Wednesday, September 23, 2020

ఎన్నటికీ వీడనిది ఋణానుబంధం..

ఎన్నటికీ వీడనిది ఋణానుబంధం.. "పువ్వు తొడిమనుండి విడిపోతుంది, పండు చెట్టునుండి రాలిపోతుంది, కానీ ఎన్ని కష్టాలు ఎదురైనా తల్లిదండ్రులు మాత్రం తమ పిల్లలను విడిచిపెట్టరు’ అని మహాభారతం చెబుతోంది.శరీరం తాను స్పృశించిన ప్రతిదానితోను ఒక రకమైన స్మృతిని పెంపొందించుకుంటుంది.
ఈ విషయం చదివేముందు ఒక్కమాట !
ఒక తండ్రి 70 సంవత్సరాల వయస్సు వచ్చిన తరువాత చనిపోయినప్పుడు పెద్దకొడుకు వయస్సు 40, రెండవ కొడుకు వయస్సు 37, మూడవ కొడుకు వయస్సు 33, నాలుగవ కొడుకు వయస్సు 30. సంవత్సరాలు అయితే…
అంటే పెద్ద కొడుకుతో 40 ఏళ్ళు ఉంటే, చివరి నాలుగవ కొడుకుతో 30 ఏళ్ళు మాత్రమే వున్నాడు. ఎందుకు ?
మీ అనుభవంలో… ఒక సంతానం ఏదైనా కోరితే డబ్బులు లేకున్నా అప్పుచేసి వారి కోరిక నెరవేరుస్తాము, కానీ మరో సంతానం ఏదైనా కోరితే చేతిలో డబ్బులున్నా వాడి కోరిక తీర్చాలనిపించదు ఎందుకని ?
అలాగే కొంతమంది విషయంలో ఎక్కువ ప్రేమ చూపిస్తాం ఎందుకని ?
ఈ జగత్తులో ప్రతిదీ కాలంతో పాటు వచ్చి కాలంతో పాటు చెల్లిపోతాయి. వచ్చి వెళ్ళేది కనకనే జగత్తు అన్నారు. జాయతే గఛ్ఛతే ఇతి జగం. రావడమూ మన చేతిలో లేదు, పోవడం అంతకంటే మన చేతిలో లేదు. కాని మానవులు ఉండే కొద్దికాలం లో నూ సర్వమూ ’నేను చేశాను’ అని అహంకరిస్తూనే ఉన్నాడు, నాతో సహా, ఎవరెన్ని చెప్పినా, అవన్నీ శ్మశాన వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యాలే అయిపోతున్నాయి. కాలం తో ఋణానుబంధం తీరిపోతూ ఉంటుంది, ముఖ్యం గా వీటిని చెప్పేరు. ఋణానుబంధ రూపేణా పశుపత్ని సుతాలయాః, పశువులు, భార్య/భర్త, బిడ్డలు,ఇల్లు. వీటితో ఉండే అనుబంధం కాలంతో పాటు చెల్లిపోతుంది. మరోలా కూడా చెప్పుకోవచ్చేమో! మానవులంతా ఈషణ త్రయం చుట్టూ తిరుగుతూ ఉంటారు, కాని అదేం లేదని బుకాయిస్తుంటారు. ఈ ఈషణాలేంటీ? దారేషణ,ధనేషణ, పుత్రేషణ అన్నారు. దారేషణ భార్య/భర్త కోసం పాకులాట, ధనేషణ సొమ్ము సంపాదనకోసం పాకులాట, పుత్రేషణ కొడుకుల గురించిన పాకులాట. జీవితంలో వీటిని వదలిపెట్టడం చాలా కష్టమనీ చెప్పేరు.
మనకు పూర్వ జన్మ కర్మల వలననే ఈ జన్మలో…
తల్లి, తండ్రి, అన్న, అక్క, భార్య, భర్త, సోదరులు, పిల్లలు, భందువులు,
ప్రేమికుడు, ప్రియురాలు, మిత్రులు,
శత్రువులు మిగతా సంబంధాలు… ఈ ప్రపంచంలో మనకు లభిస్తాయి.
ఎందు కంటే మనం వీళ్లకు… ఈ జన్మలో… ఏదో ఒకటి ఇవ్వవలసి, లేదా తీసుకొనవలసి రావచ్చును.
