Friday, May 15, 2020

ప్రతీ క్షణాన్నీ క్వాలిటీగా మార్చేది మన ఏటిట్యూడ్!

మామూలు లైఫ్‌కీ క్వాలిటీ లైఫ్‌కీ చాలా తేడా ఉంటుంది. ప్రతీ క్షణాన్నీ క్వాలిటీగా మార్చేది మన ఏటిట్యూడ్!

ఈ క్షణం నీ మానసిక స్థితి ఏంటన్నది నీ లైఫ్ క్వాలిటీని రిఫ్లెక్ట్ చేస్తుంది. ఉసూరుమంటూ.. ఏదో కోల్పోయినట్లు, అసలు ఉత్సాహమే లేకుండా బ్రతకడం ఓ బ్రతుకే కాదు.

జీవితం అంటే ఉత్సాహం వెల్లి విరియాలి. నీకు ఓ రోజు అందించడానికి సూర్యుడు పొద్దున్నే ఉదయించడం మొదలుకుని... పాల వాడు టీ తాగడానికి పాలేసీ.. పేపర్ వాడు పేపరేసీ.. ఇంట్లో టిఫిన్ సిద్ధమై.. సాయంత్రం పడుకునే వరకూ ఎన్నో కంఫర్టబుల్‌గా రెడీ అవుతుంటే అప్పటికీ ఉసూరుమంటున్నావంటే ఇంకా ఏమనాలి?

నీ ఆలోచనల్ని ఏదో డ్రాగ్ చేస్తోంది.. ఏ అగాధంలోకో లాగి పారేస్తోంది. దాన్ని విసిరి పక్కన పడేయి. నీకున్నాయనుకున్న బాధలూ.. నీ నీరసమైన చెత్త ఆలోచనలూ.. ఒంట్లో ఓపిక లేదని నీ శరీరంపై నువ్వు చూపిస్తున్న జాలీ అంతా ట్రాష్. అవన్నీ అబద్ధాలు. నీ ఏటిట్యూడే ఆ అబద్ధాలను సృష్టిస్తోంది. ఈ క్షణం నుండి నీలో అపారమైన శక్తిని ఫీలవ్వు.. శరీరం నిండా ఎనర్జీ ఎందుకు రాదో అదీ చూద్దాం! ఎవరన్నారు.. నీ లైఫ్ ఇక ఇంతే అని.. నువ్వే అనుకుంటున్నావు వంద కండిషన్స్ మధ్య నీ బ్రెయిన్‌ని లాక్ చేసి.. అంతకన్నా నువ్వేం చెయ్యలేవని భ్రమపడుతున్నావు.

ఉన్న ఫళంగా కొత్తగా, భిన్నంగా ఆలోచించడం మొదలెట్టు. ఫలానా తేదీన.. ఫలానా ఇయర్ నీకేదో చెడు జరిగిందా.. దాన్ని గుర్తు పెట్టుకుని ప్రతీ ఏడాదీ అలాగే భయపడుతున్నావా? ఫలానా మనిషితో మాట్లాడితే నీ మూడ్ పాడవుతోందా.. అందుకని మాట్లాడడం మానేశావా? నీకు బిర్యానీ తింటే అరగట్లేదా.. స్వీట్ తింటే జలుబు చేస్తోందా.. ఇవన్నీ నీ మైండ్‌లో పేరుకుపోయిన మెంటల్ బ్లాక్స్! స్వీట్స్ తిను.. జలుబు చేస్తే చేయనీయి.. స్వీట్స్ తింటే జలుబు చేసిందనే నీ నమ్మకాన్ని రీడిఫైన్ చేసి.. జలుబు వైరస్ వల్ల జలుబు వచ్చిందని ప్రాక్టికల్‌గా ఫీలవ్వు! నీ చెత్త నమ్మకాలను, భయాలను విసిరికొట్టి కాన్ఫిడెంట్‌గా ప్రతీ క్షణం బ్రతకడం మొదలెట్టు. గొప్ప జీవితం ఎలా సాధ్యపడదో అదీ చూద్దాం.
మీ...పి.సారిక

No comments:

Post a Comment