#బానిస #బ్రతుకులు
బ్రిటిష్ వాడి బానిసత్వం
అది అలాగే కొనసాగుతున్న పర్వం
ఇంకా తేరుకోలేదు మనం
ప్రభుత్వాలు మారాయి కానీ
పద్ధతులు మారలేదు
కొత్త కొత్త చదువులు వచ్చాయి కానీ
పాత రోత పనులు అలాగే ఉన్నాయి
ముందుగా మనిషి కులమతాలకు బానిస
అక్కడే మొదలైంది మన జీవితానికి ప ద ని స
చిన్నతనంలో తల్లిపాలకు ఏడ్చిన పర్వాలేదు
ఆడే వయసులో క్రికెట్ పిచ్చి పట్టినా తప్పులేదు
యవ్వనాఆరంభంలో...ప్రేమ పేరుతో... తప్పటడుగు వేసినా తప్పేది లేదు
కానీ... ఇంత బతుకు బతికి ఇంటెనకాల చచ్చినట్టు
బార్ల ముందు మందుకోసం బారులు తీరడం ఏంటి?
సారా కోసం సంసారాన్ని వీధిలో పెట్టడం దేనికి సంకేతం ?
ఇవి...బానిస బ్రతుకులు కాక మరేమిటి?
కరోనా సెలవులతో మండలదీక్ష ముగిసింది
మండలదీక్ష ముగిశాక షరా మామూలే కదా
పంబలో...మొదలు పెడితే...
పంబరేగేదాకా...తాగడం అలవాటే కదా!
పప్పు, ఉప్పు కోసం రోడ్డుపైకి వస్తే నడ్డివిరిగేదాకా వడ్డనలా...!
చావులు, రేవులకెళ్తుంటే పది వేల జరిమానాలా...!
మెడికల్ షాపుకు మందులకెళ్తే...అడ్డగింపులా...!
వైన్స్ షాపు ముందు మందుకోసం నిలబడితే...బుజ్జగింపులా...!
మద్యపాన నిషేధం చేయాలంటే ధరలు పెంచాలా?
ఉద్యోగాలు కావాలంటే ఇంగ్లీషు మీడియం చదవాలా?
పబ్జి గేమ్ ఆడటం..మాదకద్రవ్యాలకు అలవాటు పడటం
జూదం ఆడటం...మందు బాబుల ముందు నీతులు చెప్పడం
ఇవేవీ...జరిగేవికావు,
ఆపినా...ఆగేవి కావు
మగడు బ్రతికున్నా సరే ...తెగనున్న తాళిబొట్లు
ఆడబిడ్డలకు పెరిగాయి అలివితీరని అగచాట్లు
ఎన్నికలప్పుడు బ్రాందీ, బీర్లతో నోరు తడపడం...
ఇప్పుడు ముక్కు పిండి వసూలు చేయడం...
ఇదేమి సంక్షేమ రాజ్యం...
ముందున్నది సంక్షోభ రాజ్యం...
కరోనా వచ్చి.... కొత్త రీతులు తెచ్చి...
మానవత్వం మెరుగుపడిందని సంబరపడాలో...!
ఓజోన్ పొర చిల్లులు పూడ్చుకుందని ఆనందపడాలో...!
పెట్రోలియం విలువలు ఋణాత్మకమైనవని బాధపడాలో...!
మండల కాలంలో కరోనా చేయలేసి హింస...
ఒక్కరోజులో...ఏరులై పారిన మద్యం చేయగల్గిందని చిందులేయాలో...!
ఏలిన వారి కెరుక...
చేసుకోవాలి తీరిక...
చూసుకోవాలి ...మీరిక

No comments:
Post a Comment