🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘
👌చేసుకొన్న వారికి చేసుకొన్నంత మహాదేవ అన్నారు పెద్దలు. అలా మనం చెసుకొన్న పుణ్యం ఊరికే పోదు, కలకాలం మనవెంట తోడుగా వస్తుంది..👌
ఒక పేద రైతు తన పొలంలో పనిచేసుకుంటూ ఉన్నాడు. ఇంతలో ఎవరో రక్షించండి రక్షించండి అంటూ అరుస్తున్న కేకలు వినిపించాయి. కానీ కనుచూపు మేరలో ఎవరూ అగుపించట్లేదు. సరేనని తనపని తాను చేసుకుంటూ ఉండగా మరొక సారి రక్షించండి అనే కేకలు మళ్ళీ వినిపించాయి. ఈసారి ఆ కేకలు పక్కపొలంలో ఉన్న పెద్ద బావి నుండి ఆ కేకలు వస్తున్నట్లుగా గుర్తించి పరుగెత్తి కెళ్ళి బావిలో చూడగా తన కొడుకు వయస్సున్న ఒక అబ్బాయి ప్రాణభయంతో అరుస్తూ గిలగిలా కొట్టుకొంటున్నాడు. ఆ రైతు వెంటనే బావిలోకి దూకి ఆ అబ్బాయిని రక్షించి గట్టుపైకి చేర్చి తాగిన నీళ్ళను కక్కించి ఇక నీకు ప్రాణాపాయం ఏమీ లేదు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు నాయన అంటూ ఆ అబ్బాయి భుజం తట్టి ధైర్యం చెప్పి పంపించేశాడు.
మరుసటి రోజు ఉదయాన్నే రైతు పొలం వెళ్ళే ప్రయత్నంలో ఉండగా అతడి ఇంటి ముందు ఒక పెద్ద విలాసవంతమైన గుర్రపుబగ్గీ వచ్చి ఆగింది. రైతు ఆశ్చర్యపోతూ నాకు పరిచయం ఉండి, నా ఇంటికి వచ్చేంత గొప్పవారు నాకు తెలిసినవారు ఎవరూ లేరే అనుకుంటూ ఉండగా, అందులోనుండి ఒక విలాసవంతమైన దుస్తులు ధరించిన ఒక వ్యక్తి దిగి నేరుగా రైతు ఇంటిలోకి వచ్చి రైతు ముందు నిలబడి..
అయ్యా నేను పక్క ఊరి జమీందారును, నిన్న మీరు నా వారసుడైన నా ఒక్కగానొక్క నా కొడుకును బావి నీళ్లలో మునిగి పోకుండా మీ ప్రాణాలకు తెగించి కాపాడారు. అందుకు మీకు ఏమిచ్చినా, ఏంతిచ్చినా తక్కువే అవుతుంది. దయచేసి నేనిచ్చే ఈ ధనాన్ని మీరు తప్పకుండా స్వీకరించాలి అంటూ ఒక డబ్బు సంచిని రైతు చేతిలో పెట్టబోయాడు.
అందుకు రైతు సున్నితంగా నిరాకరిస్తూ, చూడండి మీ అబ్బాయి స్థానంలో వేరే ఇంకెవరున్నా నేను రక్షించేవాడిని. అది మనిషిగా నా ధర్మం. తోటి మనిషికి సహాయం చేయలేని మనిషి మానవత్వపు విలువలు లేనట్లే అంటూ వచ్చిన ఆయనతో నమ్రతతో అన్నాడు. ఇంతలో బయటనుండి పరిగెత్తుకుంటూ వచ్చిన రైతు కొడుకు రైతు నడుమును చుట్టేసి, వచ్చిన ఆ పెద్ద మనిషిని అమాయకంగా చూడశాగాడు. ఆ వచ్చిన వ్యక్తి ఈ అబ్బాయి ఎవరు ఏమి చదువుకొంటున్నాడు అని అడిగాడు. రైతు ఆ అబ్బాయి తల నిమురుతూ ఈ లోకంలో నాకున్న ఏకైక తోడు ఈ నా కొడుకు ఒక్కడే. నా భార్య చనిపోయింది, ఆర్థిక ఇబ్బందులవల్ల ఈ అబ్బాయిని చదివించలేక పోతున్నాను, ఏదో నాకు చేదోడువాదోడుగా ఉంటూ నాతోపాటుగా పొలానికి వచ్చి పొలం పనుల్లో నాకు సహాయం చేస్తుంటాడని చెప్పాడు రైతు.
