సుదీర్ఘ కాలం పాటు మదర్ తెరెసా గారి గురించి పరిశోధించి అరూప్ చటర్జీ గారు రాసిన గ్రంధం "మదర్ తెరెసా: దీ ఆన్ టోల్డ్ స్టోరీ (Mother Teresa: The Untold Story)". ఈ గ్రంథంలో మదర్ తెరేసా గారి గురించి ఎన్నో నమ్మలేని నిజాలు ఉన్నాయి. మదర్ తెరేసాకు సైంట్ హుడ్ ఇచ్చే ముందు సంబంధిత సంఘం సంప్రదించిన వారిలో అరూప్ చటర్జీ గారు కూడా ఒకరు. మదర్ తెరేసా గురించిన నిజాలను ప్రపంచానికి తెలియచేసిన వారిలో క్రిస్టోఫర్ హిచెన్స్ ఒకరు. తెరెసా మీద ఆయనకి చెందిన "Hells Angels" అనే డాక్యుమెంటరీ బాగా ప్రచారం అయ్యింది. దానికి ఆధారం కూడా అరూప్ చటర్జీ గారి పరిశోధనే.
ఆ పుస్తకం నేను పూర్తిగా చదివాను. అందులో ఉన్న కొన్ని ముఖ్యమైన విషయాలు మీకోసం. అవకాశం ఉన్న ప్రతీ ఒక్కరు ఈ పుస్తకం చదవండి
మదర్ తెరెసా: దీ ఆన్ టోల్డ్ స్టోరీ లోని ముఖ్యమైన అంశాలు
1. భోపాల్ లోని యూనియన్ కార్బైడ్ కర్మాగారంలో ప్రమాదం జరిగి దాదాపు 3500 చనిపోతే మదర్ తెరెసా ఏ సహాయమూ చేయకపోగా, అది కేవలం ప్రమాదం కనుక క్షమించమని అడిగింది
(Mother Teresa: An untold Story - Kindle Page Nbr 180)
https://www.google.com/amp/s/www.csmonitor.com/layout/set/amphtml/1984/1218/121829.html
2. మదర్ తెరేసా అబద్దాలు:
i. కోల్కతా లోని తమ కేంద్రంలో రోజూ ఎంత మందికి భోజనం పెడతారు అనే విషయమై ఆవిడ ఎన్నో అబద్దాలు చెప్పారు. కోల్కతాలో రోజూ భోజనం ఎంతమందికి పెడతారు?
A. 7000 - జూన్ 2 1979, డబ్లిన్, ఐర్లాండ్ లో ఇచ్చిన ఒక ప్రసంగంలో
B. 9000 - Loving Jesus: Mother తెరెసా అనే పుస్తక రచయితకు ఇచ్చిన సమాచారం
C. 10000 - Mother Teresa in my own words అనే పుస్తక రచయితకు ఇచ్చిన సమాచారం
నిజానికి అక్కడ రోజుకు కేవలం 100 - 200 మందికి మాత్రమే భోజనం పెడతారు.
(Mother Teresa: An untold Story - Kindle Page Nbr 311 / 321)
ii. కోల్కతా లోని మోతీజీల్ అనే మురికివాడలో 5000 మంది పిల్లలతో బడిని నడుపుతున్నాం అని తన గురించి Mother Teresa the early years అనే పుస్తకం రాసిన డేవిడ్ పోర్టర్ కి అలానే, Something Beautiful for God అనే పుస్తకం రాసిన మాల్కం మగ్గరిడ్జ్ కి చెప్పారు. నిజానికి అక్కడ 200 మంది కన్నా ఎక్కువ పిల్లలు ఉండరు.
