Sunday, July 5, 2020

నాగా సాధువులు

నాగా సాధువులు
నాగా సాధువులను, "నగ్న యోగులు" అని కూడా అంటారు. వీరి సాంప్రదాయం త్రేతాయుగ కాలం నుండి కలదు. దత్తాత్రేయుడు....నాగా సాంప్రదాయికుల మూల పురుషుడు. ఆధునిక కాలంలో, ఆది శంకరాచార్యుల వారు ఆనాటి పరిస్థితులను బట్టి "నాగా సాధు సాంప్రదాయాలను" పునరుద్ధరిస్తూ, వీరిని హిందూ ధర్మ పరిరక్షకులుగా, శక్తి వంతమైన సాధు సైన్యంగా రూపొందించారు.

"నాగా సన్యాసుల" చరిత్ర చాలా ప్రాచీనమైనది. పరమశివుని, పశుపతినాధుని పేరుతో వీరు అర్చించిన ముద్రలు,గుర్తులు ....త్రవ్వకాలలో లభించాయి. అలెగ్జాండర్ మరియూ అతని అనుయాయులు కూడా నాగా సాంప్రదాయ సన్యాసులను కలిసారు.


గౌతమ బుద్ధుడు, మహావీరుడు...నాగా సాధువుల తపస్సుకు ఆశ్చర్యం వ్యక్తం చేసారు కూడా! నాగా సాధువుల దేశభక్తి, తమ ధర్మం పట్ల తమకు గల అనురక్తి, ఆ ధర్మావలంబన పట్ల తమ జీవితాలను సైతం త్యాగం చేయడం....ఇవన్నీ కూడా గౌతమబుద్ధుని ప్రభావితం చేసినట్లు చరిత్ర చెబుతోంది.


జైనులలో ఒక శాఖ అయిన "దిగంబరులు", నాగా సాధువుల నుండే కొన్ని ఆచారాలు స్వీకరించినట్లు కూడా చరిత్ర చెబుతోంది.


నాగా సాధువులు, మనలా దుస్తులు ధరించరు. వారు కాషాయ రంగు గల ఏకవస్త్రము మాత్రమే ధరిస్తారు.... కాపీడ్ ఫ్రం భట్టా....ఆ వస్త్రము కూడా శరీరానికి పూర్తిగా సరిపోదు. ఒక నాగా సాధువు , తన శరీరాన్ని కప్పుకొనేందుకు, ప్రాపంచికమైన విషయాలను ధరించడు. అతను విభూది ధారణ మాత్రమే చేస్తాడు.


నాగా సాధు సాంప్రదాయంలో హోదాలు :

1. నాగా సాధువు
2. మహంతు
3. శ్రీ మహంతు
4. ఠానాపతి మహంతు
5. పీర్ మహంతు
6.దిగంబరేశ్వర్
7. మహామండలేశ్వర్
8. ఆచార్య మహామండలేశ్వర్


నాగా సాధువులు, తమ మెడలో, చేతులలో రుద్రాక్షలు ధారణ చేస్తారు.రుద్రాక్షమాల చాలా శక్తివంతమైనది. వారు రుద్రాక్ష మాలలను,తాము ధరించే ముందు మంత్రాలతో , అనేక సంవత్సరాలపాటు సిద్ధి చేసి వాటిని ధరిస్తారు. ఆ రుద్రాక్ష మాలలు సిద్ధి అయిన తరువాత , ఏ నాగా సాధువైతే రుద్రాక్షమాల వేసుకుంటాడో...వాడిని రక్షిస్తుంది.

సిద్ధి చేయబడిన ఆ రుద్రాక్షమాల, ఆ నాగా సాధువు యొక్క "ఆరా"(aura)/శరీర కాంతి వలయాన్ని ప్రభావితం చేసి ఆ కాంతివలయపు శక్తి పెరిగేటట్లు చేస్తుంది.


ఒక నాగా సాధువు కావడానికి కొన్ని నిబంధనలు కూడా ఉన్నాయి.

ఒక వ్యక్తి తాను ఒక నాగా సాధువుగా మారాలంటే, అతను తన కామశక్తిపై సంపూర్ణ అదుపు కలిగి ఉండాలి. కామ పరమైన భావాలపై అదుపు...కాపీడ్ ఫ్రం భట్టా..., కామేచ్ఛ(libido) పై అదుపు కూడా కలిగి యుండాలి.


