Saturday, August 1, 2020

పరమహంస యోగానంద - ఒకయోగి ఆత్మకథ లోని యోగి

🚩సనాతన ధర్మము🚩


🛑యోగులు భూమిపై పరమాత్మ స్వరూపాలు


🛑 పరమహంస యోగానంద

🔹ఒకయోగి ఆత్మకథ లోని యోగి

🔹ప్రపంచానికి ‘యోగ’ అన్నా, ‘క్రియా’ అన్నా తెలియని కాలములో, హృదయము నుంచి పరమాత్మను సేవించుకోవాలని తప్ప మరో విషయము తెలియని పశ్చిమ దేశ ప్రజలకు ‘క్రియాయోగా’ను పరిచయము చేసిన మహాయోగి శ్రీ పరమహంస యోగానంద.

🔹 ఆయన స్థాపించిన ‘యోగదా సత్సంగ్ సొసైటీ’ (YSS) ద్వారా ఎందరికో క్రియాయోగ దీక్ష ఇవ్వబడింది.

🔹భగవంతుని హృదయములో కొలిచే వారికి, వెన్నెముకలో షట్ చక్రాలుంటాయని, మొదటి చక్రము క్రింద కుండలిని పాములా పడుకొని వుంటుందంటే వాళ్ళకి వింత.

🔹 ఆ చక్రాలను ప్రేరేపించి సహస్రారముతో కలిపి పరమాత్మతో మమైక్యమవ్వచ్చని ఆయన మొదట చెబితే వారు నవ్వి వుంటారు.

🔹కాని స్వామి యోగానందను అమెరికాలో స్వాగతించారు. ప్రపంచములో అలా క్రియాయోగాను వ్యాపింపచేసి, ఎందరికో ముక్తికి సహయము చేసిన యోగానందగారు హిమాలయాలంత ఎత్తుకు ఎదిగారన్న విషయము నిర్వివాదము.

🔹ఉత్తరప్రదేశ్‌ లోని గోరక్‌పూర్ లో సాంప్రదాయ బెంగాలీ కుటుంబములో 1893 జన్నించారు.

🔹 తండ్రి భగవతీ చరణ్‌ ఘోష్, తల్లి సర్ణలతాదేవి. ఎనిమిది మంది సంతానములో నాలుగోవాడు.

🔹 పూర్వనామము ముకుందలాల్ ఘోష్. శ్రీ యోగానంద కుంటుబము మొత్తం లహరి మహాశయ భక్తులు.

🔹చిన్నతనము నుంచి ఆధ్యాత్మికతలో ఆసక్తి, పరిణితి ప్రదర్శించేవారు.

🔹 చాలా చిన్న వయస్సులో ఇంటి నుంచి హిమాలయాలకు పారిపోవాలని ప్రయత్నం కూడా చేశారు కాని ఫలించదు.

🔹 గురువును వెతుకుతూ చాలా తిరుగుతారు. ఎందరో సాధువులను కలుస్తారు.

🔹అలా కలిసినవారిలో ముఖ్యులు నిద్రపోని సాధవు, టైగర్ స్వామి మొదలైనవారు.

🔹 1910 లో మొదటిసారి తన గురువైన యుక్తేశ్వర్ గిరిని కలుసుకుంటారు. ఆ కలయిక మరవలేనని చెబుతారు తన ఆత్మకథలో.

🔹చదువును తప్పించుకోవాలని చూస్తారు కానీ, గురువాజ్ఞపై బియే డిగ్రీకి సమానమైన పట్టా పొందుతారు శ్రీయోగానంద.

🔹1916లో సన్యాసము తీసుకొని ‘యోగానందగిరి,గా నామాంతరము పొందుతారు.

🔹పశ్చిమ బెంగాల్ లో చిన్న పాఠశాల ప్రారంభించి మరుసటిఏడుకు రాంచీకి బదిలీ అయ్యారు.

🔹 ఆ పాఠశాలలో చదువుతో పాటు ధ్యానము, క్రియాయోగా కూడా నేర్పేవారు.

🔹 ఒకనాటి రాంచీ పాఠశాలలో ధ్యానములో ఆయన ముందు ఎందరో విదేశీయులు ధ్యానము చెయ్యటము కనపడుతుంది.

🔹గురువుగారితో కలిసి కొంత కాలము తిరిగిన తరువాత గురువు ఆయనను పశ్చిమ దేశాలకు క్రియా యోగా తీసుకుపోవలసినది యోగానందనే యని చెబుతారు.

🔹 శ్రీ మహావతార్ బాబాజీ అన్న మహాయోగి సిద్ధాశ్రమ నివాసి.

🔹 బాబాజీ సశరీరముగా 2500 సంవత్సరములుగా వున్నారు. నేటీకీ వున్నారని భక్తుల నమ్మకము.

🔹 వారి ప్రణాలికలో భాగముగా శ్రీ యోగానంద పశ్చిమదేశాలలో క్రీయాయోగాను వ్యాప్తి చెయ్యాలని చెబుతారు యుక్తేశ్వరు బాబా.