(Mother Teresa: An untold Story - Kindle Page Nbr 344)
iii. కోల్కతా రోడ్ల మీద పడి ఉండే కొన్ని వేల మందిని తమ నుర్సులు తీసుకువస్తారని మదర్ తెరేసా పదే పదే చెప్తారు. నోబెల్ బహుమతి అందుకున్న సందర్భంలో తాము అలా దాదాపు 36000 మందిని తీసుకువచ్చామని చెప్పారు. కానీ Mother Teresa: An untold Story రచయిత అరూప్ చటర్జీ గారు అసలు వారు ఆ పనే చెయ్యరని, ఒకవేళ ఎవరైనా ఫోన్ చేసి చెప్పినా కార్పోరేషన్ వారికి చెప్పండి వాళ్లే తెస్తారు అని చెప్తారని, మదర్ తెరెసా సేవా సంస్థకు చెందిన వారితో ఇదే విషయమై నేను ఎన్నో మార్లు ఫోన్ లో మాట్లాడి వాటిని రికార్డ్ చేశానని తన పుస్తకంలో రాశారు
(Mother Teresa: An untold Story - Kindle Page Nbr 333/344/356/369/380)
iv. అడ్రె కాంస్టెంట్ అనే ఆవిడ చిన్న పిల్లల కోసం మదర్ తెరెసా గురించి ఒక పుస్తకం రాశారు. అందులో కోల్కతా నగరంలో కుష్టు వ్యాధిగ్రస్తులు కోకొల్లలుగా ఉంటారని, అక్కడ 122 కుష్టు ఆసుపత్రులు ఉన్నాయని రాసింది. నిజానికి కోల్కతాలో ఉన్నది ఒకే ఒక ఆసుపత్రి. ఈ పుస్తకానికి సంబంధించిన రాతప్రతిని మదర్ తెరెసా స్వయంగా పరిశీలించి మార్పులు చేర్పులూ చేశారు

3. మదర్ తెరెసా - మత మార్పిడి
i. మదర్ తెరెసా నిజానికి చేస్తోంది సేవ కాదు మత మార్పడి అని ఎవరైనా అంటే, క్రైస్తవులు మాత్రమే కాదు, చాలా మంది హిందువులు కూడా ఒప్పుకోరు. అయితే ఆ విషయం ఆవిడే స్వయంగా కొన్ని సందర్భాలలో చెప్పిన విషయం పాపం వీరికి తెలియదు
ఎడ్వర్డ్ లీ జోలీ అనే వ్యక్తి ఆవిడ గురించి పుస్తకం రాయాలి అనుకున్నప్పుడు స్వయంగా మదర్ తెరెసా ఎద్వేర్ లీ తో "నేను చేస్తున్న పని మీద చాలా అపోహలు ఉన్నాయి. వాటిని సరి చెయ్యాల్సిన అవసరం ఉంది. మేము నర్సులమో, వైద్యులమో, ఉపాధ్యాయులమో, సామాజ సేవకులమో కాదు, మేము దేవుని కార్యాన్ని చేసేవాళ్ళము మాత్రమే" అని చెప్పారు
(Mother Teresa: An untold Story - Kindle Page Nbr 615)
ii. మరొక సందర్భంలో ఆవిడే స్వయంగా ఒక్క సేవా కేంద్రంలోనే ఇప్పటికి 29000 మందిని మతం మార్చామని ఒప్పుకున్నారు. చనిపోడానికి సిద్దాంగా ఉన్నవారిని మతం మార్చుకుంటే మీ పాపాలు క్షమించబడతాయు, మీకు స్వర్గం లభిస్తుంది అని అడుగుతాము, ఇంతవరకూ ఎవ్వరూ వద్దు అనలేదు అని ఆవిడ స్వయంగా చెప్పారు. అంటే చావుకు సిద్ధంగా ఉన్నవాళ్ళని కూడా వీళ్ళు వదలరు (ఇది పుస్తకంలోది కాదు. ఇంతకుముందు వీడియో పోస్ట్ చేశాను)