మనకు సంతాన రూపంలో ఎవరెవరు వస్తారు.
మనకు… పూర్వజన్మలో సంబంధంవున్న వాళ్ళే ఈ జన్మలో సంతాన రూపంలో జన్మిస్తారు. వాటినే మన శాస్త్రాల ప్రకారం నాలుగు రకాలుగా వున్నట్లు చెబుతారు…
ఋణాను బంధం:-
గత జన్మలో మనం ఎవరి వద్దనైనా రుణం తీసుకుని వుండచ్చు లేదా ఎవరో ఒకరి ధనాన్ని నష్టపరచి వుండొచ్చు.
అటువంటి వాళ్ళు మీకు సంతాన రూపంలో జన్మించి లేదా ఏదైనా వ్యాధి రూపంలో వచ్చి మీవద్ద వున్న పూర్తి ధనం ఖర్చు అయ్యే వరకూ, ఆ పాత ఖర్చులు సరి సమానం అయ్యే వరకు మనతోనే వుంటారు.
శత్రువులు – పుత్రులు:-
మన పూర్వ జన్మలో శత్రువులు మనపై వారు తమ తమ కక్షను తీర్చుకోవటానికి మన ఇంట్లో సంతాన రూపంలో తిరిగి పుడతారు.
అలా పుట్టి తల్లి దండ్రులతో పెద్దయ్యాక కొట్లాటలు, నానా గొడవలూ చేస్తారు.
జీవితమంతా ఏదో ఒక విషయంలో ఏడిపిస్తూనే వుంటారు.
ఎల్లప్పుడును తల్లితండ్రులను నానా యాతన పెడుతూ వాళ్ళ పరువుతీసి వాళ్ళను దుఃఖితులను చేస్తూ… ఆనంద పడు తుంటారు.

తటస్థ పుత్రులు :-
వీళ్ళు ఒకవైపు తల్లి తండ్రులకు సేవ చెయ్యరు… మరోవైపు సుఃఖంగా కూడా వుంచరు, వాళ్ళను వాళ్ళ మానానికి వాళ్ళను వదిలేసి వెళ్తారు. వాళ్ళ వివాహానంతరం తల్లి దండ్రులకు దూరంగా జరిగిపోతారు.
సేవా తత్పరతవున్న పుత్రులు
:-
గతజన్మలో మీరు ఎవరికైనా బాగా సేవచేసి వుండవచ్చును, ఆ రుణాన్ని తీర్చు కోవటానికి మీకు కొడుకు లేదా, కూతురు రూపంలో ఈ జన్మలో వస్తారు. అలా వచ్చి బాగా సేవను చేస్తారు.
మీరు గతంలో ఏది చేసుకున్నారో ఇప్పుడు అదే సంప్రాప్తిస్తుంది.
మీరు గత జన్మలో ఎవరి కైనా సేవ చేస్తే, ఈ జన్మలో మన ముదుసలి తనంలో మనకు సేవ చేస్తారు.
లేకపోతే మనకు వృద్ధాప్యంలో గుక్కెడు నీళ్ళు పోసేవారు కూడా మన వద్ద వుండరు.
ఇది పూర్తిగా మనుష్యులకు మాత్రమే అమలు అవుతుంది. అని అనుకోవద్దు.
ఈ క్రింద చెప్పిన ప్రకారం ఎలాంటి విధంగానైనా పుట్ట వచ్చును.
ఒక వేళ మీరు ఒక ఆవుకి నిస్వార్థమైన సేవ చేసి వుండవచ్చును. వాళ్ళే మీ కొడుకు లేదా, కూతురుగా మీ ఇంట పుట్ట వచ్చును.
ఒక ఆవుకి తన దూడను సమంగా పాలు తాగనియ్య కుండా దూరంగా వుంచిన పాపానికి వాళ్ళే కొడుకు లేదా, కూతురుగా మీ ఇంట పుడతారు.
లేదా మీరు ఏదైనా నిరపరాధి జీవిని సతాయించారనుకో, వాళ్ళు మీకు శత్రువు రూపంలో పుట్టి మీతో తన గత శత్రుత్వం యొక్క కక్ష తీర్చు కుంటారు.
అందుకనే జీవితంలో ఎవరికీ కూడా కీడు, చెడు చెయ్య వద్దు.
