ఆకాషిక్ రికార్డులు / త్రికాల జ్ఞానం :
దివ్యజ్ఞాన సాహిత్యంలో (the theosophical knowledge), ఈ ఆకాషిక్ రికార్డుల గూర్చి వర్ణించబడినవి. మనుజుల జీవితంలోని ఘటనలు, చింతనా ధారలు, భావజాలం, గతకాలపు ఘటనలు, వర్తమాన-భవిష్యత్ కాలం నాటి సంఘటనలు, ఈ భూత-భవిష్యత్-వర్తమాన కాలాల నాటి సమస్త విషయాలు...ఈ ఆకాషిక్ రికార్డులలో నిక్షిప్తమై ఉంటాయి. అయితే ఇవన్నీ ఒక "కోడ్ లాంగ్వేజ్" లో, భద్రపరచబడి ఉంటాయని, theosophists చెబుతారు. ఈ ఆకాషిక్ రికార్డులు, అభౌతిక తలంలో అనగా ఒకానొక మార్మిక తలంలో(esoteric plane) ఉంటాయి. అయితే దివ్యజ్ఞానం పొందిన, దివ్య నేత్రం వికసించిన ద్రష్టలు , ఈ రికార్డులు చూడగలుగుతారు. మన పురాణాది సాహిత్యంలో, ఇతిహాసాలలో నారద మహర్షి పేరు , ప్రముఖంగా మనం చూస్తాం. నారదుడు త్రికాల వేది. వేదవ్యాస మహర్షి, త్రికాల వేది. హిందూ పురాణాలలో, వేదాది సాహిత్యంలో, ఇతిహాసాలలో ప్రస్తావించబడ్డ ఋషులు,మహర్షులు,సిద్ధ పురుషులు, ఆత్మ జ్ఞానులు అందరూ త్రికాల వేదులే. ఆకాషిక్ రికార్డులు చదివి చెప్పినవారే.
అణిమాది అష్ట గౌణ సిద్ధులలో ఒకటైన "దూరదృష్టి" కలిగిన వారు, ఖచ్చితంగా, ఈ ఆకాషిక్ రికార్డులు చూడగలరు. అనుభవించగలరు.
ఆకాషిక్ రికార్డులు కాంతిని మాత్రమే కాక, శబ్దాన్ని కూడా, తమలో పొందుపరచుకొని యుండి, అవసరమైనవారికి తిరిగి ఇస్తాయి. ఈ ఆకాషిక్ రికార్డులు, ఎన్నటికీ నాశనం చెందవు. మనం కాలం వెనుకకు వెళ్ళి, గతాగత చరిత్రలు చూడవచ్చు, అనుభవించవచ్చును.
జీవించిన ప్రతి వ్యక్తికీ, జీవికీ...ఈ ఆకాషిక్ రికార్డులు, అత్యంత ఆత్మీయంగా ఉంటాయి. సృష్టిలో ఏదియూ నాశనము కాదు....అనే శాశ్వతత్వ నియమం ప్రకారం ఈ "ఆకాషిక్ రికార్డులు" పని చేస్తూ ఉంటాయి.
"ఆకాషిక్ రికార్డులు" అనగా ఒక విధమైన సూక్ష్మ ప్రకంపనలు అనుకోవచ్చు. ఈ ప్రకంపనలు "కాంతి" కే కాదు, "శబ్దానికి" కూడా వర్తిస్తాయి. ఈ ఆకాషిక్ రికార్డులు అనేవి ఎప్పటికీ నాశనం కావు. ఇవి ఎల్లప్పుడూ ప్రసారమవుతూ ఉంటాయి.
అయితే, స్వతః సిద్ధంగానే, ఈ ఆకాషిక్ రికార్డుల లోనికి, తరచి చూడడానికి చాలా సమయం పడుతుంది. దీనికి ఎంతో శ్రమ,కాఠిన్యముతో కూడిన అభ్యాసాలు, సాధన, విశ్వాసం కావలసి వస్తాయి. అయితే ఈ రోజు చాలా మంది జిజ్ఞాసువులు, ఇందులో కృత కృత్యులు అయ్యారు. వారు సిద్ధులే.
