Thursday, July 23, 2020

పెళ్లంటేనూరేళ్లు

పెళ్లంటేనూరేళ్లు

🙏తాళాలు, తప్పట్లు, పెళ్లి పందిళ్లు, మంగళ వాయిద్యాలు, మూడు ముళ్లు, బంధువుల సందడి ఇది భారతీయ హిందూ సంప్రదాయ పెళ్లి. ఇల్లంతా పచ్చటి తోరణాలు, చుట్టాల ముచ్చట్లు, ఆడవాళ్ల ఆభరణాలు, పట్టుచీరల సోయగాలు, పిల్లల కోలాహలంతో.. పెళ్లి ఇంటి సందడే సందడి. ఇక మూడు ముళ్లతో ఒక్కటయ్యే జంట సంగతి చెప్పనక్కరలేదు. చిలిపి ఆలోచనలు, సిగ్గు తెరలు, ముసిముసి నవ్వులు, అందమైన అలంకరణలో మెరిసిపోతుంటారు వధువు, వరుడు.



పవిత్రంగా భావించే హిందూ సంప్రదాయ పెళ్లిలో చాలా విశిష్టతలున్నాయి. చాలా ఆచారాలు, సందప్రదాయాలు ఉన్నాయి. అగ్నిహోత్రం వెలుతులో కొత్తజీవితాన్ని ఆహ్వానిస్తున్న వధూవరులు.. పెళ్లికి పరమార్థం చెప్పే వేదమంత్రాలు.. శ్రావ్యంగా వినిపించే మంగళవాయిద్యాలు.. మనస్పూర్తీగా దీవించే పెద్దలు.. అందరికీ ఆహ్వానం పలికే పచ్చటి పందిరి.. ఘుమఘుమల సువాసనలతో నోరూరించే విందు భోజనం.. అన్నింటి మేళవించే.. తెలుగింటి పెళ్లి వైభోగం. భార్యాభర్తల మధ్య అనుబంధం బలపడాలంటే.. అయితే పెళ్లి జరిగేటప్పుడు నిర్వహించే ఘట్టం, ప్రతి ఆచారం, ప్రతి వాగ్ధానం వెనక చాలా అర్థాలు, పరమార్థాలు ఉన్నాయి. అందుకే ఈ ఆచారాలకు అంత ప్రాధాన్యత ఉంది.
హిందూ సంప్రదాయానికి అద్దంపట్టే తెలుగు పెళ్లిలోని విశేషాలు, వాటి విశిష్టతలు ఏంటో ఒక్కసారి గుర్తుచేసుకుందాం..

బాసికంపెళ్లిఅంటేయేమిటి ?

ముందుగా వధూవరుల అలంకరణకు ఖచ్చితంగా ఉపయోగించేది బాసికం. వధూవరుల నుదుటిపై కాంతులీనే ఆభరణమే బాసికం. దీన్ని పూలతో, బియ్యపు గింజల కూర్పుతో, ముత్యాలతో తయారు చేస్తారు. దీన్ని పెళ్లి సమయంలో ఖచ్చితంగా వధూవరులు కట్టుకోవాలి. ఎందుకనే డౌట్ అందరికీ ఉంటుంది. దృషి దోష నివారణకు బాసికాన్ని కడతారు. సున్నిత భాగాలపై దృష్టి దోషం తగలకుండా ఉండటానికి బాసికాన్ని కడతారు.

జీలకర్ర, #బెల్లం

జీలకర్ర, బెల్లం కలిపితే ధన విద్యుత్ ఉత్పన్నమై వస్తువులను ఆకర్షించే శక్తి కలుగుతుందని సైన్స్ చెబుతోంది. జీలకర్ర, బెల్లం పెట్టడం వల్ల తలపై ఉండే బ్రహ్మరంధ్రం తెరుచుకుంటుంది. అలాగే జీలకర్ర, బెల్లం మిశ్రమం బాగా కలిసిపోతుంది. అలా వధూవరులు కూడా కలిసిపోవాలని పూర్వీకులు ఈ సంప్రదాయాన్ని ప్రవేశపెట్టారు.

వధూవరుల మధ్యలో తెర మధ్యలో ఉంచే తెరకు కూడా అర్థం ఉంది.

