Friday, July 17, 2020

ప్రస్తుత వివాహ వ్యవస్థ

ప్రస్తుత వివాహ వ్యవస్థ

ఎవరిని కించపరచటానికో వ్రాసింది కాదు. సంఘంలో జరుగుతున్న సంఘటనలు వారి స్పందనలు మాత్రమే. ....
"ఆడపిల్లలు, వారి
తల్లిదండ్రులదే పైచేయి"

కావలసిన అర్హతలు: BTech, Software ,America
అబ్బయికి సొంత ఇల్లు,
తండ్రికి పెన్షన్ వచ్చే ఉద్యోగం.
సిగరెట్, మందు అలవాటు లేకుండా, మంచి పర్సనాలిటీ, ఉన్నత కుటుంబం.
ఆడపిల్లల తల్లితండ్రులకు
సపోర్ట్ గా ఉండాలి.

ఇంటర్వ్యూ:

ఫోన్ చేయ్యగానే పిల్ల తల్లి మాట్లాడుతుంది.భర్తకు అవకాశంలేదు.

"అబ్బాయి చదువు,తెలివితేటలూ పరీక్షించి లక్షల జీతంతో ఉద్యోగం ఇస్తాడు సదరు కంపెనీ వాడు".
కాని,
10th పాస్ కాని తల్లి " మీ అబ్బాయి
ఏ యూనివర్సిటీలో చదువుకొన్నాడు?" అనే ప్రశ్న. ( అంటే ఉద్యోగమిచ్చినవాడు వెధవ అన్నమాట ఈవిడ దృష్టిలో)
మీ అబ్బాయి ఫోటో, వివరాలు whatsapp లో పంపండి , మా అమ్మాయిది పంపుతాము అంటుంది ! మనం పంపిస్తే వారు పంపరు. తరవాత
మనమే ఫోన్ చేయాలి. అడిగితె మొదటి వారం:
"ఇంకా అమ్మాయి చూడలేదండి". రెండవ వారం :
" అమ్మాయి లేట్ గా వస్తోందండి.
ఇంకా చూడలేదు" .
మూడవ వారం:
" ప్రాజెక్ట్ వర్క్లో బిజీగా ఉందండి".
నాలుగో వారం:
శని,ఆదివారాలలో " అమ్మాయి తలనోప్పని పడుకుందండి" .
ఐదో వారం:
అమ్మాయి పేకేజ్ మీకన్నా 10 వేలు ఎక్కువండి. ఒప్పుకోలేదు" అని కానీ , లేదా " మీరు ఇన్ని సార్లు చెయ్యవలసిన అవసరం లేదండి . మేమే చేస్తాము" అనిఫోన్ పెట్టేసి, తరవాత మనం ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తరు.

అమ్మాయిల విషయానికొస్తే:
తల్లి తండ్రుల గారాబం, తరవాత వారిమాట వినకపోవడం , మితిమీరిన స్వేచ్ఛా జీవితంతో పెళ్లి చూపులనాడు పెళ్ళి కోడుకుతో సంభాషణ ఏకాంతంగా:

"మీ ఇంట్లో బాగేజీ , లగేజి ఉన్నాయా?
మీ ఇంట్లో వీల్ ఛైర్ లు ఉన్నాయా?
మీ ఇంట్లో డస్ట్ బిన్లు ఉన్నాయా?
మీ ఇంట్లో రాహు కేతువులున్నాయా?"
అని అబ్బాయి తల్లితండ్రుల
నుద్దేసించి పై ప్రశ్నలు . తరవాత,

"మీ అమ్మ నాన్నలు మనతో
ఉండడానికి వీలు లేదు,

నా సెల్ నువ్వు ఆన్సర్ చెయ్యొద్దు.
నీ సెల్ నేను ముట్టుకోను!

నేను వంట చెయ్యను.
కర్రి పాయింట్ లో తెచ్చుకుందాము!

నాజీతం బ్యాంకులో ,
నీ జీతం ఖర్చుపెడదాము!"

ఇంకా కొంతమంది " మనకి పిల్లలు వద్దు" అని నిబంధనలు.

లేకపోతె తాంబూలాలు లేవు.
కొన్ని తరవాత చెప్పి కూడా
తాంబూలాలు కాన్సిల్ చేసుకొన్న కేసులు చాలా ఉన్నాయి..

పెళ్ళైన తరవాత ఖర్మకాలి పడక విడాకుల వరకు వస్తే,
విడాకులకై సంతకం పెట్టాలంటే లక్షలు పరిహారం.
అప్పటికే అబ్బాయి క్రెడిట్,డెబిట్ కార్డులు బాలన్స్ జీరో చేసేస్తుంది.
విడాకులైనా ఏ మాత్రము
మార్పు, బాధ లేకుండా
కొత్త పెళ్లి కూతురు లాగ అవే కండిషన్లు.
సర్దుబాటు వ్యవహారం, పశ్చత్తాపం ఏకోశానా ఉండవు.
వీటన్నిటికి తల్లి సపోర్ట్!

అమెరికానుండి వచ్చిందంటే సూట్కేసులతో సరాసరి ఎయిర్ పోర్ట్ నుండి అమ్మగారి ఇంటికే. 15 రోజుల తరవాతో లేదా వెళ్ళిపోయే టప్పుడు ఒక వారం ముందరో ప్రత్యక్షం.

