. తనపట్ల గౌరవం ప్రదర్శించి నమస్కరించారు అనే సంతోషంతో పది విధాలుగా సహాయ పడటానికి సిద్ధం కావటం జరుగుతుంది. నమస్కరించారు అంటే ఎదు టివారిని తన కన్నా అధికులు అని అంగీకరించినట్టు. ఇది వారికి సంతోషం కలిగించే విషయమే కదా. దీని ఫలితం ఎంత సానుకూ లంగా ఉంటుందో కొన్ని సంఘటనలు తెలియచేస్తాయి..

యుద్ధం ప్రారంభం అవటానికి ముందు ధర్మరాజు రథం దిగి పాదచారి అయి కౌరవ పక్షం వైపు నడిచాడు. అందరూ తెల్లబోయారు. ధర్మరాజు కౌరవ పక్షాన ఉన్న పెద్దలకు నమస్కరించాడు. భీష్మపితామ హుడు ఆశీర్వదించి, 'నీవీ పని చేయకపోతే కోపం వచ్చి ఉండేది' అని అన్నాడు. అటువంటి వారి ఆశీర్వాదాలు ఫలిస్తాయి. అర్జునుడు కూడా

తన తొలిబాణం ద్రోణాచార్యుడి పాదాల వద్ద వేసి తన గురుభక్తిని ప్రదర్శించాడు. పాండవుల విజయా నికి ఈ నమస్కార బాణాలు ఎంతో తోడ్పడ్డాయి.

మనం ప్రాణం లేనివని అనుకునే వస్తువులు జ్యోతిర్మయం కూడా నమస్కారానికి తలవంచటం చూడవచ్చు. విశ్వామిత్రుడు చెప్పటంతో శివధనుస్సుని చూడాలని ముందుకెళ్ళాడు శ్రీరామచంద్రుడు. ముందుగా దానికి నమస్కరించాడు. ఆపై చేతిలోకి తీసుకుని నారి తొడిగే ప్రయత్నం చేశాడు. తనకు నమస్కరించిన రాముడి వినయానికి మురిసిపోయిందేమో శివధనుస్సు వంచుతుంటే

విరిగి పోయింది. అలాగే మత్స్యయంత్రాన్ని ఛేదించటానికి వెళ్లినప్పుడు ధర్మరాజు అనుమతితో ముందుకు వెళ్ళిన బ్రాహ్మణవేషంలో ఉన్న అర్జు నుడు చేసిన మొదటిపని ఆ విల్లుకి నమస్కరించటం. ఫలితం అందరికీ తెలిసిందే. మనకి ఇప్పుడు ప్రత్యక్షంగా కనపడే ఉదా: చప్పట్లు కొట్ట మన్నా, దీపాలు వెలిగించమన్నా, స్వీయనియంత్రణ పాటించమన్నాఅధికారికంగా శాసించినట్టు కాక, చేతులు జోడించి అడగటం వల్ల అనే షప్రజానీకం సంతోషంగా పాటించారు కదా. అదీ నమస్కారం యొక్క మహత్తు. అదే విధంగా కరోనా మహమ్మారితో యుద్ధంలో చేయి కల పటంకాక, మన చేతులే జోడిస్తే విజయం మనదే అవుతుంది.

- డాక్టర్ ఎన్. అనంతలక్ష్మి

No comments:

Post a Comment