వధువును జీవాత్మగా, వరుడిని పరమాత్మగా భావిస్తే మధ్యలో ఉండే తెర మాయ. జీవాత్మకు పరమాత్మ దర్శనం కావాలంటే మాయను తొలిసారి తలపై చేతులు ఉండగా భ్రూమధ్య స్థానంలోనే చూస్తారు. ఇలా వాళ్ల బంధం బలపడుతుందని అర్థం.

కన్యాదానం దానం చేస్తే ఆ వస్తువుతో మనకు అన్ని సంబంధాలు తెగిపోతాయి.

కానీ పెళ్లిలో మాత్రం అలా కాదు. దానాలలో అతి శ్రేష్టమైనది కన్యాదానం. పెళ్లికూతురి తండ్రి తన కూతురిని వరుడికి దానం ఇస్తారు. పంచ భూతాల సాక్షిగా, అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసిన కూతురిని ధర్మ, అర్థ, కామ, మోక్షాలకై అల్లుడికి దానమిస్తాడు వధువు తండ్రి. ఈ దానం వల్ల తనకు బ్రహ్మలోక ప్రాప్తి కావాలని కోరుకున్నట్లు. బ్రహ్మముడి వధువ చీర అంచును, వరుడి ఉత్తరీయం చివరలను కలిపి ముడి వేయటం అంటే జీవితాంతం ఆశీస్సులను, బ్రాహ్మణాశీర్వచనాలను దంపతుల కొంగులతో ముడివేయటమే. వధూవరుల బంధం శాశ్వతంగా, స్థిరంగా ఉండాలని ఈ ముడి వేయిస్తారు.

ఉంగరాలు తీయటం పెళ్లిలో ఉంగరాలు తీసే కార్యక్రమం వధూవరులతో పాటు.. చుట్టూ ఉన్న వాళ్లందరికీ చాలా సరదా. చూడటానికి చాలా సరదాగా కనిపించే తంతు ఇది.

పోటీ పడి గెలవాలనే పట్టుదలని, అంతలోనే తను ఓడిపోయి ఎదుటి మనిషిని గెలిపించాలనే ప్రేమ భావనని చిగురింపజేస్తుంది.

మంగళసూత్రం సూత్రంఅంటేదారం.

మంగళప్రదమైంది కనుగ మంగళ సూత్రం. ఇది వైవాహిక జీవితం నుంచి సమస్త కీడులను తొలగిస్తుందని నమ్మకం. ఈ మాంగల్యాన్ని వరుడు, వధువు మెడలో వేసి మూడుసార్లు ముడి వేస్తాడు. మూడు ముళ్లే ఎందుకు ? మనకు మూడుతో విడదీయరాని సంబంధం ఉంది. త్రిమూర్తులు, త్రిగుణాలు, త్రికాలాలు, ఇలా ఏది చూసినా మూడే ఉంటాయి. అలా మూడుకు ఉన్న ప్రాధాన్యాన్ని బట్టి ముడులు కూడా మూడు ఉన్నాయి. అలాగే మనకు స్థూల, సూక్ష్మ, కారణ అని మూడు శరీరాలు ఉన్నాయి. ఆ మూడు శరీరాలకు మూడు ముళ్లు అనే అర్థం కూడా ఉంది. కాబట్టి స్థూల శరీరం ఉన్నా, లేకున్నా వారి మధ్య ఆ బంధం ఉండాలి అనేది అందులోని పరమార్థం.

మాంగళ్య ధారణ సమయంలో మంత్రం మాంగళ్యధారణ సమయంలో చదివే మంత్రానికి చాలా విశిష్టత ఉంది.

మాంగల్యం తంతునానేనా మమ జీవన హేతునా, కంఠే బద్నామి శుభగే త్వంజీవ శరదాం శతమ్.

అంటే నా జీవితానికి కారణమైన ఈ సూత్రంతో నేనే నీ మెడలో మాంగళ్యం అనే ఈ బంధాన్ని వేస్తున్నాను. నీ మెడలోని మాంగల్యంతో నీవు శత వసంతాలు జీవించాలి. నీ మాంగళ్యమే నాకు రక్ష. నా జీవితం, నా జీవనగమనం ఈ మాంగళ్యంపైనే ఆధారపడి ఉందని అర్థం.

తలంబ్రాలు-తలంబ్రాలు

వివాహంలో ముఖ్య ఘట్టం. వధూవరుల భావి జీవితం మంగళమయం కావటానికి మంగళ ద్రవ్యాలచే చేయించే పవిత్ర కర్మ ఈ తలంబ్రాలు. వీటికి వాడేవి అక్షతలు.