బ్రహ్మచర్యాన్ని పాటించడం అనేది, కేవలం శరీరానికే పరిమితం కాకుండా, నైతికరీత్యా కూడా పాటించాలి. ప్రాపంచిక విషయాల పట్ల అతను వైరాగ్యంతో ఉండాలి. ఒక వ్యక్తి తాను ఇంద్రియాతీత సుఖాలకు అతీతుడైనా, భగవంతునిపైన,తన దేశ ప్రజల పైన, తన మాతృదేశం పైన ప్రేమ లేకపోతే అతను వృధాభరితుడే. రాష్ట్ర ధర్మాన్ని ప్రతిబింబించలేడు. గురువు అనేవాడు, ఒక సాధువుకు ఎలా సహాయం చేస్తాడు? తనకు గల అహంకారం తొలగించుకోవడంలో, సహాయం చేస్తాడు. నిస్వార్ధమైన భక్తి గల ఒక నాగా సాధువు , సాటి మనుజుల పట్ల, దేశం పట్ల సద్భావం కలిగి యుండి, వారి రక్షణ బాధ్యతను తీసుకుంటాడు.


ఒక వ్యక్తి నాగా సాధువుగా మారడానికి ముందుగా తాను తనకు సంబంధించిన అన్ని భవబంధనాలను వదులుకోవలసివస్తుంది....భట్టాచార్య....


వీరు ధరించే విభూది నామాలు మరియు రుద్రాక్షల ద్వారా ఏ ఆఖాడాకు చెందిన వారో తెలియచేయబడుతుంది.

ఒక వ్యక్తి నాగ సాధువుగా మారాలంటే ముందుగా ఆఖాడా పెద్దలను కలసి వారి వివరాలు తెలియచెయ్యాలి.

వీరు చెప్పిన సమాచారం నచ్చితే వారిని స్వీకరిస్తారు లేదా అక్కడే నిరాకరిస్తారు.

ఒక సారి వద్దు అనుకుంటే, మళ్ళీ జీవితంలో వారిని స్వీకరించరు.

వీరికి అక్కడ 6 నెలలు నుండి 12 సంవత్సరాలు వరకు శిక్షణ ఉంటుంది

ఆ సమయం లో వారికి ఎంతో కఠినమైన శిక్షణ ఇవ్వబడుతుoది.

ఇంకా యోగాభ్యాసం,తంత్ర సాధన మరియు ధ్యానం లాంటి వాటిలో శిక్షణ ఇస్తారు.

కొందరికి తెలియని విషయము ఏమిటంటే అఘోరీ సాధువులు వేరు, నాగా సాధువులు వేరు. నాగా సాధువులు శాకాహారులు.

వీరు నేల పైనే నిద్రించాలి .రోజులో ఒక సారి మాత్రమే భుజించాలి. వీరు భిక్షాటన ద్వారా తమ ఆహారాన్నివారే సంపాదించుకోవాలి.

అది కూడా వారు రోజుకు 7 ఇళ్ల ముందు మాత్రమే భిక్ష అడగాలి. ఆ ఇంటి వారు ఏది ఇచ్చిన మహా ప్రసాదంగా స్వీకరించాలి.

వారు ఏమీ ఇవ్వనిచో శివాజ్ఞ, అని ఉపవాసం ఉండాల్సిందే.
వీరు దిగంబరంగ జీవించాల్సి ఉంటుంది.

శిక్షణ తొలి రోజులలో ఒక కాషాయ అంగ వస్త్రం (కౌపీనము)మాత్రమే ధరిస్తారు. శిక్షణ కాలం పెరిగేకొద్దీ విభూదిని మరియు రుద్రాక్షలు మాత్రమే దరిస్తారు.

వీరు ప్రధానంగా ఐదుగురు దేవతలను మాత్రమే పూజించాలి.

మొదటిగా శివుని , శక్తిని వినాయకుని , విష్ణువును మరియు సూర్యుని మాత్రమే పూజిస్తుంటారు.

ఆఖాడాలకు వచ్చిన వారికి అంచెలు అంచెలుగా శిక్షణ ఇవ్వబడుతుంది.


సన్యాసిగా మారక ముందు వీరు
గుండు చేయించుకొని, వారి కర్మ కాండలను వారే నిర్వహించుకోవాలి. విరజా హోమం ఉంటుంది.

స్వపిండ ప్రదానం చేసుకున్న తరువాతనే వీరికి అధికారికంగా నాగా సాధువుగా గుర్తింపు లభిస్తుంది.


వీరి పదవీ స్థాయిలలో చివరి వరకు వెళ్లలేని వారు వారి వారి స్థాయిలలో స్థిరపడి పోతుంటారు. వీరు హిందూ ధర్మ పరిరక్షణ కొరకు ప్రాణాలను ఇవ్వటానికి అయినా తీయటానికైనా సిద్ధంగా ఉంటారు.

ఈక్కడ మరో విషయం ఏమిటంటే.... ఆచార్య మండలేశ్వరుడిగా మారినా, వారికి చావు పుట్టుకలను శాసించే శక్తి ఉంటుంది. అంతటి సిద్ధ పురుషులన్నమాట!

వీరు ఎంత కాలమైన నిద్ర మరియు ఆహారాలను లేకుండా జీవించగలరు.