ఎందు కనగా ప్రకృతి నియమం ప్రకారం మీరు ఏది చేస్తే… దానికి ఈ జన్మలో లేదా వచ్చే జన్మలో నూటికి నూరు శాతం అనుభవంలోకి తెస్తుంది.
మీరు ఒక వేళ ఎవరికైనా ఒక్క రూపాయి దానంచేస్తే అది మీ ఖాతాలో నూరు రూపాయలుగా జమ చెయ్యబడతాయి.
ఒక వేళ మీరు ఎవరి వద్దయినా ఒక్క రూపాయి లాక్కుంటే మీ ఖాతా నుంచి నూరు రూపాయలు తీసివేయ బడతాయి.
అనగా పాపపుణ్యాలు
కొద్దిగా ఆలోచించండి మీరు మీతో కూడా ఎంత ధనాన్ని తెచ్చు కున్నారు. మళ్ళీ ఎంత ధనాన్ని మీ వెంట తీసుకెళ్తారు..? ఇప్పటి వరకు పోయిన వాళ్ళు ఎంత బంగారం, వెండి పట్టుకు పోయారు..?
చివరగా ఒకమాట !
తాతగారు సంపాదించిన ఆస్తినంతా తగిలేసి మాకు ఏమి మిగల్చలేదని ఒక కొడుకు బాధపడతాడు. దానికి కారణం అతనికి తాత తండ్రుల ఆస్తిపాస్తులు అనుభవించే యోగం లేదన్నమాట !
అతి బీద కుటుంబంలో పుట్టిన మరో తండ్రి కోట్లాది రూపాయలు సంపాదించి సంతానానికి మిగిల్చి చనిపోతాడు. దీనికి కారణం ఆ తండ్రి, తన కొడుకుకు చెల్లించాల్సిన అప్పన్నమాట !
మీ జీవితంలోని సంఘటనలను ఒకసారి బేరీజు వేసుకొని ఆలోచించండి.
నేను,
నాది,
నీది అన్నది.
అంతా ఇక్కడి కిక్కడే పనికి రాకుండా పోతుంది.
ఏది కూడా వెంట రాదు. ఒకవేళ మీ వెంట వస్తే గిస్తే మీ పుణ్య పాపఫలం వెంటవస్తుంది.
జీవితమన్నా, సంసారమన్న ఏదైనా అనండి అంత ఋణానుబంధం.
ఋణానుబంధం ఎంత బలంగా ఉంటుంద౦టే..బాగా కలిగిన ఒక ఆసామీ, కావలసినవారింటి ఎదురుగా ఉన్న ఇంట్లో ఉంటారు. నాకంటే వయసులో నాలుగేళ్ళు పెద్దవాడయి ఉండచ్చు. మాకు భోజనాలు పెడుతూ ఆ ఇంటి కోడలు భోజనం ఒక కంచంలో పెట్టి పట్టుకెళ్ళి ఆయనకి పెట్టి వచ్చింది. పూర్తిగా భోజనం చేసేదాకా ఉండలేకపోయావా అమ్మా అన్నా! ఉండద్దంటారు, ఏమైనా కావాలంటే పిలుస్తారు, అందుకే అన్నీ కావలసినవాటికంటే ఎక్కువ పెడతానని చెప్పింది. ఆయనకు పది సంవత్సరాల కితం భార్య గతించింది, ఆ తరవాత కావలసినవారబ్బాయిని పెంచుకున్నారు, అతనో ఉద్యోగి, ఈయనను తన దగ్గరికి రమ్మంటాడు, ఈయన కదలి వెళ్ళడు, అలా పాడు పడినట్టున్న ఇంటిలో ఒక్కడు కూచుని కాగితాలు చూసుకుంటూ ఉంటాడు. అవేంటని ఆ ఇంటి కోడల్ని అడిగితే రావలసిన బాకీల తాలూకు నోట్లు, వడ్డీలు కట్టుకుంటూ ఉంటారు, ప్రజలు ఆయన దగ్గర సొమ్ము వడ్డీకి పట్టుకెళుతుంటారు. అదీ ఆయన చరిత్ర టూకీగా, ఆ ఇంటి కోడలు మాత్రం గత పది సంవత్సరాలుగా ఆయనకు వండి పెడుతూనే ఉంది, ఆయన భోజనానికి ఇబ్బంది పడతారని పుట్టింటికి కూడా వెళ్ళదట.. ఇది ఏ ఋణానుబంధమో తెలియదు. ఈషణ త్రయాలు ఆయనను చాలా బంధించినట్టే అనిపించింది. భార్య గతించింది, ఒకటి పోయింది, పుత్రేషణ పూర్తయింది, ఈ ధనేషణ మాత్రం ఆయనను వదలలేదనుకుంటా. చిత్రమైన జీవితాలు.
