Thursday, May 7, 2020

ఒకే ఒక్క ఐడియా మొత్తం స్ఫూర్తినే దెబ్బతీసింది.

ఒకే ఒక్క ఐడియా మొత్తం స్ఫూర్తినే దెబ్బతీసింది.

ఓ ఐడియా మీ జీవితాన్నే మార్చేస్తుంది అనేది ఓ కార్పొరేట్ కంపెనీ ట్యాగ్ లైన్. ఇది నిజమని నిరూపించాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. యావత్ దేశం కరోనా సంపూర్ణ లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మద్యం అమ్మకాలపై తీసుకున్న నిర్ణయం ప్రజలకు ప్రాణ సంకటంగా మారింది.

మొత్తం 40 రోజులుగా చేస్తోన్న దీక్షపై చావు దెబ్బ కొట్టింది. మందు ద్వారా వచ్చే ఆర్దిక వనరులేపై చూపే తప్ప ముందు చూపులేని దుందుడుకు నిర్ణయంగా కనిపించింది.
ఓ రకంగా యావత్ భారతావని బిడ్డల్ని కంగారు పెట్టించింది ఈ నిర్ణయం. ఈ నిర్ణయం గురించి మాట్లాడే ముందు గత 40 రోజులుగా యావత్ దేశ ప్రజల సంకల్పం కోసం మాట్లాడుకోవాలి. 130 కోట్ల మంది ఒక్క తాటిపై వచ్చారు. కరోనా కట్టడి కోసం కట్టుబడి ఉన్నారు.

చప్పట్లు కొట్టమంటే కొట్టారు. గంటలు వాయించమంటే వాయింటారు. దీపాలు వెలిగించారు. ఇలా ఏది చెప్పినా తూచ తప్పకుండా చేశారు. బహుశా ప్రపంచ చరిత్రలో ఇంతమంది ఇంత క్రమశిక్షణగా మెలిగిన సందర్భం వేరొకటి లేదు.
ఓరకంగా ప్రజలు తమ బాధ్యాతాయుతమైన ప్రవర్తనతో ప్రభుత్వాలకు బాసటగా నిలిచారు. ఇవి ప్రభుత్వాలకు ఓ గొప్ప బలం చేకూరాయి. అభివృద్ది చెందిన అమెరికా వంటి దేశాల్లో కూడా ప్రజల్ని కంట్రోల్ చెయ్యడం అక్కడ ప్రభుత్వాలకు సాధ్యం కావడం లేదు. కానీ మన దేశంలో ఒకే ఒక్క పిలుపుతో బడిపిల్లల మాదిరిగా కరోనా కట్టడికి ఇళ్లకే పరిమితం అయ్యారు.
ప్రత్యేక్ష దేవుళ్లుగా అందరి ప్రాణాల్ని కాపాడేందుకు రేయనక పగలనకా తమ ఇళ్లకు కూడా వెళ్లకుండా ప్రాణ దాతలయ్యారు భారతీయ వైద్యులు. సోషల్ మీడియా లో వైద్యుల సేవలపై వచ్చిన వీడియోలు కంటిలో నీరు నింపి మనసుల్ని తడిపేశాయి. సొంత కుటుంబాలకు దూరంగా అరకొర సదుపాయాల మధ్యే తమ ప్రాణాలను పణంగా పెట్టి వైద్యం చేశారు. చేస్తున్నారు.

మరోవైపు పోలీసులు యావత్ దేశ వ్యాప్తంగా పోలీసులు తమ అద్వితీయమైన సేవతో చరిత్రలో ఎన్నడూ లేనంతగా మనసుల్ని గెలిచారు. మలమల మాడే ఎండలో మీకోసం నేనుసైతం అంటూ పాపం పోలీసన్న రోడ్లపై పడిగాపులు కాసారు. తన సొంత బిడ్డల్ని కూడా ఆత్మీయంగా కౌగలించుకోలేని దుస్థితిలో సేవ చేశారు. ఎందుకోసం అందరి కోసం. తనను తాను సమిధిగా మార్చుకున్నాడు.
మీడియా రంగం పని తీరు కోసం ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎందుకంటే వైద్యులకు, పోలీసులకు కనీసం ఉద్యోగ భద్రతన్నా ఉంటుంది. పాపం వీరికి ఏముంటుంది. కనీసం రేపన్నది ఉంటుందో లేదో కూడా తెలియని పరిస్థితి. అయినా పాజిటివ్ కేసులకు అత్యంత చేరువలో సేవ చేశారు. ప్రాణాలను ఫణంగా పెట్టారు.

వయసు పైబడ్డ ముసలి వారు. తమ సొంత బిడ్డల్ని సైతం చూడలేని పరిస్థితి. వేరే ప్రాంతాల్లో ఉన్న వారి దగ్గరకు వెళ్లలేని దుస్ధితి. పాపం పండు వయస్సులో ఒంటరిగా బిక్కుబిక్కు మంటూ కాలం వెళ్ల దీస్తున్నారు. చంటిపిల్లలు, గర్బిణిలు, వికలాంగులు ఇలా ఒకలా ఇద్దరా అందరూ తమ అత్యవస అవసరాల్ని సైతం పక్కన పెట్టారు. రోడ్డెక్కితే ఎక్కడ స్ఫూర్తి దెబ్బ తింటుందో, ఎక్కడ ఈ మహమ్మారి బారిన పడతామో అని భావించారు. అనేక అంశాల్లో సర్దుకునే ఉన్నారు.