ప్రమాదమేమంటే,
మగవారికి సంతానోత్పత్తి 90 సంవత్సరాలు దాకా ఉంటుంది. కాని
ఆడవారికి మొనోపోజ్ వచ్చిందంటే కుదరదు. ఇప్పుడు 35 సంవత్సరాలు దాటితే వచ్చేస్తోంది. తల్లితండ్రులు ఈ సంగతి తెలిసో, తెలియకో నిమ్మకు నీరెత్తినట్లు కూర్చుంటున్నారు.
ఆడపిల్లల సంపాదన మరిగి వారికి వచ్చిన సంబంధాలు తోసిపుచ్చే తల్లితండ్రులు కూడా ఉన్నారు. కొంత మంది ఆడపిల్లలు స్వయంగా చెప్పిన వ్యధ ఇది !
ఇవండీ! మన మగ పిల్లలకు వివాహం కాకపోవడాని కారణాలు , వాస్తవాలు!
అనుభ వించిన వారు చెప్పిన
నగ్న సత్యాలు!
మాట్రిమొని కన్వెక్షన్లకు వెళ్ళినప్పుడు అక్కడి తల్లితండ్రులు , ఆడపిల్లలు వేదనతో చెప్పిన యదార్ధ సత్యాలు. అంతేకాని, ఆడపిల్లలమీద అభాండాలు వెయ్యడం కోసం మాత్రం కాదు. ఇది కేవలం అటువంటి ప్రవృత్తి కలవారికి మాత్రమె!
30 సం. వయసు దాటిఅదృష్టవంతులైన పెళ్లి కాని ప్రసాదులకు ,పెళ్లి చేసుకొని బాధలుపడి విడాకులు తీసుకొన్న అబ్బాయిలకు,
ఇంకా పెళ్ళి చేయ్యక మంచి , మంచి అని సంబంధాలు వెదుకుతూ
అత్యాశతో వయసు దాటబెట్టిన అమ్మాయిల తల్లితండ్రులకు ,
18 వయసు ఫోటోలు పెట్టి పాకేజీలను , క్వాలిఫికేషన్లు పోల్చుకొని
అత్యాసతో చార్మింగ్ పోయి జుట్టుకు రంగేసుకుని ఇంకా ఎదురు చూస్తున్న అమ్మాయిలు , అబ్బాయిలకు
ఈ పోస్ట్ అంకితం.

పోయిన వయసు రాదు.
"35 వయసు దాటిన అబ్బాయిలు ఇంటర్ కాస్ట్ కి వెళ్ళిపోవడమే ఉత్తమం".

"పురుషుడు-స్త్రీ- వయస్సు"
ఇవి మూడే ముఖమైనవి.
జీతం, చదువు కాదు
ఒక వ్యక్తి ఆవేదన.

ప్రస్తుత కాల మాన , ఈ సమాజ వ్యవస్థలో ప్రతి ఒక్కరూ తమ జీవిత అనుభవాలను , జరుగుతున్న వాస్తవాలను గుర్తెరగాలి ,చూసి జీర్ణించుకోవాలి , మనస్సు దిటవు చేసుకొని జీవించాలి .

కులము కూడు పెట్టదు ,
మతము మంచి నీళ్ళు ఇవ్వదు .
కుల మతాలను చూసి ఆనందపడకు ,ఇవి జీవించడానికి ఉపయోగ పడవు .

ఈ కరోనా కేసులలో , చావులలో ఏ బంధాలు ,రక్త సంబంధాల వాళ్ళు ,ఈ కులాలు , మతాల వాళ్ళు ....... దగ్గరకు రారు .

ఒక్క విషయం అందరూ గమనించాలి .
అన్ని కులాలు ,మతాలు వారు అందరూ కలిసి పనిచేస్తేనే ఆహారం మన నోటిలోకి చేరుతున్నది .

మానవ పుట్టుక పరమార్థం , జీవిత పరమార్థం తెలుసుకుని ,
మనిషి సగటు ఆయుష్షు గుర్తెరిగి జీవితాలు సార్థకం చేసుకోండి .

మరి చేస్తున్న వ్యాపారాలలో కులస్తులు పండించిన పంటలు , కులస్తులచే తయారు చేసిన వస్తువులను తీసుకొచ్చి , కులస్తులతో మాత్రమే వ్యాపారము చెయ్యొచ్చుగా ...

తమ పిల్లలను తమ కులస్తుల దగ్గరే అన్ని చదువులు పూర్తి చేయించి తమ కులస్థుల దగ్గరే జాబ్స్ చెయ్యొచ్చుగా .....

కేవలం 100 % తమ కులస్తులచే పూర్తిగా నిర్మించిన ఇండ్లలో నివశించోచ్చుగా ..
ఇంటిలో ఉపయోగించే ప్రతి వస్తువు తమ కులస్థులచే తయారు
చెయ్యబడినదిగా ఉండాలని అనుకోవచ్చుగా ...

అన్నీ కుదిరినప్పుడు కులస్థుల నే వివాహము చేసుకోనియ్యండి .
కుదరనప్పుడు ఇంకా ఆశతో వేచి చూడక ... రెండు వైపులా పెద్దల అనుమతితో , నచ్చిన మెచ్చిన కులము వారిని చేసుకోండి .
ఎవరి జీవితాలు వారివి . ఆనందముగా ,స్వేచ్ఛగా ,గౌరవంగా ,ఆరోగ్యముగా ,అన్నోన్యముగా జీవితము కొనసాగించండి .
శుభం .. శుభమస్థు ..

Source - Whatsapp Message

No comments:

Post a Comment