4. మాల్కం మగ్గరిడ్జ్
ఇతను లేకపోతే మదర్ తెరెసా బహుశా ప్రపంచానికి తెలిసే వారు కాదు. ఇతను అమెరికా, బ్రిటన్ దేశాలలో మీడియా సంస్థల మీద మంచి పట్టు ఉన్న వ్యక్తి. మొదటి నుండి మదర్ తెరెసాకి మాధ్యమ రంగంలో ప్రచారం కల్పించింది ఇతనే. మదర్ తెరెసా చనిపోయిన తరువాత కాథలిక్ టైమ్స్ పత్రికలో కూడా ఈ విషయం రాశారు. ఇతనికి విపరీతమైన మత మౌఢ్యం ఉంది. ఒక సందర్భంలో లక్షల మంది యూదులను హిట్లర్ చంపడం సరైన చర్యే అన్నాడు
(Mother Teresa: An untold Story - Kindle Page Nbr 644)
5. మదర్ తెరెసాకు సంబంధించిన ఆసుపత్రులలో చికిత్స పొందే రోగులకు నొప్పి తగ్గించే ఔషధాలు ఇచ్చేవారు కాదు. పైగా నొప్పి మనిషిని దేవుడికి దగ్గర చేస్తుంది అని మదర్ తెరెసా అనేవారు. యేసు సిలువపై నెప్పిని అనుభవించాడు కనుక, మనిషి కూడా నెప్పిని అనుభవిస్తే ఏసుకు దగ్గర అవుతాడు అనేది ఆవిడ అభిప్రాయం. కానీ తనకి ఆరోగ్యం బాగోనప్పుడు మాత్రం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన విదేశీ ఆసుపత్రులలో చికిత్స పొందింది
(https://www.theglobeandmail.com/life/the-hot-button/mother-teresa-was-anything-but-a-saint-canadian-study-says/article9317551/)
6. మదర్ తెరెసా కోల్కతా అనాధ శరణాలయం - శిశు భవన్
ఇక్కడి సౌకర్యాలు చాలా దారుణంగా ఉంటాయి. అందరి పిల్లలకి ఒకే పళ్ళెంలో ఒకే చెంచాతో తినిపిస్తారు. పాల సీసాలు పరిస్థితి కూడా ఇదే. పిల్లలు మల, మూత్ర విసర్జన చేసినా సరిగ్గా శుభ్రం కూడా చెయ్యరు. అందరినీ ఒకే గుడ్డతో తుడిచేస్తారు. దానివలన అనేకమంది పిల్లలకు కురుపులు రావడం, పుడ్లు పడటం జరుగుతుంది. శుభ్రంగా ఉంచడం, వేరు వేరుగా తినిపించడం, అనారోగ్యంతో బాధ పడే పిల్లలను ఒకే వైపు కాకుండా అప్పుడప్పుడూ తిప్పి పడుకోబెట్టడం వంటి చిన్న చిన్న పనులు చేసినా వారు పడే బాధ ఎంతో తగ్గుతుంది. అక్కడకి సేవ చేయడానికి వచ్చిన వారు ఎవరైనా అలా చెయ్యాలి అని ప్రయత్నించినా అక్కడి నుర్సలు వాళ్ళని ఆ పనులు చెయ్యనివ్వరు. ఏమైనా అంటే దేవుని చిత్తం అదే అని సమాధానం చెప్తారు.
