Friday, June 19, 2020

తొందరపడి ఎవరిని తక్కువగా అంచనా వేయకండి.

🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘

👌ఒక్కొక్కసారి మనం ఎదుటి వారిని తక్కువగా అంచనా వేస్తు ఉంటాము. వాళ్ల దుస్తులను బట్టి, కాళ్లకు వేసుకున్న చెప్పులను బట్టి, ప్రయాణించిన వాహనాన్ని బట్టి మనం వాళ్ల స్థాయిని లెక్క గడుతుంటాం. కానీ అది చాలా తప్పు. తొందరపడి ఎవరిని తక్కువగా అంచనా వేయకండి.👌

అది హార్వర్డ్ యూనివర్సిటీ. దానిముందు మామూలు రిక్షాబండి నుండి ఇద్దరు వృద్ధ దంపతులు దిగి ప్రెసిడెంట్ గారిని కలవడానికి ఆయన ఆఫీస్ గది వైపు వస్తున్నారు. ఇదంతా దూరం నుండి ప్రెసిడెంట్ గారి పీఏ గమనిస్తూనే ఉంది. వారు దగ్గరకు రాగానే వారి వేషధారణ చూసి పీఏ ముఖం చిట్లించుకుంది. వారు ప్రెసిడెంట్ గారిని కలవడానికి వచ్చామనగానే ముతక వస్త్రాలలో ఉన్న ఆ ఇద్దరు వృద్ధులను, ప్రెసిడెంట్ దగ్గరకి పంపడానికి ఆమె అంగీకరించలేదు. ఈ ముసలి వాళ్లకు హార్వర్డ్ యూనివర్సిటీ ప్రెసిడెంట్ తో పనేమిటి? అనుకుంటూ ఉండగానే..

ఇంతలో ఆ అధ్యక్షుడే గదిలోంచి బయటకు వచ్చాడు. ఆ వృద్ధులను చూసి “చెప్పండి, మీకు ఏం కావాలి? " అంటూ అడిగాడు ప్రెసిడెంట్. మేము విరాళం ఇద్దామని అనుకుంటున్నాం" అని చెప్పాడు ఆ ముసలాయన. ప్రెసిడెంట్ కు నమ్మకం కలగలేదు. అయినా దానిని బయటకు కనపడ నీయకుండా, ఓహా అలాగ "ఎంత ఇవ్వాలను కుంటున్నారు? " అన్నాడు. మా ఒక్కగానొక్క కొడుకు టైఫాయిడ్ జ్వరంతో చనిపోయాడు. వాడి జ్ఞాపకార్థం ఈ యూనివర్సిటీ క్యాంపస్లో ఒక భవనం నిర్మించాలని మా ఆశ " అని చెప్పింది వృద్ధురాలు.

అవునా "ఎంత ఇవ్వగలరు? " అని చాలా క్యాజువల్గా అడిగాడు ప్రెసిడెంట్. ముసలాయన "ఒక బిల్డింగ్ కు ఎంతవుతుందో అంత అన్నాడు. అవునా ఎంత అవుతుందో తెలుసా? " అంటూ ప్రెసిడెంట్ వివరాలు చెప్పాడు. అది విన్న ముసలాయన ఆశ్చర్యపోయాడు. ముసలావిడ కూడా ఆశ్చర్యపోయింది.“అంటే ఈ లెక్కన మనం ఓ యూనివర్సిటీ స్థాపించాలంటే ఎంతవుతుంది? '' కుతూహలం ఆపుకోలేక అడిగింది పెద్దావిడ. అందుకయ్యే ఆ పెద్ద మొత్తాన్ని ఒక్కొక్క పదమే నొక్కి నొక్కి చెప్పాడు ప్రెసిడెంట్.

అది విన్న ఆమె, భర్త వైపు తిరిగి అన్నది, అయితే “మరి మనమే ఓ యూనివర్సిటీ ఎందుకు పెట్టకూడదు డార్లింగ్! " అన్నది. అందుకు ముసలాయన "సరే ఓకే " అన్నాడు భర్త. అలా వారిరువురూ చేతిలో చెయ్యేసుకొని వెనుదిరిగి వెళ్తుంటే వారిని నోళ్ళేళ్ళబెట్టి అలా చూస్తుండి పోయారు ప్రెసిడెంట్, ఆయన పీఏ. అంతే కొంత కాలానికే కాలిఫోర్నియా నగరంలో "స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ " స్థాపన జరిగిపోయింది. ఆ దంపతులిద్దరూ మరెవరో కాదు "లేలాండ్ స్టాన్ఫోర్డ్ ", "జేన్ స్టాన్ఫోర్డ్ ''.. చూశారా ఒక్కోసారి మనం ఎదుటివారిని ఎంత తప్పుగా అంచనా వేస్తామో చెప్పడానికే ఇదంతా మీకు చెప్పాల్సి వచ్చింది.

కాబట్టి మనం ఎప్పుడూ కూడా ఎదుటివాళ్ల దుస్తులను బట్టి, కాళ్లకు వేసుకున్న చెప్పులను బట్టి, ప్రయాణించిన వాహనాన్ని బట్టి మనం వాళ్ల స్థాయిని లెక్క గడుతుంటాం. రేప్పొద్దున మీ ఎదురుగా నిలబడివున్నది, ఎవరైనా కావొచ్చు. వాళ్లను మీకంటే గొప్పవాళ్లుగా భావించక పోయినా ఫర్లేదు.. కానీ తక్కువ వాళ్లని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే, పూర్వం మన పాత కథల్లో కూడా దేవుడో, మహారాజులో మారువేషాల్లో వచ్చేవారు అని విన్నాము కదా..

కాబట్టి మిత్రులారా ! దేవుళ్ళలో మనుషుల్ని చూసుకునే అవసరం మనకు లేకపోయినా, మనుషుల్లో దైవత్వం చూసే అవకాశం దేవుడు ఎప్పుడూ మనకు కల్పిస్తూనే ఉంటాడు. కాబట్టి సాయం చేసే వాడే అసలైన దేవుడు, సాయం అందించే చోటే పవిత్రమైన దేవాలయం. మీరందరూ కూడా ఇతరులకు సహాయం చేస్తూ శాశ్వతంగా దేవుళ్ళుగా మారతారని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ.. శుభం భూయాత్.👌

🤘సర్వే జనా సుఖినోభవంతు🤘

👌ధర్మో రక్షతి రక్షతః *👌

No comments:

Post a Comment