వీరు మనుష్యులకు కనిపించేందుకు ఇష్టపడరు.


శ్రీ ఆదిశంకరాచార్యుల వారి కాలంలో దేశంలో బౌద్ధం బాగా ప్రాచుర్యంలో ఉండగా..... అరబ్ లు, పారశీకులు లాంటి ఆటవిక తెగలు హిందూ దేశంలోకి ప్రవేశించి హిందూ దేవాలయాలను కూల్చుతూ, సాధువులను చంపుతుండే వారు. వారిని కట్టడి చేయడానికి అప్పటి రాజులు ఎంత ప్రయత్నించినా అది కుదిరేది కాదు. దీంతో హిందూ ధర్మాన్ని రక్షించాల్సిన అవసరముందని గుర్తించిన ఆదిశంకరాచార్యులు......సాధువుల సైన్యాన్ని తయారు చేశారు. ఆ సైన్యమే నేటి నాగ సాధువులు. శాపాలు, ఆర్తనాదాల వల్ల హిందూ ధర్మం నిలబడలేదని, దాన్ని నిలబెట్టాల్సిన ధర్మం నాగ సాధువులకు అప్పగించారు.

హిందూ ధర్మాన్ని రక్షించడమే పరమావధిగా వీరు జీవిస్తుండగా..... ఎప్పుడూ శివ నామస్మరణ చేస్తుంటారు. మంత్ర శాస్త్ర ప్రయోగాలతో పాటు అస్త్రశస్త్రాలను ఎలా ప్రయోగించాలో వీరి మరింత తర్ఫీదు తీసుకుని ఉంటారు. నాడు హిందూ దేవాలయ మీద జరిగే దాడిని వీరు క్రమక్రమంగా అడ్డుకుంటూ వచ్చారు. ఒకానొక సమయంలో అరబ్బుల దాడుల నుండి తమను కాపాడమని నాటి రాజులు నాగ సాధువులను వేడుకునే వారు. అంటే వీరి బలం ఏంటో అర్థమవుతుంది. కేవలం వందల సంఖ్యలో, నాగ సాధువుల బృందం వేల సంఖ్యలోని బలశాలురైన అరబ్బుల సైన్యాన్ని ఊతకోత కోయడం చూసి నాటి పండితులు ‘ఎంతో మంది రుద్రులు రక్తంతో విలయతాండవం ఆడినట్లు ఉంది’ అని అన్నారంటే వారి పరాక్రమాలు అర్థమవుతాయి.

నాగ సాధువులు హిమాలయాల్లో ఉంటూ నిత్యం తపోధ్యానాలలో ఉంటారు. వీరు ఒంటి మీద నూలు పోగు లేకుండా విభూతి రాసుకుని జీవిస్తుంటారు. కాలం ఏదైనా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా వీరు బట్టలు వేసుకోరు.. సబ్బు వాడటం, నూనె వాడటం లాంటివి వీరి జాబితాలో ఉండవు. రోజులో ఒకసారి మాత్రమే తినే సాధువులు..... రోజులో సాయంత్రం పూట కేవలం ఏడు ఇళ్లలో భిక్ష అడుగుతారు. ఏడు ఇళ్లలో ఏ కుటుంబం భిక్ష వేసినా స్వీకరిస్తారు. ఒకవేళ భిక్ష లభించకపోతే ఆ రోజు ఏమీ తీసుకోరు.

నాగ సాధువులు కుంభమేళా జరిగే సమయంలో తప్ప ఎప్పుడూ కనిపించరు. సాధారణంగా హిమాలయాల్లో ఉండే నాగ సాధువులు కుంభమేళా సమయంలో మాత్రం అక్కడికి చేరుకుంటారు. అయితే హిమాలయాల నుండి ఎన్ని వేల కిలోమీటర్ల దూరం ఉన్నా మధ్యలో ఎక్కడా వీరు తారసపడరు. కుంభమేళా ప్రారంభంలో వీరు పవిత్ర స్నానాలు పుణ్య జలాలకు మరింత పుణ్యాన్ని ఆపాదిస్తాయని చాలా మంది నమ్మకం.


నాగా సాధువులను, "నగ్న యోగులు" అని కూడా అంటారు. వీరి సాంప్రదాయం త్రేతాయుగ కాలం నుండి కలదు. దత్తాత్రేయుడు....నాగా సాంప్రదాయికుల మూల పురుషుడు. ఆధునిక కాలంలో, ఆది శంకరాచార్యుల వారు ఆనాటి పరిస్థితులను బట్టి "నాగా సాధు సాంప్రదాయాలను" పునరుద్ధరిస్తూ, వీరిని హిందూ ధర్మ పరిరక్షకులుగా, శక్తి వంతమైన సాధు సైన్యంగా రూపొందించారు.(సశేషం)

భట్టాచార్య

Source - whatsapp sandesam

No comments:

Post a Comment