Friday, May 15, 2020

మంచితనం, మోసం

💐💐💐మంచితనం, మోసం

ఏంటి అండీ, మంచితనం, మోసం రెండూ ఒకే దగ్గర ఉంటాయా? అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటె ఇది కలియుగం కదా. మంచి చెడు అనేవి ప్రతీ ఒక్కరి లో ఉంటాయి. సమయాన్ని బట్టీ, ఆలోచన లు మారుతూ ఉంటాయి. మంచి ఆలోచన లు వచ్చినప్పుడు మంచి పనులు, చెడు ఆలోచన లు వచ్చినప్పుడు చెడు పనులు చేస్తాం.🤷‍♀🤷‍♂ మన ఆలోచన లని మనం కంట్రోల్ చేసుకోవడానికి యోగా, ధ్యానం ఎంత ముఖ్యమో, మన స్నేహితులు ఎవరూ, అనేది ఎప్పుడూ గమనించు కుంటూ ఉండాలి. అది గమనించడం ఎలాగో మాకు తెలీదు అంటారా? 😊ఏమీ లేదండి మనం ఎవరితో నైనా స్నేహం మొదలు పెట్టినప్పుడు, మనల్ని మనం గమనించాలి. మన లో ఏదన్నా మార్పు వస్తుందా అని. మార్పు ఏమీ లేదు, వారి ఆలోచన మన ఆలోచన ఒకేటే విధమ్ గా ఉన్నాయ్ అంటే, ప్రమాదం ఏమీ లేదని. కొత్త స్నేహం వల్ల, మనకీ గాని, మనవాళ్ళకి గాని ఇబ్బందులు వస్తున్నా, మనలో చెడు ఆలోచన వచ్చే మర్పు వచ్చినా, వారితో మనకీ ప్రమాదం అని మనం తెలుసుకోవాలి. 🤷‍♂🤷‍♀తెలుసుకోకపోతే ఏమవుతుంది అనుకుంటున్నారా,??
ఇంక మనం తెలుసుకోవడానికి ఏమీ ఉండదు.😄😄 మనం పూర్తిగా ప్రమాదం లో పడిపోయినట్లే. స్నేహం అంటే, స్నేహం గురించే చెప్పాను, ఈకాలం లో ఎక్కువగా కనిపించే, సంబంధాల గురించి కాదు. అలాంటివి ఐతే ఖచ్చితంగా అన్నీ కుటుంబాల కీ ప్రమాదమే. 🙊🙊
మనం స్నేహం చేసిన వ్యక్తి ద్వారా, మన లో మంచి మార్పు వస్తే, అది మంచి స్నేహం. చేడు గా మార్పు వస్తే అది చెడ్డ స్నేహం. 🙉🙉🙈🙈🙊🙊
ఎలాంటి స్నేహం అయినా, ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటే, వారికి, వీరికీ ఇద్దరికీ ఇబ్బంది ఉండదు. అది లిమిట్స్ దాటి వెళ్లకుండా చూసుకుంటే, ఆ స్నేహం ఎక్కువ కాలం నిలబడుతుంది.👍👍👍 ఎలాగ అంటే, ఇంతకుముందు కాలం లో ఐతే, స్నేహితులు కలవాలి అంటే, స్కూల్ లోనో, కాలేజ్ లోనో, లేదా వారి ఇళ్లల్లో నో, కలిసి కొంత సేపు నవ్వుతూ మాట్లాడుకొనేవాళ్ళు. దాని ద్వారా కొత్త ఎనర్జీ వచ్చి, మళ్ళీ ఎవరి పనులలో వాళ్ళు ఉండేవాళ్ళు.💐💐💐💐💐 అలాంటి స్నేహాలు, ఎన్ని సంవత్సరాలు అయినా, స్వచ్ఛం గా, ఉండేవి. అలాంటి బంధాలు జీవిత కాలం ఉంటాయి. 🙏🙏🙏
ఇంక ఇప్పుడు చుస్తే, అంతా, నెట్ మహిమ. నువ్వు తుమ్మవా, దగ్గవా, కుర్చున్నావా, నిల్చున్నావా అని, ఇలాంటి వి ఎక్కువై పోయాయి. నాగురించి చెప్తున్నాను అనుకోకండి. సహజం గా అందరూ అలాగే అనుకుంటారు. 😄ఇంక వీడియో కాల్స్ వచ్చి, ఇంకా, వికారం గా తయారయ్యింది ప్రపంచం. నా మాటలు ఎటో వెళ్లిపోతున్నాయి కదా 🤦‍♀