అత్యంత గొప్ప మహనీయులు, యోగ దృష్టి ఉన్నవారు, భావ ప్రసార గ్రహణ శక్తి ఉన్నవారు, ఏదో ఒక శారీరక బాధను అనుభవిస్తూ ఉంటారు. ఇలాంటి బాధలు, ఆ వ్యక్తియొక్క ప్రకంపనలను, గణనీయంగా హెచ్చు చేయగలుగుతాయి. తద్వారా ఆ సిద్ధులు వారికి సంక్రమిస్తాయి.....
ఆత్మ జ్ఞానులైన మహనీయులు, ఈ భూమి మీదకి వచ్చేటపుడు, ఒక దుర్గుణాన్నో, ఒక వ్యసనాన్నో....ఒక్కోసారి తీసుకువస్తూ ఉంటారు. అంత మాత్రం చేత వారి జ్ఞానాన్ని తక్కువ అంచనా వేయకూడదు. ఆ మహనీయులు, తాము ఎందుకు భూమిమీదకు వస్తున్నారో, వారికి తెలుసు. ఏ వ్యసనమూ,ఏ దుర్గుణమూ...వారిని కట్టడి చేయలేదని వారికి తెలుసు. తాను జీవాత్మ యొక్క పరికరమని తెలుసు.
"ఆకాషిక్ రికార్డులు" అనేవి ఈశ్వర చైతన్యము యొక్క ఒకానొక భిన్న తలానికి చెందినవి.
ఈ ఆకాషిక్ రికార్డులు తెరవాలంటే, మనం...మన మానవ చైతన్య స్థాయిలను , దైవీక-వైశ్విక చైతన్య స్థాయిలకు తీసుకొని వెళ్ళాలి. మనం, విశ్వంలో గల అనేకత్వాన్ని, ఏకత్వంగా చూసే దృక్పథం పెంపొందించుకోవాలి. ఆ విధంగా మన వ్యష్టి చైతన్యం రూపొంద గలగాలి.
శతాబ్దాలుగా, సహస్రాబ్దాలుగా ఈ ఆకాషిక్ రికార్డులను, జ్ఞానులు,ఋషులు, సిద్ధ పురుషులు ఉపయోగిస్తున్నారు.
అనంత కాల చక్రంలో, కాల క్రమంలో, కాలం మారుతూ వస్తోంది. మానవ జాతి యొక్క సామూహిక చైతన్యం ఏదైతే ఉందో....అది పరిణామం చెంది....మనిషి, తాను ఇతరులపై ఆధార పడడాన్ని తగ్గించి ఆధ్యాత్మికంగా మరింత స్వేచ్ఛ పొందే ప్రయత్నం చేసాడు.
12 వ శతాబ్దం మధ్య కాలంలో, ఎడ్గార్ కేసీ (1877-1945)....ఆకాషిక్ రికార్డులు చదివాడు. అతనికి "sleeping prophet" అనే పేరు కలదు. ఎందుకంటే, అతను తాను నిద్రలోకి పోతూ, తన చైతన్యాన్ని-వైశ్విక చైతన్యం వైపు మరలిస్తాడు. అంటే తన వ్యక్తి చైతన్యాన్ని, విశ్వ చైతన్యంతో అనుసంధానిస్తాడు. ఈ సమయంలో "ఎడ్గార్ కేసీ"....తాను అనుభవిస్తున్న ఆకాషిక్ రికార్డులను చదువుతూ ఉంటే, ఒక వ్యక్తి ఆ రికార్డులను , గ్రంథస్తం చేసేవాడు. దాదాపు 4 దశాబ్దాలు , ఈ ఆకాషిక్ రికార్డుల సేవలను future predictions గా మానవాళికి అందించాడు. అలాగే నోష్ట్రడామస్, పోతులూరి వీర బ్రహ్మం గారు, వేమన, అల్లమ ప్రభువు, అక్క మహాదేవి, హెచ్.పి. బ్లావాట్ స్కీ.....ఇంకా ఎంతో మంది సిద్ధ పురుషులు ఈ ఆకాషిక్ రికార్డులను ఉపయోగించి, మానవాళికి ఎంతో సేవ చేసారు.
భట్టాచార్య
Source - Whatsapp Message

No comments:
Post a Comment