(అక్షత అంటే విరిగిపోనివి అని అర్థం.)

ఇక దానికి బియ్యాన్నే ఎందుకు ఉపయోగిస్తారంటే బియ్యం ఇంటి నిండా సమృద్ధిగా ఎప్పుడూ ఉండాలని, గృహస్థు ఇంట్లో ధాన్యానికి ఎప్పుడూ కొరత లేకుండా ఉండాలని వాడతారు. పాణిగ్రహణం కన్యచేతిని వరుడు గ్రహించటమే పాణిగ్రహణం. వరుడు తన కుడి చేతితో వధువు కుడిచేతిని పట్టుకోవటాన్ని పాణిగ్రహణం అంటారు. ఇకపై నేనే నీ రక్షణ భారం వహిస్తానని సూచించటానికి,

(పురుషుని కుడి చేయి బోర్లించి, స్త్రీ కుడి చేయిపైకి ఉండేలా చేయి పట్టుకోవాలి.)

దీనికి అర్థం ఇంటి యజమానురాలిగా, ఇంటిని తీర్చిదిద్దే ఇల్లాలిగా ఇంటికి రమ్మని ఆహ్వానించటం.

హోమం పవిత్రమైన అగ్ని మనిషికి, దేవునికి వారధిగా ఉంటుంది
హోమం చుట్టూ పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు మనస్సాక్షిగా ఒకరిని ఒకరు అంగీకరిస్తున్నట్టు అందరి ముందు ఒకరి చేయి ఒకరు పట్టుకుని ఏడు సార్లు తిరుగుతారు.

ఏడుఅడుగులపరమార్థం

భార్యా భర్తలు ఇద్దరు కలిసి వేసే ఏడు అడుగుల్లో ప్రతి అడుగుకి అర్థం ఉంది. ఇద్దరు కలిసి సంసార బాధ్యతలు తీసుకుంటామని, ఇద్దరం ధైర్యంతో, శక్తితో అన్ని అవసరాలని తీర్చుకుంటామని, ఇద్దరం కలిసి కుటుంబం సుఖ సంతోషాల కోసం పాటుపడతామని, కష్టసుఖాలలో కలిసి ఉంటామని, ఇద్దరు కలిసి పిల్లల్ని మంచిదారిలో పెంచుతామని, ఇద్దరం కలిసి సుఖ, శాంతి కోసం పాటుపడతామని, ఆధ్యాత్మికంగా పురోగతి చెందుతామని, జీవితాంతం పెళ్లి బంధంలో ఉంటామని చెబుతారు.

నల్లపూసలుధరించేదిఎందుకు

మంగళ సూత్రంతో పాటు నల్ల పూసలు గొలుసుగా ధరించడం హిందూ సాంప్రదాయం. దుష్ట శక్తులు తన మాంగల్యం మీద పడకుండా ఉండటానికి ధరిస్తారు. అంతే కాకుండా నల్లపూసలు సంతాన సాఫల్యానికి, దానానికి, సుఖానికి చిహ్నాలు. నల్లపూసలు మంగళకరమైన, సౌభాగ్యమైన ఆభరణము.

భార్య, భర్తకు ఏ వైపు ఎలాంటి కార్యాలలోనైనా భర్తకు భార్య ఎడమ వైపునే ఉండాలన్నది నియమం.

పూజలు, దానాలు, ధర్మాలు చేసేటప్పుడు భార్య, భర్తకు ఎడమవైపునే ఉండాలి.

కన్యాదానం, విగ్రహ ప్రతిష్టలప్పుడు కుడి వైపున ఉండాలి.

కాలితోబియ్యంనెట్టడంఎందుకు ?

కొత్తగా పెళ్లైన అమ్మాయి అత్తగారింట్లో కాలుపెట్టే ముందు బియ్యాన్ని కాలితో నెట్టి లోనికి వస్తుంది. లక్ష్మీ నివాసముండే వరి బియ్యం లేదా బియ్యంతో నిండిన కలశంను గడపపై ఉంచుతారు. ఇలా దీన్ని ఇంట్లోకి నెట్టుతూ లోపలికి పెళ్లికూతురు వస్తే లక్ష్మీదేవినే ఆ ఇంట్లోకి తీసుకొచ్చినట్టు అవుతుందని అర్థం. ఆ ఇంటికి లక్ష్మీ కటాక్షం వస్తుందని నమ్మకం.🙏



Source - Whatsapp Message

No comments:

Post a Comment