(Mother Teresa: An untold Story - Kindle Page Nbr 2763)
7. అంధురాలు మీను కథ
పీటర్ టేలర్ అనే ఒక బ్రిటిష్ దేశస్తుడు, మదర్ తెరెసా సేవా కేంద్రాలలో కొన్ని సవత్సరాల పాటు పని చేశాడు. ముంబై లోని ఆశాధన్ అనే అనాదాశ్రమంలో ఆయనకు అంధురాలైన మీను గురించి తెలిసింది. ఆ పాపకి కళ్ళు తెప్పించడం సాధ్యం అవుతుంది అని తెలుసుకున్న టేలర్ అందుకోసం ఇద్దరు బ్రిటీష్ వైద్యులను సాయం అడిగాడు. వారు ఉచితంగా చికిత్స చెయ్యడానికి ఒప్పుకున్నారు. వీసా, మీనూతో ఇంకో నర్స్ ని కూడా తీసుకువెళ్లాడానికి అవసరం అయ్యే అన్ని ఖర్చులూ తానే భరించడానికి సిద్ధం అయ్యాడు. ఇక మదర్ తెరెసా అనుమతే తరువాయి. కానీ దానికి మాత్రం ఎంతో సమయం తీసుకుంది మదర్ తెరెసా. ప్రతీ సారీ ఏవో కారణాలు చెప్పి, అనుమతి ఇచ్చే వారు కాదు. చాలా ప్రయత్నం తరువాత టేలర్ కు మదర్ తెరెసా అనుమతి ఇచ్చారు. టేలర్ గారు కూడా అన్ని ఏర్పాట్లూ చేసుకుని మీను తీసుకువెళ్లాడానికి ముంబై వస్తే చివరి నిమిషంలో మదర్ తెరెసా మనసు మార్చుకున్నారు అని చెప్పి ఆ పాపని పంపడానికి నిరాకరించారు
(Mother Teresa: An untold Story - Kindle Page Nbr 2807)
8. స్కై న్యూస్ అనే ఒక బ్రిటిష్ ఛానల్ లో మదర్ తెరెసాకు చెందిన అనాదాశ్రమాలలో ఉండే ఘోరమైన పరిస్థితులను గూర్చి పదే పదే చూపారు. ఆ ఛానల్ కు చెందిన డోనల్ మేకిన్టైర్ అనే విలేకరి కోల్కతా లోని దయాధన్ అనే ఆనాదాశ్రమంలోకి రహస్య కెమెరతో ప్రవేశించి అక్కడ జరిగే విషయాలను ఫోటోలు తీశాడు. వాటిని తమ ఛానల్ లో ఆగస్ట్ 1, 2005 న ప్రసారం చేశారు.
ఆహారం పెట్టె సమయంలో చేతులు కట్టివేయబడ్డ పిల్లల, రాత్రంతా మంచాలకు కట్టివేయబడ్డ పిల్లల, మాల విసర్జన చేసిన తరువాత చాలా సేపటి వరకూ శుభ్రం చెయ్యకుండా వదిలివేసిన పిల్లల, ఏ మాత్రం శుభ్రం పాటించని నుర్సుల ఫోటోలను ఆ విలేకరి తీసి వాటిని స్కై న్యూస్ లో ప్రసారం చేశారు
(Mother Teresa: An untold Story - Kindle Page Nbr 2831)
9. కోల్కతా అనాదాశ్రమంలో వాడిన పాలపొడి
మిగిలిన ప్రదేశాలలో ఉన్న అనాదాశ్రమాల సంగతి తెలియదు కానీ, కోల్కతాలో మాత్రం పిల్లలకి "మోనిడైన్" అనే పాలపొడి వాడేవారు. కొన్నిసార్లు కేవలం దీనిని మాత్రమే వాడే వారు, మరికొన్ని సార్లు లాక్టోజెన్ వంటి ఇతర పాలపొడులతో కలిపి వాడేవారు. ఈ మోనిడైన్ ని ప్రత్యేకంగా వీళ్లకోసమే తయారు చేసి పంపేవారు. దీని వలన అనేక సమస్యలు ఉంటాయి
A. రెండు రకాల పాలపొడులను కలిపి వాడకూడదు
B. ఈ మోనిడైన్ లో పిల్లల పెరుగుదలకు కావాల్సిన మోతాదులో కొవ్వుపదార్ధాలు, విటమిన్లు ఉండవు. మిగిలిన వాటిల్లో 22 - 23 శాతం కొవ్వు పదార్ధాలు ఉంటే ఈ మోనిడైన్ లో కెవకం 7.25% మాత్రమే ఉంటుంది.
C. అలానే పిల్లలకు వాడే సాధారణ పాలపొడిలో కూడా 12 రకాల విటమిన్లు ఉంటే మోనిడైన్ లో 4 మాత్రమే ఉంటాయి. లాక్టోజెన్ లో 20 రకాల విటమిన్లు ఉంటాయి. పిల్లలకు తప్పక అవసరం అయిన K, B12, C, D విటమిన్లు ఇందులో ఉండవు.