విద్యార్ధులకు సెలవులిచ్చారు. పబ్లిక్ పరీక్షల్ని పోస్ట్ పోన్ చేశారు. మిగతా తరగతులకు పరీక్షలు లేకుండానే ప్రమోట్ చేశారు. ప్రస్తుత విద్యా సంవత్సరాన్ని తగ్గించారు. వచ్చే విద్యా సంవత్సరాన్ని ఆలస్యంగా ప్రారంభిస్తామని ప్రకటించారు. ప్రభుత్వ ప్రతి నిర్ణయాన్ని అందరూ గౌరవించారు. సహకరించారు. మన మంచికే కదా అని సంతోష పడ్డారు.


రెక్కాడితే గాని డొక్కాడని బతుకులు కూడా రోడ్డెక్కలేదు. చిరు వ్యాపారాలపై నెట్టుకొస్తున్న జీవితాలు ఇంటిన పడ్డాయి. రేపేంటో వారికి తెలియని పరిస్థితి. తెలంగాణ ముఖ్యమంత్రి చెప్పినట్లు బతికుంటే బలిసాకు తిని బతకొచ్చులే అనుకున్నారు. అంతేగాని బరితెగించి ప్రవర్తించలేదు.

వలస కార్మికుల కష్టం దాని పాపం ప్రభుత్వాల్ని ఎప్పటికీ విడవదు. వారి దుస్థితికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే పూర్తి బాధ్యత. వీరి కష్టం కరోనా కంటే పెద్దది. ఎవరూ సాయం చేయకపోయినా పిల్లా, పాపలతో వందలాది కిలోమీటర్లు నడిచే ఊళ్లకు వెళ్లిన వారి ఉసురు తగలకమానదు. ఈ పాపాన్ని కడిగే పానీయమే లేదు.

ఇంతమంది ఇన్ని రకాలుగా సహకరిస్తే, ఇన్ని వర్గాలు ఇన్ని రకాలుగా ఇబ్బందుల్ని ఎదుర్కొని, త్యాగాలు చేసి ప్రభుత్వాలకు సహకరిస్తే ప్రభుత్వాలు చేసిందేమిటి. సర్వనాశనం. ముందు చూపులేని ఒకే ఒక్క దిక్కుమాలిన నిర్ణయంతో యావత్ దేశాన్ని కరోనా ఒడిలోకి నెట్టేసినట్టైంది.

కరోనా కట్టడికి అద్భుతాలు చేస్తున్నాం. అది చేస్తున్నాం. ఇది చేస్తున్నాం. అని ఊదరగొట్టిన ప్రభుత్వాలు ఒక్కసారిగా మద్యం షాపులు తెరిస్తే ఏమౌతుందో ఊహించలేరా. అంటే అంత అజ్ఞానంలో ఉన్నారా. అసలే అది వ్యసనం. ఆ వ్యసనానికి అలవాటు పడ్డవాడి ప్రవర్తన ఎలా ఉంటుందో, అందులోనూ ఇన్ని రోజుల తర్వాత ఒక్కసారిగా మందు అందుతోంది అనే వార్తను అతడు ఎంత ఉబలాటంగా ఫీలవుతాడో ఆ మాత్రం అంచనా వెయ్యలేరా.

మధ్యతరగతి వాడు మందుల కోసమో, పాప పాల కోసమో బయటకు వెళ్తే సవాలక్ష జాగ్రత్తలు పాటించాడు. పోలీసులకు సహకరించాడు. అలాంటిది మద్యం దుకాణాల దగ్గర పరిస్థితి అసహ్యాన్ని కలిగించింది. యావత్ ప్రపంచం అసహ్యించుకునేలా చేసింది.

మద్యం షాపులు తెరిచాక సోషల్ డిస్టెన్స్, పరిశుభ్రత, కరోనా కట్టడి చర్యలు అన్నీ గాల్లో కలిసిపోయాయి. కరోనాను ప్రతి ఒక్కరికి చేరువ చేసే ప్రమాదాన్ని తెచ్చాయి. ఏపీలో మద్యం తాగి, ఆ తర్వాత ముగ్గురు ప్రాణాలు పోగొట్టుకున్నారన్న వార్తలు వచ్చాయి. వీటికి జవాబు ఎవరు చెబుతారు. ఎవరు బాధ్యత తీసుకుంటారు. రోడ్డున పడ్డ ఆ కుటుంబాల్ని ఎవరు ఆదుకుంటారు.

గత కొద్ది రోజులుగా కరోనా పట్ల ప్రభుత్వ పెద్దలు చేస్తున్న ప్రకటనలు కూడా చాలామందిని కలవరానికి గురి చేశాయి. భరోసా ఇవ్వడంలో ఊగిసలాట ధోరణినే ప్రదర్శిస్తూ వచ్చారు. కేంద్ర ప్రభుత్వమైతే అసలు ఏం చేస్తుందో కూడా స్పష్టంగా చెప్పలేని పరిస్థితిలోకి వెళ్లిపోయింది.

ప్రపంచం భారత్ వైపు చూస్తోంది అని బాకాలు ఊదారు. నిజమే నిన్నటి ఒకే ఒక్క సంఘటనతో యావత్ ప్రపంచం నివ్వెర పోయేలా చేసారన్నది నిజం. బహుశా అందుకే అనుకుంటా రానున్న రోజుల్లో కరోనా మనలో ఓ భాగం అని హింట్ ఇచ్చుంటారు మహానాయకులు. పిచ్చి జనం వారికే అర్ధం కాలేదు.

ఒకే ఒక్క ఐడియా కరోనా కట్టడిని అతలాకుతలం చేసింది. ప్రజల స్ఫూర్తిని ఇంత పక్కాగా దెబ్బ తీసిన ప్రభుత్వాలకు ఏమని అనాలో మీ ఊహకే వదిలేస్తున్నా.....

ప్రభుత్వానికి కావలసింది ప్రజలా‌... లేదా డబ్బా


Source - whattsapp message

No comments:

Post a Comment