Friday, June 12, 2020

సత్కర్మలు యెంత త్వరగా ప్రారంభిస్తే అంత మంచిది...

🤔మూసి ఉన్న గుప్పిటి , మూసి ఉన్న మనస్సు యితరులకు
మంచి చేయలేవు . యితరులనుండి మంచిని స్వీకరించలేవు .

" నేను - నాది " అనే స్థితి నుండి "మనము - మనది " అనే
మహోన్నత స్థాయికి ఎదగాలి నేటి మానవాళి .

ప్రోత్సాహం కోసం ఎదురు చూడకుండా ఉత్సాహం తో మంచి
పనులు చేస్తూ ముందుకు పోవాలి .

సంక్రమించిన ధనం తో సంతోషాన్ని పొందగలము . కానీ
స్వయము కృషి తో సంపాదించిన ధనం తో ఆత్మ సంతృప్తి
పొందగలము

కలసి మెలసి జీవించడం బలం . ఒకరినొకరు కలబడటం
బలహీనం .

తాళంచెవి లేని తాళాలు ఉండవు . పరిస్కారం లేని
సమస్యలు ఉండవు .

మెల్లగా నడిచినా పర్వాలేదు .అడుగులు లక్యం వైపు ఉంటె
గమ్యాన్ని తప్పక చేరుకోగలం .

అసత్యం తో సాధించిన విజయం కంటే , సత్య మార్గం లో
నడచి పొందిన ఓటమి గొప్పది .

నేను - నాది , నువ్వు - నీది అనే ఈ నాలుగు పదాలు
అనేక సమస్యలకు మూల కారణాలు

లేనివారికి ఆకలి భాధ , ఉన్నవారికి యింకా కావాలనే
బాధ . నిజానికి యిద్దరివి బాధలే .

ధనాన్ని సంపాదించడం యెంత కష్టమో , దానిని
రక్షించుకోవడం కూడా అంటే కష్టము .

గొప్పవారైనా మరణించక తప్పదు . కానీ గొప్పదనానికి
మరణం ఉండదు .

క్షమా గుణం చేతకానితనం కాదు . క్షమించాలంటే
కొండంత మనో బలం ఉండాలి .

మనం తెలుసుకోవలసిన ముఖ్య విషయం , మనకు
మనమే మిత్రులం . మనకు సమానమే శత్రువులం .

మన సమస్యలకు , దుఃఖాలకు మనమే కారణం
యితరులు కారణం అనుట దారుణం .

యితరులను జయించటానికి ప్రయత్నిమ్చుట కంటే
నిన్ను నీవు జయించటానికి ప్రయత్నిమ్చు .

మౌనం అంటే మాట్లాడకుండా ఉండటమే కాదు ,
మనస్సును నిర్మలంగా ఉంచుకోవాలి .

జ్ఞానాన్ని తెలుసుకోవడం యెంత ముక్ష్యమో , తెలుసుకొన్న
జ్ఞానాన్ని జీవితం లో ఆచరించడం అంతకంటే ముఖ్యం .

ధనం పరుల పాలు - కుటుంబ సభ్యులు , బంధువులు
స్నేహితులు స్మశానం వరకు - శారీరం చితి పైకి - నీ
కర్మ ఫలితం మాత్రమే నీ వెంట వస్తుంది .

కర్మలను విత్తనాలతో పోల్చవచ్చును . ఏ విత్తనము వేస్తె
ఆ ఫలమునే పొందుతాము . అలాగే నీవు చేసే కర్మలు
ఎటువంటివో అటువంటి ప్రారబ్దాన్ని పొందుతావు .
ఒక రోజు పూర్తి అయింది అంటే , ఆయుస్సు లో ఒక రోజు

తగ్గిందని అర్ధము . అందువలన సత్కర్మలు యెంత త్వరగా

ప్రారంభిస్తే అంత మంచిది .🤔

Source: whatsapp sandesam

No comments:

Post a Comment