D. పిల్లలకు అత్యవసరం అయిన ఫోలిక్ ఆసిడ్ కూడా మోనిడైన్ లో ఉండదు
E. పిండి పదార్థం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అందువలన పిల్లలకు విరేచనాలు కావు. అక్కడ ఉండే అపరిశుభ్రత వలన విరేచనాలు ఎక్కువగా అయ్యే అవకాశం ఉండటం వలన ఆరోగ్యకరం కాకపోయినా ఇలా పిండి పదార్థం ఎక్కువ ఉండే పాలపొడిని బహుశా వాడేవారు
(Mother Teresa: An untold Story - Kindle Page Nbr 2873/2883)
10. శ్రీలంక, వియత్నాం అలానే ఐర్లాండ్ లలో ఆవిడ ఆశ్రమాల వలన అక్కడ మత ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి అని అక్కడి ప్రభుత్వాలు తెరెసా ఆశ్రమాలను మూసివేయించాయి. భూటాన్ ప్రభుతం అసలు అనుమతే ఇవ్వలేదు
(Mother Teresa: An untold Story - Kindle Page Nbr 2956)
11. అమెరికా చరిత్రలోనే అతిపెద్ద ఆర్ధిక నెరగాడైన చార్లెస్ కీటింగ్ తో తెరేసా సంబంధాలు.
1992 నాటికి ఇతనే అమెరికాలో అతిపెద్ద ఆర్ధిక నేరగాడు. ఎందరో ప్రజలను మోసం చేసి ఇతను అప్పట్లోనే 25.3 కోట్ల డాలర్లు అంటే అప్పటి మారకం విలువ ప్రకారం సుమారు 660 కోట్ల రోపాయాలను దోచుకున్నాడు. ఇతను అధికారికంగానే తెరేసాకు 12.5 లక్షల డాలర్లు అంటే 3 కోట్ల 25 లక్షల రూపాయలు ఇచ్చాడు. నిజానికి ఇంకా చాలా ఎక్కువ ఇచ్చాడు అని విమర్శకుల అంచనా.
ఇలా ఎందరో పేదల డబ్బులు దోచుకుని, వాళ్ళ జీవితాల్ని రోడ్ల పాలుచేసిన ఈ నెరగాడిని రక్షించడానికి తెరేసా ప్రయత్నం చేసింది. న్యాయస్థానంలో అతని కేసు చూస్తున్న న్యాయమూర్తికి, అతను ఏ నేరం చేశాడో, చెయ్యలేదో నాకు తెలియదు. కానీ అతను చాలా మంచివాడు, పేదలకు ఎంతో సహాయం చేశాడు అంటూ లేఖ రాసింది. దానికి పట్టించుకోకుండా ఆ న్యాయమూర్తి ఛార్లెస్ కీటింగ్ కి కఠిన కారాగార శిక్ష విధించాడు.
దీని తరువాత ఈ కేసుకు సంబంధించిన మరొక న్యాయమూర్తి తెరేసాకు జవాబు ఉత్తరం రాశాడు. మీకు డబ్బులు ఇచ్చిన వ్యక్తి ఎందరో పేదలను దోచుకుని, ఆ డబ్బు తెచ్చి మీకు ఇచ్చాడు. యేసే కనుక మీ స్థానంలో ఉంటే అటువంటి అక్రమ సంపాదనని ఉంచుకోడు, తిరిగి ఇచ్చేస్తాడు, కనుక మీరు కూడా తిరిగి ఇచ్చెయ్యండి. కీటింగ్ వలన మోసపోయిన వారి వివరాలు నేను ఇస్తాను, మీరు వాళ్లకు ఆ డబ్బు తిరిగి ఇచ్చెయ్యవచ్చు అని రాశాడు. ఈ లేఖ రాసి దాదాపు 30 సం. లు అవుతోంది. ఇప్పటికీ ఆయనకు జవాబు అందలేదు
కీటింగ్ మాత్రమే కాదు మరెందరో నేరగాళ్లు తాము దోచుకున్న సొమ్ము తెరెసాకు ఇచ్చేవారు. బహుశా వారు దానిని ప్రాయచిత్తంగా చూసేవారేమో?