🔹 యోగానందకు అమెరికా వెళ్ళాలని ఆసక్తి వుండదు కాని గురువాజ్ఞను మీరలేక పోతాడు.

🔹 ఆయనకు ఆ సమయములో బాబాజీ దర్శనము కలుగుతుంది.

🔹బాబాజీ “ఆయనకు సదా తోడు లభిస్తుందని క్రియను ప్రపంచమంతటా వ్యాప్తి చెయ్యాలని“ ఆశీర్వదిస్తారు.

🔹ఆనాటి ప్రపంచ సర్వమత సమ్మేళానానికి హిందూ సాధువుగా, భారతదేశము నుంచి యోగానంద బయలుదేరుతారు.

🔹 ఆయన ఓడలో ప్రయాణిస్తూ వుండగా ఓడలో వారికి ఆయన వెడుతున్న సభ గురించి తెలిసి వారికి ముందు సందేశమివ్వమని కోరుతారు.

🔹 ఆంగ్ల భాష అంటే వున్న దుడుకుతో భయంతో తడబడుతాడు కాని లోలోపలి ఆయన గురువు ఆజ్ఞ వినపడుతూ వుండగా మాటల కందని భావపరంపరలో తను చెప్పాలనుకున్న విషయము చెబుతాడు.

🔹అందరూ హర్షద్వానాల మధ్య తన భాషా సమస్య అధిగమిస్తారు యోగానంద.

🔹 ఆయన అటు తరువాత బోస్టన్‌లో దిగి అమెరికాలో యోగా వ్యాప్తికై కృషిచేశారు.

🔹 “యోగదా సత్‌సంగ్ సొసైటీ” అమెరికాలో కూడా నెలకొల్పుతారు.

🔹 ఈ కాషాయ వస్త్రాలలోని సాధువు అమెరికాలో విజయభేరిని మ్రోగిస్తారు .

🔹 అసలు ఏమీ లేని దాని నుంచి దాదాపు 100 యోగా కేంద్రాలు, ప్రతి పెద్ద నగరములో బ్రాంచీలు ఏర్పడుతాయి.

🔹వివేకానందుని తరువాత ఎంతో పేరు తెచ్చుకున్న హిందూ సాధవు శ్రీ పరమహంస యోగానందగిరి మాత్రమే.

🔹ఆయన 1920 లో వచ్చి మరణించేవరకూ అమెరికాలో వుండిపోయారు.

🔹మధ్యలో భారతదేశము వెళ్ళి వస్తారు గాని, క్యాలిఫోర్నియా లోని ఆశ్రమములో చివరివరకూ గడుపుతారు.

🔹 వాషింగ్‌టన్ లో అమెరికా అధక్ష్యునిచే గౌరవ విందు స్వీకరించిన మొదటి హిందూ సాధువు కూడా శ్రీ యోగానందనే.

🔹 హంగులకు, హడావిడికి, భౌతికవాదానికి మూలమైన పశ్చిమ దేశవాసులకు “సాధు జీవితము, అంతర్గత శాంతి” పూర్తిగా క్రొత్త విషయము.

🔹 ఆయన చెప్పేవన్నీ క్రీస్తు చెప్పిన వాటికి చేరువగా వున్నాయని నమ్మారు ప్రజలు.

🔹 తొలుత కృష్ణుడు ఉపదేశించినదే నేడు మళ్ళీ బాబాజీ ద్వారా ప్రజలకు చేరువవుతున్నదని చెబుతారు శ్రీ యోగానందా.

🔹ఆయన చెప్పిన క్రియా యోగా ముఖ్య ఉద్దేశము దేవునితో ఐక్యత సాధించటానికి అనుసరించవలసిన కొన్ని యోగా ప్రక్రియలు.

🔹 “మనిషి రక్తం లో వున్న కార్బనాన్ని హరింప చేసి ఆక్సిజన్ తో నింపే ఒకానొక మానసిక -శారీరిక ప్రక్రియ“ అంటారు యోగానందా

🔹 క్రియాయోగా గురించి చెబుతూ, తన ఆత్మకథలో.

🔹కృష్ణుడు భగవద్గీతలో అర్జనునికీ చెప్పినది, పతంజలికీ, క్రీస్తుకూ, శంకరాచార్యులకూ, బోధించబడినది క్రియాయోగమే.

🔹“ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యం
వివస్వాన్ మనసే ప్రాహ మను రిక్ష్వా కవే బ్రవీత్
🔹ఏవం పరంపరా ప్రాప్తమిమం రాజర్షయో విదుః
స కాలేనేహ మహతా యోగ నష్టఃపరంతప”

🔹భగవద్గీత 4:1:2.

🔹కృష్ణుడు ఈ యోగమును తానే ఉపదేశించానని చెప్పాడు. అది ఋషులకూ తదనంతరము తరతరాలుగా అందచెయ్యబడుతున్నది.


🔹అదే బాబాజీ సులువుగా వుండటానికి “క్రియాయోగ”మని పేరుపెట్టారు.