రైతు తనకు డబ్బు అవసరం ఎంతో ఉన్నా, ఆర్థిక ఇబ్బందులున్నా, తాను ఇచ్చిన ధనాన్ని స్వీకరించ కుండా సున్నితంగా నిరాకరించిన ఆ రైతు యొక్క ఉన్నత వ్యక్తిత్వానికి ముగ్ధుడైన ఆ జమిందారు, రైతుతో కనీసం ఈ అబ్బాయి చదువుకోవడానికి అవసరమైన ధనాన్ని నేను భరిస్తాను, మీ అబ్బాయిని నా కొడుకుతో సమానంగా పెద్ద పెద్ద చదువులు చదివిస్తాను. ఈ అబ్బాయి భవిష్యత్తును అంధకారం కానివ్వకండి అంటూ, నా కొడుకును కాపాడిన రుణాన్ని ఈ రూపంగా నైనా తీర్చుకోనివ్వండి అంటూ బతిమిలాడాడు. ఇంకా ఎక్కువ బెట్టు చేయడం మంచిది కాదని భావించి, అందుకు రైతు కూడా ఒప్పుకొన్నాడు.
అలా కాలం గడిచిపోతూ ఉంది. ఆ అబ్బాయిలు ఇద్దరు తమతమ చదువులను విజయవంతంగా పూర్తి చేసి పట్టభద్రులయ్యారు. ఎవరి వృత్తిలో వారు బిజీగా గడపసాగారు. ఒకరోజు ఆ పెద్దాయన కుమారుడికి ఉన్నట్లుండి అకస్మాత్తుగా జబ్బు చేసింది. ఎంతో మంది వైద్యులు వైద్యం చేస్తున్నారు. అయినా ఆ మాయదారి మహమ్మారి ఆ అబ్బాయిని వదిలిపెట్టడం లేదు. అప్పుడు ఒక యువ శాస్త్రవేత్త తాను తయారు చేసిన కొత్త మందుతో ఆ యువకుడికి వైద్యం చేశాడు. ఆ కొత్త ముందు బాగా పనిచేసి ఆ యువకుడు తొందరగానే కోలుకొని ప్రాణాపాయం నుండి బయటపడి ఆరోగ్యవంతుడుగా తయారయ్యాడు.
ఇంతకూ ఆ యువ శాస్త్రవేత్త ఎవరోకాదు ఆ జమిందారు చదివించిన ఆ పేద రైతు కొడుకే. ఇక్కడ మీరు తెలుసుకోవలసిన మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఆ యువ శాస్త్రవేత్త మరెవరో కాదు, అద్భుతమైన " పెన్సిలిన్ " అనే మందును కనిపెట్టి ఈ ప్రపంచానికి అందించి కొన్ని కోట్ల మంది ప్రాణాలను కాపాడిన ప్రముఖ శాస్త్రవేత్త " అలెగ్జాండర్ ఫ్లెమింగ్ " ఈయనే ఆ పేద రైతు కొడుకు. ఇక ఆ పెన్సిలిన్ ఇంజక్షన్ ద్వారా ఆరోగ్యవంతుడైన ఆ యువకుడు మరెవరో కాదు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పరిపాలించిన " విస్టన్ చర్చిల్ " అనే ఆ దేశ ప్రధానమంత్రి.
చూశారా మిత్రులారా ! ఈ కథనాన్ని చదివిన మీరందరూ అర్థం చేసుకోవలసిన అంశం ఏమిటంటే, మనం చేసుకున్న పుణ్యం ఊరికే పోదు, అది కలకాలం మనం జీవించినంత కాలం మనవెంటే మనకు తోడుగా వచ్చి మనల్ని ప్రపంచ ప్రఖ్యాతిని పొందే వ్యక్తులుగా తీర్చిదిద్దుతుంది. రైతు జమిందారు కొడుకును ప్రాణాపాయం నుండి కాపాడిన పుణ్యం తన కొడుకును పెద్ద శాస్త్రవేత్తను చేస్తే, ఆ జమిందారు గారు రైతు కొడుకును చదివించి శాస్త్రవేత్తను చేసిన పుణ్యం తన కొడుకును రెండుసార్లు ప్రాణాపాయం నుండి రక్షించింది. చూశారా మిత్రులారా అందుకే మీరందరూ కూడా మానవత్వంతో ఇతరులకు మీకు చేతనైనంత సహాయం అందించండి. ఆ సహాయమే పుణ్యం రూపంలో కలకాలం మీ వెంటే వస్తూ మీకు కీర్తి ప్రతిష్టలను అందిస్తుంది. మీరు ఆ దిశగా ప్రయత్నిస్తారని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ.. శుభం భూయాత్.🤘
🤘సర్వే జనా సుఖినోభవంతు🤘
👌ధర్మో రక్షతి రక్షతః 👌
For Every Action Equal &
Opposite Reaction
-రామభక్త గురూజీ ప్రొద్దుటూరు.
సెల్-8328170075.*

No comments:
Post a Comment