(Mother Teresa: An untold Story - Kindle Page Nbr 3391/3402)
12. ఆ బ్యాంక్ మీద ఎన్ని ఆరోపణలు వచ్చినా మదర్ తెరేసా తమ డబ్బు వాటికన్ బ్యాంక్ లోనే నిలువ చేసేవారు. ప్రపంచ మాఫియా శక్తులతో ఆ బ్యాంక్ కు గల సంబంధాలు బయటపడ్డ తరువాత ప్రపంచంలో ఎన్నో ఇతర కాథలిక్ సేవ సంస్థలు వాటికన్ బ్యాంక్ నుండి తమ ఖాతాలను తరలించాయి. తెరేసా మాత్రం అలా చెయ్యలేదు
పైగా తెరెసా సంస్థకు చెందిన ఆర్ధిక లావాదేవీలన్నీ రహస్యాలే. ఎన్నో ఆరోపణలు వచ్చినా, ఎందరు పరిశోధకులు వివరాలు అడిగినా ఎప్పుడూ వివరాలు బయటపెట్టలేదు. తెరేసా మీద సుమారు రెండు దశాబ్దాల పాటు పరిశోధనలు చేసి Mother Teresa: An Untold Story పుస్తకం రాసిన అరూప్ చటర్జీ గారు ఎంత ప్రయత్నించినా ఆర్ధిక లావాదేవీలకు సంబంధించిన వివరాలు రహాస్యంగానే ఉంచారు.
నిజానికి భారతీయ చట్టాల ప్రకారం సేవా సంస్థలకు సంబంధించిన ఖాతాలను పరిశీలించే హక్కు ఎవరికైనా ఉంటుంది. అది తెలిసిన చటర్జీ గారు తెరెసా సేవా సంస్థ ఆర్ధిక లావాదేవీల వివరాలు తెలుసుకోవడానికి కోల్కతా లోని సంబంధిత ప్రభుత్వ కార్యాలయానికి, 2001లో అంటే తెరేసా చనిపోయిన తరువాత వెళ్లారు. చట్టప్రకారం ఆ వివరాలు ఈయనకు ఇవ్వాల్సి ఉన్నా, అప్పటి రిజిస్ట్రార్ "అతనూ సషాన్ ముఖర్జీ" గారు అప్పటి మిషనరీస్ ఆఫ్ చారిటీస్ అధిపతి సిస్టర్ నిర్మల అనుమతి లేనిదే ఇవ్వను అని చెప్పారు. ఊహించినట్లుగానే సిస్టర్ నిర్మల అనుమతి నిరాకరించారు. అంతే కాక, 1992 లో ఎవరో విలేకరి తమ ఖాతా వివరాలను ఆ కార్యాలయం నుండి పొంది, వాటిని పత్రికలో ప్రచురించారని, అది తెలిసి అగ్గిమీద గుగ్గిలం అయిన తెరేసా తానే స్వయంగా కార్యాలయానికి వచ్చి అప్పటి అధికారితో కోపంగా మాట్లాడారని, దాని తరువాత వెంటనే ఆ అధికారికి ఫోన్ రావడం తెరేసా సంస్థ ఖాతా వివరాలను రహస్యంగా ఉంచడం వెంట వెంటనే జరిగిపోయాయి అని కూడా ఆరోజు అరూప్ చటర్జీ గారు తెలుకున్నారు. నిజంగా సేవ చేసే ఒక సంస్థకు చెందిన ఆర్ధిక లావాదేవీల విషయంలో ఇంత రహస్యం ఎందుకు?
