జీవించటం అంటే ఏమిటి..!?
🌸 జీవించటం అంటే..
కేవలం సుఖంగా కాలం గడపటం కాదు.
హాయిగా సుఖంగా కాలాన్ని వెళ్లదీస్తూన్న
వారంతా నిజానికి జీవించటం లేదు
ఇంతకీ జీవించటం అంటే ఏమిటి మరి..!?
🌸 గొప్ప విషయాల సృష్టి, లేదా గుర్తింపు ఒకే మూసలో జీవించే వారివల్ల ఎన్నడూ
సాధ్యపడనేలేదు. విభిన్న పరిధుల్లో అన్వేషణలు చేసేవాడికే; ప్రయోగ
పరిశోధనలు చేసేవాడికే.. అంతఃచేతన
సుసంపన్నం అవుతుంది. లోలోపల... ద్వారాలనేకం తెరుచు కుంటాయి.
అపుడు మన అస్తిత్వం విస్తరిస్తుంది. మన వ్యక్తిత్వం
పెరుగుతుంది. మన పరిధి పెద్దదౌతుంది..కనుక మనకు సాధ్యమైనన్నిపరిధుల్లో జీవితానుభవం పొందాలి. ఎందుకంటే అనుభూతులే జీవితం కనుక.
🌸 నిజమైన మనిషి ఎప్పటికీ ఏఒక్కదానిలోనూ
స్థిరపడలేడు. నిజమైన మనిషి నిరంతర అన్వేషి.
నిరంతర సంచారి. నిరంతర శోధకుడు.
నిరంతర అభ్యాసి. నేర్చుకునేవాడుగా వుంటాడు.
నేర్చేసుకొని వుండడు. పండితుడుగా మిగిలిపోడు.
🌸 ఏది నేర్చుకున్నా సంపూర్ణంగా సమగ్రంగా ల్లోతుల్లో నేర్చే ప్రయత్నంలోనే వుంటాడు. అది నాట్యమో
గానమో లేఖనమో కవిత్వమో కావొచ్చు. ప్రేమ
కూడా కావొచ్చు. ఏదైనా లోతుల్లోకి వెళితేనే..
దాని రహస్యాలు వెల్లడవుతాయి.
🌸 ఓ పుష్పం అందంగా వికసిస్తుంది. సుగంధాలు
సైతం వేదజల్లుతూ. కనిపించే దాని అందాలు..
కనిపించని ఆ మొక్కమూలంలో కదా వుంటాయి. అలా దాన్ని వ్యక్తం చేసేందుకు బహుశా అది పడిన
తపనా; రహస్య ప్రయత్నమూ..మట్టిని పువ్వుగా మార్చే ఆ ప్రక్రియ..వివిధ రూపాలుగా రంగులు, సువాసనలు వంటి అసలు రహస్యాలన్ని
మూలంలో..వేర్లలో వుంటాయి. పుష్పాలు కేవలం
ఆ మొక్కయొక్క ఆనందపు ప్రకటనలు మాత్రమే.
అన్నింటినీ అలా వాటిలోతుకంటా తరచి చూడటం వస్తే.. మనల్ను మనమే మనలోతుల్లోకి చూడటం అలవడుతుందని
అది నేర్వటమే..జీవించటమని తత్వం అంటుంది...
🌸 నేర్చుకోవడంలో సోక్రటిస్ని, చెప్పడంలో గర్జియప్ ని.. సంగీతం లో బిస్మిల్లాఖాన్ని,
ప్రేమించటంలో అమ్మ ని, నిత్యం నేర్చుకుంటూ, నేర్పుతూ... కాళీ అనేది ఉంచకుండా ఎలా ఉండాలో చెప్పే పత్రి sir ని ... వీరంతా మనకు రోల్ మోడల్స్...
మన జీవితం మనమే తీర్చి దిద్దుకుంటే అదే అసలు జీవనం.. ఎందుకంటే అక్కడ ఉండేది మనమే... ఎం చేసిన ఎలా చేసిన అనుభూతి మనదే... ఆస్వాదన మనదే.. జీవితం మనదే.. జీవించేది మనమే... ఇంకొకరితో పోలిక లేకుండా మన జీవితంలో మనం లయమౌదాం...
Thank you....🌸
Source - Whatsapp Message

No comments:
Post a Comment