ఋణానుబంధంలో ఆయనకు భార్య గతించింది ఆ ఋణం తీరినట్లుంది, ఇక సుత, ఆలయాల (ఇంటి) ఋణం తీరినట్టులేదు.తృష్ణ మాత్రం మిగిలివుండిపోయింది, ధనం మీద మోజుపోలేదు.
వలిభిర్ముఖమాక్రాన్తం పలితైరంకితం శిరః
గాత్రాణి శిధిలాయన్తే తృష్ణ తరుణాయతే. భర్తృహరి

కరచరణాద్యవయవముల
భరముడిగెవ వళులు మొగముపై నిండారె
శిరసెల్ల వెల్లవారెను
దరిమాలిన తృష్ణయొకడె తరుణతబూనెన్. లక్ష్మణ కవి.
కాళ్ళు చేతులు మొదలైన అవయవాలన్నీ శక్తి కోల్పోయాయి,ముఖం మీద ముడుతలు పడ్డాయి, తల నెరిసింది ఇలా అన్నీ వార్ధక్యాన్నే సూచిస్తున్నాయి కాని తృష్ణ అనగా ఆశ మాత్రం ఇంకా యవ్వనంలోనే ఉంది.
మన పెద్దలు పిల్లల నుంచి సొమ్ము చేతితో తీసుకోవద్దంటారు, దీనికో కారణమూ చెబుతారు. పిల్లలు మనకు ఋణ గ్రస్తులట, ఏ జన్మలోనో వారు చేసిన బాకీ తీర్చుకోడానికి మన కడుపున పుడతారంటారు, వారి దగ్గర నుంచి సొమ్ము తీసుకుంటే ఋణ విముక్తి కావచ్చేమోనని భయం. ఈ అమ్మాయి ఏ ప్రలోభమూ లేకనే ఆయనకు సేవ చేస్తూ వస్తూవుంది, గత పది సంవత్సరాలుగా, ఇది ఏమి ఋణానుబంధమో! పోనీ వారికి ఏమైనా బంధుత్వం ఉన్నదా అంటే అదీ లేదు. ఇల్లు, భార్య, పిల్లలు, సంపద, ఆఖరుకి స్నేహితులు, హితులు,ఈ రాతలు, పలకరింపులు సర్వం ఋణానుబంధమే, అది చెల్లిపోతే……. అంతా మిధ్య. దర్పణ దృశ్య మాన నగరీ, జీవితమంతా చిత్రమే.
ఈ రోజుతో ఈ ఋణానుబంధం తీరునట్టే……
ఒక వ్యక్తి 84 ఏళ్ళు జీవిస్తే, యోగ యోగశాస్త్ర పరంగా దానిని పూర్తి జీవితంగా భావిస్తాము. ఈ జీవిత కాలంలో, 1008 చంద్ర భ్రమణాలు (పౌర్ణములు,moon cycles) ఉంటాయి. ఆ 84 ఏళ్ల మొదటి నాలుగో భాగంలో, అంటే మొదటి 21 ఏళ్లలో, శక్తి పరంగా తల్లిదండ్రుల కర్మ ప్రభావం పిల్లల మీద ఉంటుంది, ఆ తర్వాత మనం తల్లి తండ్రులచే ప్రభావితం కాకూడదు. ఆ తర్వాత వారు మనకు చేసిన వాటన్నిటికీ, మనం కృతజ్ఞతా పూర్వకంగా ఉండాలి. ఎందుకంటే మనల్ని ఈ ప్రపంచంలోకి వారే తీసుకు వచ్చారు. ఇంకా ప్రేమ, ఆదరణలతో వాళ్లు మనకు ఎన్నో చేశారు.
