కోపం ఇలా తగ్గించుకోవడానికి ప్రయత్నం చేసి చూడండి.. :
😡 మీరు చూసేది, చేసేది ఏది నిజంకాదు. అనవసరపు కోపతాపాల వలన అనారోగ్యం పాలౌతారు. ఇక్కడ ఎవరికీ జవాబు చెప్పే పని లేకపోయినా పంచభూతాలు నిన్ను గమనిస్తూ ఉంటాయని గుర్తుంచుకో, జరిగిన క్షణాన్ని వదిలేయండి. మీరు ఎంత ఏడ్చి మొత్తుకున్నా క్షణకాలం వెనక్కి రాదు. జరిగిపోయిన దాన్నే తలచుకుంటూ కూర్చుంటే కాలం జరిగిపోతుంది గాని సంఘటన వెనక్కి రాదు.
చాలామంది ఏదైనా జరిగిన తరువాత అరరె ఇలా కాకుండా ఇంకోల చేసి వుంటే బాగుండేది. అలా చేయకుండా ఉండాల్సిందే.! అనుకుంటూ ఉంటారు. కాని జరగాల్సింది నువ్వెంత కాదన్నా ఈరూపంలో కాకపోయినా ఏదో ఒకరూపంలో పోయేది పోతూనే ఉంటుంది. దీన్ని ఆపడం నీతరం కాదు.
ఒకడు ఒక పందెంలో డబ్బులు పోగొట్టుకున్నాడు. చివరివరకు తనదే గెలుపు. చివర్లో మాత్రం చిన్న పొరబాటు వలన మొత్తం డబ్బు పోయింది. అప్పుడు అరరె ఇంకొంచం జాగ్రత్తగా ఉండాల్సిందే అనుకుంటాడు. కాని ఉండలేడు. ఎందుకంటే మొదటి తప్పు. ఉన్న డబ్బుని సద్వినియోగం చేయకపోగా దురాశతో పందెంలో పెట్టాడు. రెండు: ఆసమయంలో మంచి చెడు ఆలోచించే విచక్షణ కోల్పోయాడు చివరివరకు గెలుపు తనవైపు ఉన్నా దాన్ని గమనించకుండా ఇంకా ఇంకా అనుకున్నాడు. మొత్తం పోగొట్టుకున్నాడు.
నువ్వు ఎవ్వరిని పట్టించుకోకపోయినా నిన్ను అనుసరించే కొన్ని శక్తులు ఉంటాయి. నువ్వు దైవానికి ఋణపడి ఉన్నావని గ్రహించు. నువ్వు తినే తిండి బ్రహ్మం సృష్టించింది.ఈ భూమి పండించిది. భూమి తనలో విత్తనాలు దాచి ఉంచుతుంది. లేదంటే నువ్వు బ్రతకలేవు. నీరు, నేల, నింగి, అగ్ని, వాయువు, ఆకాశం వీటిలో ఏ ఒక్కటి తనపని మానుకున్నా, లేక నీశరీరంలో దేవుడు సృష్టించిన స్వచ్చమైన సహజసిద్దమైన ''ఏ సి'' (ఎండాకాలంలో నీ శరీరాన్ని తడుముకొని చూడు, చల్లగా ఉంటుంది. చలికాలంలో దుప్పటి ముసుగేసుకుంటే వెచ్చగా ఉంటుంది.) పనిచేయకపోయినా నువ్వు అనేవాడివి మిగలవు.
ఇంకేమి నువ్వు చేయగలవని నీకు అంత కోపం. కోపంతో నిన్ను భాధించుకుని ఎదుటివారిని బాధపెట్టడం ఎంతవరకు సమంజసం. ఆలోచించండి. వచ్చేటప్పుడు ఏమి తీసుకోచ్చావ్. పోయేటప్పుడు ఏమి తీసుకేళతావ్. ఈక్షణంలో నీదగ్గర ఉన్న సంపద మరుక్షణంలో నీదగ్గర ఎందుకు ఉండటంలేదు? నువ్వు ఏమి సృష్టించావని మరొక వస్తువుని నాశనం చేస్తున్నావ్. నాది నాది అనుకున్నదంతా రేపో మాపో ఇంకొకడి సొత్తు అవుతుంది. నువ్వు ఎంత ప్రేమగా తెచ్చుకున్న వస్తువైనా, ప్రేమించిన మనిషైనా కలకాలం ఉండదు. ఏదో క్షణంలో ఆ వస్తువు పాడవ్వడమో, ఆమనిషి పోవడమో జరుగుతుంది. దీన్ని నువ్వు ఆపగలవా? లేదు. లేదు. ఏదీ నీచేతిలో లేదు. అలాగని ఏదైతే అదవుతుందని కూర్చుంటే కుదరదు. నీప్రయత్నం నువ్వు చెయ్యి. మంచైనా చెడైన సమంగా స్వీకరించు.
ఈవిషయాన్ని గుర్తెరిగితే! కోపం, అసూయ, అశాంతి అన్ని మాయమయ్యి మానవుడే మాధవుడు అవుతాడు. సృష్టి ఇక్కడివరకు సాగిందంటే దానికి కారణం ఎందఱో రాజర్షులు ఇలాంటి సదాచారాలు, శాస్త్ర విధి విధానాలు పాటించారు కనుక. మనం ఆలోచించినట్టు ఆలోచిస్తే సృష్టి ఎప్పుడో సర్వ నాశనం అయ్యేది.. గుర్తుంచుకోండి. మనస్సు ఏమి చెప్పిందో వినడంకాదు. శాస్త్రాలు ఏమిచెప్పాయో అవి తెలుసుకుని పాటించండి. పాటించాల్సిందే..😌

No comments:
Post a Comment