Friday, May 1, 2020

కరోనాపై అసలు విషయం తెలుసుకోని ప్యానిక్ అవకండి..

ఎంత మర్యాదగా,
జాగ్రత్తగా చెప్పినా
వినడంలేదు...

ఇప్పుడు చెబుతాను వినండి...

కరోనాపై అసలు విషయం తెలుసుకోని ప్యానిక్ అవకండి..

ఇది భ్రమ కాదు.
పక్క దేశాల్లో జరుగుతున్న వాస్తవం.

... చదివి పాటిస్తే మంచిది ...

నువ్వు పీల్చేది మాములు గాలి కాదు...

నువ్వు పట్టుకున్నవన్ని శుద్దమైన వస్తువులు కాదు...

నీ చుట్టు ఉన్నవారంతా ఆరోగ్యవంతులు కాదు...

నీ కంటికి కనబడేదంతా నిజం కాదు...

ఇప్పటివరుకు
కరోనా వచ్చినవారు, వారి పక్కింటివారు, వీధిలోని వారు, ఏరియావాళ్లు మీలానే ఆలోచిస్తూ మాకు రాదు అనుకున్నవారే..."కరోనా నాకు దగ్గరగా లేదుగా...!" అని...

మిల్లి సెకెన్ లో అంటుకోవడానికి నీ చుట్టూ కరోనావైరస్ ఉంది...

ఏమీ అవ్వదు అనుకుంటే నువ్వు, నీ కుటుంబం, నీ బంధువులు, నీ స్నేహితులు తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే...

మనకంటే ఎంతో..
ఎంతెంతో డెవలప్‌ అయిన దేశాల్లో మరణమృదంగం మోగుతోంది....

సామాన్యుల నుండి అద్ధ్యక్షులు, అపర కుబేరులు, సెలబ్రెటీలు, వీఐపీలు అందరూ కరోనా బారిన పడ్డారు....

కరోనా వస్తే ఏమౌతుంది...?

జస్ట్ జ్వరం, దగ్గు అంతేగా...!

సీజనల్ వ్యాధిలాగా నాలుగురోజులు ఉండి పోతుంది అనుకోకండి....

దగ్గు దగ్గి దగ్గి
ఊపిరి ఆగిపోతున్న ఫీలింగ్....

ఊపిరి తీసుకోవడం కష్టం అవుతుంది...

ఆ దగ్గు వల్ల
లంగ్స్ దెబ్బతింటాయి..

లివర్ ఇన్ఫెక్షన్ వస్తుంది...

గుండె ఆగిపోతుంది...

బ్రతకాలి అనే కోరిక తప్ప ఎవరూ ఏం చేయలేరు...

దగ్గు, జ్వరం విపరీతంగా ఉన్నా కూడా దాన్ని
తట్టుకోగలినవాళ్లు తప్ప ఎవరూ బ్రతకరు...

(ఇమ్యూనిటీ పవర్ ఉన్నవారికి బ్రతికే ఛాన్సెస్ ఎక్కువ)

హాస్పిటల్ లో చేర్చటానికి నీ వారు ఉండకపోవచ్చు.

ఈ జబ్బు విస్తరించి న తర్వాత కనీసం హాస్పిటల్ లో చేరాలంటే బెడ్డు కూడా దొరక్క పోవచ్చు.

ఒకవేళ నువ్వు హాస్పటల్ లో ఉంటే నీ
కన్న తల్లి/తండ్రి..,

కొడుకు/ కూతురు..,

భార్య/భర్త ఎవరిని కలవలేవు...

కలిస్తే వారు
ప్రమాదంలో పడతారు...

పదే పదే దగ్గేటప్పుడు, తుమ్మేటప్పుడు ఎందుకు
పుట్టానురా అనుకుంటావ్...

ఈ దగ్గు, జలుబు భరించేకన్నా
పోతేబాగుండు అనిపిస్తుంది...

కాని
పోలేవ్...

"కాపాడండి డాక్టర్" అని అరిచిగీపెట్టినా వినటానికి కూడా పక్కన ఎవరూ ఉండక పోవచ్చు. ఉన్నా ఎవరూ ఏం చేయలేరు...

మనం పోతే కనీసం బాడీని కూడా ఇంటికి పంపరు...!

కనీసం మిగిలిన
బూడిద కూడా ఇవ్వరు...!!

కుక్కచావు అంటాం కదా..!

దాని కంటే
దారుణంగా ఉంటుందీ చావు...!!

ఇది అవసరమా....?!
మనకి అవసరమా...???

ఎందుకు
ఈ నిర్లక్ష్యం? ఎందుకు ఈ ధీమా...!

ప్రాణం అంటే ఎవరికి తీపి ఉండదు...

అనవసరంగా
మన, మనవాళ్ల ప్రాణాలు తీసుకుందామా...??

పొరపాటున
బయటికివస్తే...

మొహానికి ఖర్చీఫ్, బయటవారికి దూరం, వ్యక్తిగత శుభ్రత...

ఇంతే కేవలం ఇంతే..

80% కరోనా నీ దరికి చేరకుండా ఉంటుంది...

అత్యవసరం అయితేనే బయటకి రండి...

మనం బ్రతికి ఉంటేనే గా మన ఇంట్లోవాళ్లు సుఖం గా ఉండగలరు...

గమనించండి :-
పోతే పోయింది
ఓ నెల...

మహా అయితే
కోలుకోవడానికి...
కష్టాన్ని, నష్టాన్ని
పూడ్చుకోవడానికి...
నెలో, ఏడాదో పడుతుంది...

భరిద్దాం...

జీవితాన్ని కోల్పోవడం కన్నా...

జీవితంలో
"నెల" కోల్పోవడం బెటరే కదా...

ఆలోచించండి ...

అవసరమైతే తప్ప
బయటకి రాకండి* ...

పక్క దేశాల ప్రజలు ఎదుర్కొంటున్న నరకం మనకు ఎదురవకుండా చూసుకుందాం

No comments:

Post a Comment