(Mother Teresa: An untold Story - Kindle Page Nbr 3328)
13. ఇందిరా గాంధీ గారు విధించిన అత్యవసర పరిస్థితి, భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో మాయని మచ్చ. మదర్ తెరెసా దానిని కూడా సమర్ధించింది. పైగా అత్యవసర పరిస్థితే బాగుందని, ప్రజలకు పనులు దొరుకుతున్నాయని, ఎవ్వరూ స్ట్రైకులు బందులు వంటివి చెయ్యడం లేదని అన్నారు
(Mother Teresa: An untold Story - Kindle Page Nbr 3921)
14. పిల్లలని బొమ్మలతో ఆడుకొనివ్వడం కూడా తెరేసా చనిపోయిన తరువాతే అనుమతించడం మొదలెట్టారు. అంతకుముందు పాడై పోతాయి అని పిల్లలకు బొమ్మలు కూడా ఇచ్చేవారు కాదు. ఈ బొమ్మలు కూడా వాళ్ళు కొన్నవి కావు, దాతలు ఇచ్చినవి
(Mother Teresa: An untold Story - Kindle Page Nbr 6887)
15. ఎన్నో ఇతర సేవా సంస్థలలా మిషనరీస్ ఆఫ్ చారిటీస్ (తెరెసా సేవా సంస్థ పేరు) వారు, ఇళ్లు లేని వారి కోసం ఇళ్ళు కట్టించడం వంటివి చెయ్యరు. అయితే 1990లలో ఒక్క సారి మాత్రం కోల్కతా నగర శివార్లలో, ప్రభుత్వం వద్ద ఉచితంగా పొందిన భూమిలో 48 ఇళ్ళు నిర్మించి పేదలకు దానం చేశారు. అయితే ఆ 48లో 45 ఇళ్లు క్రైస్తవులకూ అదీ కాథలిక్లకు ఇచ్చారు. ఇది యాదృచ్చికం అవ్వడానికి అవకాశం లేదు. కావాలనే ఏరి కోరి కాథలిక్ లకు ఆ ఇళ్ళు ఇచ్చారు అనుకోవచ్చు.
(Mother Teresa: An untold Story - Kindle Page Nbr 4056)
16. సేవా కార్యక్రామాల పరంగా చూసుకున్నా తెరేసా గారు చేసిన దానికి ఎన్నో రెట్లు సేవ చేస్తున్న సంస్థలు మన దేశంలో ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకు రామకృష్ణ మఠం వారు దేశ వ్యాప్తంగా వేల సంఖ్యలో విద్యా సంస్థలు నడుపుతున్నారు. వాటిల్లో లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. అలానే వారికి దేశ వ్యాప్తంగా ఎన్నో ఆసుపత్రులు కూడా ఉన్నాయి. ఇక కుష్టు వ్యాధుల వారి సేవ విషయానికి వస్తే, బాబా ఆమ్టే గారు ఎంతో సేవ చేశారు. ఇప్పుడు ఆ బాధ్యతను ఆయన పిల్లలు తీసుకున్నారు. బాబా ఆమ్టే గారికి చెందిన ఒక్క ఆశ్రమంలోనే 5000 మంది కుష్ఠురోగులకు వసతి, వైద్యం ఏర్పాటు చేశారు. ఇటువంటివి మరిన్ని ఉన్నాయి. ఇక ఇస్కాన్ వారు కూడా ఎంతో సేవ చేస్తున్నారు. వారు ప్రతీ రోజూ దేశ వ్యాప్తంగా 12 లక్షల మంది చిన్న పిల్లలకు నాణ్యమైన, సుచి, రుచితో కూడిన చక్కని భోజనం పెడుతున్నారు. ఇవి కాక శ్రీశ్రీ రవి శంకర్ గారి ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ, సద్గురు గారి ఇషా ఫౌండేషన్, సత్య సాయి బాబా గారి సేవా సంస్థలు, టీటీడీ వంటి దేవాలయ అనుబంధ సేవా సంస్థలు, మాతా అమృతానందమయి ఇంకా ఎన్నో ఎన్నెన్నో.