స్నేహం కాస్త ఎలా అవుతుంది అంటే, మొదట్లో మంచి గా వివరాలు కనుక్కున్నట్లు ఉన్న స్నేహం కాస్త, వారి వివరాలు ఇంకా లోతు గా తెలుసుకోవాలి అనే ఆలోచన కీ వచ్చేస్తారు, తరువాత వీడియో కాల్స్, ఇలాగ వారికి తెలియ కుండా నే, అధర్మం ఎక్కువ అవుతుంది. ఇంకొకరి గురించి తెలుసుకోవాలి అనుకోవడమే తప్పు. అలాంటి వారితో జాగ్రత్త. 🙈🙉🙊
ఇంక మనలో మంచి మార్పు, కొత్త స్నేహం వల్ల వస్తోంది అని మనం గమనించినట్లయితే, అదే మంచి స్నేహం. అదే సత్సంగం. 🙏🙏
సత్సంగం లో అనవసరం అయినా విషయాలు చర్చ ఉండదు. అవసరం మేరకే, మాట్లాడే ప్రతీ మాట ఇద్దరికీ ఉపయోగ పడేదిగా ఉంటుంది.🙏🙏 అలాంటి స్నేహం దొరికినప్పుడు, జాగ్రత్తగా దానిని నిలబెట్టుకోవాలి.🤷‍♂🤷‍♀ ఎందుకంటే, అలాంటి స్నేహితులు దొరకడం కష్టం. అలాంటి వారిని కూడా, మాటల తో హింసించి, మీరు ఎలా మంచి పనులు చేస్తూ ఉంటారు? మీకు టైమ్ ఎక్కడ దొరుకుతుంది? మీకు శక్తి ఎలా వస్తుంది? అని వారిని ఇబ్బంది పెట్టే వాళ్లే ఎక్కువ ఉంటారు. 🤦‍♀🤦‍♀
ప్రయత్నం చేస్తే మనం కూడా, అలాంటి మంచి వ్యక్తులు గా మారుతాం. మార్పు మనలో రావాలి కానీ, వాళ్ళ ని అనుకుంటే లాభం లేదు కదా. మంచి స్థాయి లోకి వచ్చిన వారి జీవిత చరిత్ర లు, చదువుతూ ఉంటే, మనం కూడా మంచి వ్యక్తులు గా అవుతాం.🙏🙏🙏🙏🙏 మనుషులు కంటే, పుస్తకాలు మంచి స్నేహితులు. మంచి పుస్తకాన్ని రోజూ చదవడం అంటే, సత్సంగం చేసినట్లే. జీవితం లో నేర్చుకోవలసినవి ఎన్నో ఉంటాయి, పుస్తకాల ల్లో. 🙏🙏
100 ఏళ్ళు వచ్చే వరకూ మంచి విషయాలు నేర్చుకున్నా కూడా, నేర్చుకోవలసినవి ఉంటూనే ఉంటాయి.
నేను చదివిన కథ లో, ఒక ఆవిడ రెండూ చేతులకు రెండు, రెండు గాజుల తో పని చేస్తుంటే, శబ్దం వస్తుంటుంది. ఆ శబ్దం రాకుండా ఉండాలి అంటే, ఒక్కొక్క గాజు నూ తీసివేసి, ఒక్కొక్క గాజు మాత్రమే చేతికి ఉంచి, పనిచెయ్యడం వల్ల అప్పుడు శబ్దం రాదు. మనం కూడా ఆ, గాజులు లాగా, ఒక్కొక్కరు కలిసే కొద్దీ మాటలు ( శబ్దం )ఎక్కువ అవుతాయి. అవే గొడవలు అవుతాయి. అలాకాకుండా, ఒక్కొక్క గాజు లాగా, ఉన్నప్పుడు శబ్దం రాదు.🤷‍♀🤷‍♂ ఒక్కరు గా ఉంటూ మనల్ని మనం తెలుసుకొనే ప్రయత్నం చెయ్యాలి. ఇతరుల గురుంచి తెలుసుకోవడం వల్ల ఎలాంటి లాభము, ఉండదు. అలాగని ఎవ్వరితో స్నేహం చెయ్యద్దని చెప్పడం లేదు. అతిగా మాటలతో, అనర్ధాలు తెచ్చుకునే కంటే, ఒక మంచి పుస్తకం చదవడం ఏంతో ఉత్తమం. 💐💐💐రామాయణ, భారత, భాగవతాలు నిత్యం చదువుతూ ఉంటే, మంచి స్నేహితులు దొరికినట్లే. దైవ దర్శనం కలిగినట్లే. స్వామి కార్యం, స్వ కార్యం రెండూ అయినట్లే. ప్రతీ ఇంట్లో అలాంటి గ్రంధాలు పెద్దలు చదివితే, పిల్లలు కూడా, చదివే ప్రయత్నం చేస్తారు పెద్దలని చూసి. 🙏🙏

లోకా సమస్త సుఖినోభవంతు 🙏
😊😊😊😊😊😊😊😊
తస్మాత్ జాగ్రత్త 🙏మీ మీనాక్షి 🙏

No comments:

Post a Comment