Monday, May 11, 2020

పిల్లలు చెడిపోవడానికి అస్సలు కారకులు PARENTS, ప్రస్తుత పరిస్థితులు

పిల్లలు చెడిపోవడానికి అస్సలు కారకులు PARENTS, ప్రస్తుత పరిస్థితులు
పిల్లల పట్ల మనం చూపిస్తున్న అతి ప్రేమ వారిని సోమరులుగా మారుస్తుంది.

ఇప్పుడు తరం పిల్లలు..
వారి సాక్సులు ఉతుక్కోమంటే ఉతకరు..
లంచ్ బ్యాగ్ లు శుభ్రం చేసుకోవడంలేదు..
కనీసం లోదుస్తులు ఉతుక్కోమన్నా ఉతకడం లేదు..
గట్టిగా మాట్లాడితే ఎదురుతిరగబడి సమాధానం చెబుతారు.
తిడితే వస్తువులను విసిరి కొడతారు.
ఎప్పుడు అయినా దాచుకోమని డబ్బులు ఇస్తే ఫైవ్ స్టార్ లు, ఐస్ క్రీమ్ లు, కూల్ డ్రింక్ లు ( విషం), నూడుల్స్ ప్యాకెట్లు, కొనుగోలు చేస్తున్నారు...
ఆడపిల్లలు అయితే తిన్న కంచం కూడా కడగటం లేదు..
ఇల్లు ఊడ్చమంటే కోపాలు వచ్చేస్తున్నాయి..
అతిథులు వస్తే కనీసం గ్లాసుడు మంచి ఇవ్వాలన్న ఆలోచన లేని అమ్మాయిలు కూడ ఉన్నారు..
డిగ్రీ చదువుతున్న ఆడపిల్లలకు వంట కూడా చేయడం రావటం లేదు..
బట్టలు పద్ధతిగా ఉండాలి అంటే కోపం
కల్చర్, ట్రెండ్, టెక్నాలజీ పేరిట వింతపోకడలు వారిస్తే వెర్రి పనులు..
కొందరికి అహం, పరువు, ప్రతిష్టలు అడ్డొస్తున్నాయి..
చూసేవాళ్లకు మనం మంచి హోదాలో ఉండాలి, రిచ్ నెస్, స్టేటస్ మెయింటైన్ చేయాలి అని భ్రమలో ఉన్నాం..

కష్టం గురించి తెలిసేలా పెంచాలి.
కష్టాలు, డబ్బు, సమయం, ఆరోగ్యం విలువ తెలియకపోతే.. వారికి జీవితం విలువ తెలియదు.
🩸అభినయాలు కనపడం లేదు, అనుకువగా ఉండటం రాదు, సంస్కృతి, సంప్రదాయాలు పట్టించుకోవడం లేదు
🩸భార్యకు వంట వండటం సరిగా రాదని నేటి యువత బిర్యానీలు, కర్రీ పాయింట్ ల వెంట పడుతూ చిన్న వయసు లోనే గ్యాస్టిక్ అల్సర్, గాల్ బ్యాడర్ స్టోన్స్ , కిడ్నీ స్టోన్ ల బారిన పడుతున్నారు
🩸మరొక ఫ్యాషన్ ఏమిటంటే పెరుగు మజ్జిగ తీసుకుంటే వాంతులు చేసుకోవడం..
కాలేజీ పిల్లలు అయితే సరిగ్గా ఒక పిడికిలి పట్టేంత టిఫెన్, బాక్సు రైస్..

🩸గర్భవతులు అయిన తరువాత వారి బాధలు వర్ణనా తీతం
టోటల్ మెడిసిన్ మీద డిపెండ్ అవడం, 100 లో 90 మంది సిజేరియన్ ద్వారా పిల్లల్ని కంటున్నారు అంటే వారి శారీరక పటుత్వం ఎంత పడిపోయిందో ఆలోచించండి..
అలా ఉంటే పుట్టే పిల్లలు కూడాఏదో ఒక జన్యులోపంతో పుడుతున్నారు..
🩸3వ తరగతి పిల్లాడికి సోదబుడ్డి లాంటి కళ్ళద్దాలు..
5వ తరగతి వారికి అల్సర్, బీపీ లు..
🩸నెయ్యి తినకపోవటం, ఆరోగ్య ఆహారం, ఆరోగ్య త్రాగునీళ్లు అంటే తెలువదు. బేకర్ ఫుడ్ తినటం, వ్యూరిఫైడ్ నీళ్లు, కూల్ డ్రింక్స్ త్రాగుతున్నారు.
10 దాటేలోపు సకల రోగాలు ఒంట్లోకి వచ్చేస్తున్నాయి..

వీటన్నికి కారణం మనం మన పిల్లలను సరైన పద్ధతిలో పెంచకపోవడమే..
అందుకే తల్లిదండ్రులు మారాలి.
పిల్లలకు..
తినేది,త్రాగేది,బాధ్యత, బరువు,మర్యాద,గౌరవం,కష్టం నష్టం,ఓర్పు,సహనం,ప్రకృతి, దాతృత్వం,ప్రేమ,అనురాగం
సహాయం,సహకారం,దేవుడు, దేశం,నాయకత్వం,మానసిక ద్రృఢత్వం,కుటుంబ బంధాలు
అనుబంధాలు*
ఇవి తప్పక పిల్లలకు శాస్త్రీయ విద్య తోఅర్థం చేసి అలవాటు చేయాలి..
ఇవన్ని అలవాటు అయితే ఆరోగ్యం, మానసిక పరిస్థితి, సామాజిక సృహ, ఉత్తమ జీవన విధానం వారికి అందించిన వారమవుతాం..
భావి తరాలకు ఒక మానవీయ, విలువలతో కూడిన, సత్సాంప్రదాయాలకు దారులు వేద్దాం. 🙏
ఇట్లు రాచర్ల వెంకన్న.. సిరిసిల్ల

No comments:

Post a Comment