ఎవరైనా తల్లిదండ్రుల చేత 21 ఏళ్ల తర్వాత ప్రభావితం కాకూడదు. ఎందుకంటే పిల్లలు తమ జీవితాన్ని నూతనంగా తయారు చేసుకోవాలి, అంతేగాని ముందు తరం చేసినదానికి ఒక నకలు కాకూడదు. ప్రతి ఒక్కరి మీద ఇరవై ఒక్క ఏళ్లు వచ్చేదాకా తల్లిదండ్రుల కార్మిక ప్రభావం ఉంటుంది, కానీ ఆ తరువాత అటువంటిదేమీ ఉండదు. చాలామంది తమ తల్లిదండ్రుల మీద ఆర్థికంగా, సంఘపరంగా, మానసికంగా ఇంకా ఆధారపడి ఉండవచ్చు, కానీ 21 ఏళ్ల తర్వాత తల్లిదండ్రుల పోషణ మీద ఆధారపడి ఉండకూడదు ఆ తర్వాత అది ఒక సంబంధం ఉంటుంది. ప్రేమ కృతజ్ఞత, ద్వారా ఒక సంబంధం ఉంటుంది. అవి మాత్రం ఎప్పటికీ ఉండవచ్చు.
శ్రీకృష్ణుడు మధురకు వెళ్ళినప్పుడు ఆ ఎడబాటును సహించలేక తల్లి యశోద దుఃఖసాగరంలో మునిగిపోయింది. దుఃఖంతో కుమిలిపోతున్న యశోదను చూసి నందుడు కూడా ’కన్నయ్య లేకుండా మేము బ్రతకలేం’ అని కన్నీరుమున్నీరు కాసాగాడు. అలాగే శ్రీకృష్ణుడు కూడా తల్లిదండ్రులను వదిలి మధురకు వచ్చినప్పుడు అవ్యక్తావేదనతో యశోదమ్మను తలచుకుంటూ ఉద్ధవునితో, "ఉద్ధవా! నాకన్నయ్య భోజనం చేస్తే గానీ నేను పచ్చి మంచినీళ్ళైనా ముట్టను’ అని మొండి పట్టుదలతో కూర్చొనే నాతల్లి యశోదమ్మను నేను మరువలేకున్నాను" అని చెబుతూ కృష్ణుడు విలపించసాగాడు.
కంసుని చెరాలనుంచి దేవకీ వసుదేవులను విడిపించిన తరువాత బలరామకృష్ణులు వారికి పాదాభివందనాలు చేసి, వారి పట్ల కృతజ్ఞతాభావాన్ని ఇలా వ్యక్తపరిచారు:
మాకు నిన్నాళ్ళు లేదయ్యె మరియు వినుడు
నిఖిల పురుషార్థ హేతువై నెగడుచున్న
మేనికెవ్వార లాఢ్యులు మీరు కారె
యా ఋణము దీర్ప నూరేండ్లకైన జనదు (దశమస్కంధం - పోతన భాగవతం).
’అమ్మా! నాన్నా! మేము ఇన్నాళ్ళూ మీ ప్రేమ, ఆప్యాయతలను పొందే అదృష్టానికి నోచుకోలేదు. ధర్మార్థ కామ మోక్షాలనే పురుషార్థాలు సాధించడానికి అవసరమైన ఈ దేహాన్నిప్రసాదించిన వారు మీరు. అలాంటి దుర్లభమైన మానవదేహాన్ని ఇచ్చిన మీ ఋణం తీర్చడానికి మాకు నూరేళ్ళైనా సాధ్యం ాదు.’
బలరామకృష్ణులు పలికిన మాటల వల్ల తల్లితండ్రుల స్థానం ఎంతటి మహోన్నతమైనదో మనం అర్థం చేసుకోవచ్చు. నిరంతరం తల్లిదండ్రులు మన చెంత ఉండడం వల్ల వారి విలువ ఏమిటో మనం గుర్తించలేకపోతున్నాం. అందువల్ల వారిపట్ల నిర్లక్ష్య వైఖరినీ, నిర్దాక్షిణ్యాన్నీ చూపుతున్నాం. తల్లిదండ్రులే ఇలలో ప్రత్యక్షదైవాలనీ, వారి ఋణం ఎన్ని జన్మలైనా తీర్చలేనిదనీ నిరూపించిన వినాయకుడు, శ్రీకృష్ణుడి జీవితాలు మనకు ఆదర్శం కావాలి.

Source - Whatsapp Message

No comments:

Post a Comment