🔹 ఈ యోగా ద్వారా ఆక్సిజన్ ఎక్కువ ప్రవహించి శరీర తరుగుదల తగ్గుతుంది.

🔹శరీర వ్యాయామం, మనో నిగ్రహం, ఓంకారము మీద ధ్యానము కలిపి క్రియాయోగా అవుతుంది.

🔹క్రియాయోగా మానవ పరిణామాన్ని త్వరితం చెయ్యటానికి ఉపయోగపడుతుంది.

🔹క్రియాయోగి తన ప్రాణశక్తిని వెన్నుపూసలోని ఆరుకేంద్రాలైన ఆజ్ఞా, విశుద్ద, అనాహత, మణిపూర, స్వాధిష్టాన, మూలాధారాలనే షట్చక్రాలను చుట్టి, క్రింద నుంచి పైకి పరిభ్రమించేలా మానసికంగా నిర్దేశిస్తారు.

🔹 అతనికి సూక్ష్మ ప్రగతి సాధ్యం అవుతుంది. అనుభవము వలన కలిగిన జ్ఞానము మాత్రమే అజ్ఞానమును చెరిపివేస్తుంది.

🔹1935 లో ఒకసారి భారతదేశము వస్తారు యోగానందా.

🔹 గురుదేవులను కలవటము, వివిధ పత్రికలకు ఇంటర్యూలు ఇవ్వటమూ, కుంభమేళాలో పాల్గొనటము చేస్తారు.

🔹 ఆ సమయములోనే ఆనందమయి మాత ను కలవటము, రమణమహర్షని కలవటమూ, గాంధిని కలవటము కూడా జరుగుతాయి.

🔹 రాంచీలోని పాఠశాలను రిజిష్టరు చెయ్యటము, SYY భారతీయ బ్రాంచిలా చెయ్యటము ఇత్యాదివి చేస్తారు.

🔹 వారి గురువులైన యుక్తేశ్వరు బాబా సమాధి చెందుతారు ఆ సమయములోనే.

🔹అటు తరువాత ఆయన తిరిగి అమెరికా వెళ్ళి తన మరణము వరకూ క్యాలిఫోర్నియా లోని ఆశ్రమములోనే గడుపుతారు.

🔹 ఆ సమయములోనే ప్రపంచ ప్రసిద్ధమైన “ఒక యోగి ఆత్మకథ” ను రచిస్తారు.

🔹 ఆ దివ్యమైన పుస్తకము 1946 లో రచించారు శ్రీ యోగానంద.

🔹 అది ప్రపంచములో తప్పక చదవ వలసిన పుస్తకాలలో ఒకటిగా నమోదు కాబడినది.

🔹 ప్రపంచములో 52 భాషలలోకి అనువదించబడింది. కొన్ని మిలియన్ల లాభాన్నీ ఆశ్రమానికి సంపాదించిన గ్రంధరాజ్యమది.

🔹దానిని స్టీవ్ జాబ్ 500 పుస్తకాలు కొని తమ సంస్థలో అందరికీ పంచారుట.

🔹నేటికీ అది ప్రతి సంవత్సరము ప్రచురించబడుతోంది.

🔹భారత ప్రభుత్వము ఆమన గౌరవార్థము 1977లో ఒకసారి 2017 లో రెండవసారి స్టాంపును విడుదలచేసింది.

🔹ఎందరికో ముక్తి మార్గము చూపిన శ్రీ యోగానంద 1952 లో తన తుది శ్వాసను తీసుకున్నారు.

🔹 ఆయన మరణించిన 50 రోజుల వరకూ శరీరములో ఎలాంటి మార్పు లేక తాజాగా వుండి సందర్శకులను ఆశ్చర్య పరిచింది.

🔹క్యాలిపోర్నియాలోని ఆయన ఆశ్రమములో సమాధి మందిరమున్నది.

🔹వారి ఆత్మకథ ప్రపంచాన్నీ అబ్బుర పరిచింది.

🔹 యోగాతో చెయ్యలేనివి, సాధించలేనివి వుండవని ప్రపంచము చదివి నివ్వెరపోయేలా చేసింది.

🔹 ఆయన ఆ కథలో చూపిన నిజాయితి చదువరులను ముగ్ధులనుచేస్తుంది. ఆ గ్రంధమును భారతదేశములోని పాఠశాలల్లో పాఠ్యాంశముగా కూడా చేశారు.

🔹అది చదివితే అసలు సాధ్యము కానిది వుండదేమో అనిపిస్తుంది.

🔹ప్రపంచముచే వేనోళ్ళ పొగడబడిన శ్రీ యోగానంద క్రియాయోగాన్నీ అందరికీ అందుబాటులో తెచ్చిన మహాపురుషుడు.

🔹మేరునగధీరుడు. సదా పూజ్యనీయుడు.


ప్రణామాలతో
సంధ్యా యల్లాప్రగడ


◼◼◼◼◼◼◼

Source - Whatsapp Message

No comments:

Post a Comment