Thursday, August 6, 2020

లోభం

♦️ లోభం♦️

🌹ఎప్పుడైతే ఒక కోరిక కలిగిందో, అది తీరకపోతే క్రోధం వస్తుంది. అది తీరితే లోపంగా మారుతుంది. ఎలాగంటే ఒక వ్యక్తి ఎన్ని కష్టాలు పడైనా పదిలక్షలు సంపాదించాలి అనుకుని ప్రయత్నిస్తాడు. అది సంపాదించగలిగితే ఆ పదిలక్షలు జాగ్రత్తగా దాచేస్తాడు. ఎవరికీ ఒక్క పైసా కూడా ఖర్చు చేయడు. లోభి అయిపోతాడు. చాలామంది మానవులు ఎంత దౌర్భాగ్యం అనుభవిస్తున్నారంటే ఎంతో ఆస్తి ఉంటుంది. దానిని అనుభవించే ధైర్యం ఉండదు. ఆస్తి కేవలం చెప్పుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది .
🌹 ఈ లోభత్వం మనిషిని ఎంతో హింసించడమే కాక మనస్సుని కూడా ఎంతో నీచస్థితికి దిగజారుస్తుంది. అంతేకాకుండా లోభత్వం వలన వచ్చే మరో పెద్ద ప్రమాదం ఏమిటంటే మరణం తర్వాత మనిషి "ఎర్త్ బౌండెడ్ సోల్ "గా ఉండిపోతాడు. అంటే చనిపోయినా... నా సంపదలు అంటూ ఎన్నో సంవత్సరాలు ప్రేతాత్మగా తిరుగుతూ... భూలోకంలో ఉండిపోతారు. అందుకే ఈ లోభత్వం మనలో ససేమిరా ఉండకూడదు .
🌹 మరి ధనం విషయంలో ఎలా ఉండాలంటే, ఒక రూపాయి సంపాదించుకుంటే అందులో అర్థభాగాన్ని ఖర్చు పెట్టుకోవాలి. సంతోషంగా ప్రశాంతంగా జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలి. మిగిలిన సగభాగంలో పావు భాగం ధర్మ కార్యాల కోసం వినియోగించాలి. మిగిలిన పావును భవిష్యత్ అవసరాల కొరకు దాచుకోవాలి. అంతేగానీ సంపాదించిన ప్రతి రూపాయి దాచకూడదు. అలాగే ప్రతి రూపాయినీ ఖర్చు పెట్టకూడదు. రూపాయి దాస్తే లోభత్వం అవుతుంది. రూపాయి ఖర్చు పెడితే దుబారా అవుతుంది
🌹 ఏ వస్తువైనా మీరు కొనాలంటే దానిని మూడు సార్లు వాయిదా వేయండి. అప్పటికీ కొనాలనిపిస్తే అది మీకు అవసరమైన వస్తువు కనుక దానిపై ఖర్చు పెట్టండి. ఇలా వాయిదా వేయడం వలన ఏది అవసరమో ఏది అనవసరమో అన్న విషయం మీకు తెలుస్తుంది.
🌹 కనుక ధనాన్ని ఖర్చు పెట్టడంలోనూ, పొదుపు చేయటంలోనూ మధ్యస్తంగా ఉండాలి. కాబట్టి మన లోభత్వం "మధ్యస్తంగా" ఉండాలి .
బుద్ధ భగవానుడు చెప్పిన మధ్యే మార్గం మనకు ఎంతో గొప్ప మార్గం.
ఈ లోభత్వం వదిలించుకోవాలంటే ఒకటే మార్గం "దాతృత్వం"అలవాటు చేసుకోవాలి

Source - Whatsapp Message

No comments:

Post a Comment