మరి వీరెవ్వరికీ ఇవ్వని ఈ విపరీత జాతీయ అంతర్జాతీయ మీడియా ప్రచారం తెరేసాకే ఎందుకు అనేది కూడా ఆలోచించాలి
https://belurmath.org/education-services/
17. తెరేసా ఆశ్రమాలలో ఉండేవారందరూ కేవలం కాథలిక్ క్రైస్తవ ప్రార్థనలు మాత్రమే చెయ్యాలి. ఇతర మతాలకు సంబంధించిన ఏ కార్యక్రమాలు అక్కడ జరగడానికి అనుమతి ఇవ్వరు
(Mother Teresa: An untold Story - Kindle Page Nbr 5745)
18. మదర్ తెరెసా సెయింట్ తెరెసాగా ఎలా మారింది?
కాథలిక్ మతానికి సంబంధించిన కొందరికి వారు చనిపోయిన తరువాత సెయింట్ హోదా ఇస్తారు. ఆ హోదా ఇవ్వాలి అంటే వారు వారి జీవితకాలంలో రెండు అద్భుతాలు (మిరకిల్స్) చేసి ఉండాలి. తెరెసా గారు చేశారు అని చెప్తున్న రెండు అద్భుతాల గురించి ఇప్పుడు చూద్దాం
A. మోనికా బెస్రా: ఈమె కోల్కతా నుండి 500 కి.మీ దూరంలో ఉండే ఇక మారుమూల పల్లెకు చెందిన ఒక గిరిజన స్త్రీ. ఈవిడకు గర్భాశయంలో పెద్ద పుండు పడితే, తెరెసా గారు చనిపోయిన సంవత్సరం తరువాత, తెరెసా గారికి చెందిన ఒక రాతిండి పతాకాన్ని (అల్యూమినియం మెడల్) మిషమరీస్ ఆఫ్ చారిటీస్ కు చెందిన ఇద్దరు నుర్సులు మోనికా బెస్రాగారి పొట్టకు కట్టి ఒక రాత్రంతా ప్రార్ధన చెయ్యగా ఉదయానికల్లా బెస్రా గారికి పూర్తిగా నయం అయిపోయింది అని మిషనరీస్ ఆఫ్ చారిటీస్ వారు, కాథలిక్ చర్చి వారు నిర్ధారణ చేశారు. ఇది తెరేసా గారి వలన జరిగిన మొదటి అద్భుతం.
అయితే ఈ ప్రచారం మొదలైన కొంత కాలానికే ఇది అబద్దం అని నిరూపితం అయ్యింది. అప్పటి పశ్చిమ బంగ రాష్ట్ర వైద్య శాఖా మంత్రి "పార్దా డే" గారు, ఇది అబద్దం అని, బెస్రా గారిని చాలా కాలం చికిత్స జరిగిన తరువాత మాత్రమే ఆమె వ్యాధి నయం అయ్యింది అని, వారు చెప్పేది నిజం అయితే దానిని కాథలిక్ చర్చి వారు నిరూపించాలి అని ఈటీవీ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సవాలు విసిరారు
బెస్రా గారికి చికిత్స చేసిన వైద్యులు డా. మంజు మురుషేద్, డా. TK. బిస్వాస్ లు కూడా బెస్రా గారికి తాము చేసిన వైద్యం వల్లనే రోగం నయం అయ్యింది అని నిర్ధారించారు. వారు ఈ విషయాన్ని అనేక పత్రికలకు కూడా చెప్పారు. అంతే కాక బెస్రా విషయంలో తెరెసా చేసిన అద్భుతం వల్లనే వ్యాధి నయం అయ్యింది అని చెప్పమంటూ తమ మీద చాలా ఒత్తిడి వచ్చింది అని కూడా వారు చెప్పారు.
కొంత కాలం తరువాత బెస్రా భర్త అయిన ముర్ము కూడా తన భార్యకు వైద్య చికిత్స వల్లనే రోగం నయం అయ్యింది అని చెప్పాడు. ఈ విషయం 10 అక్టోబర్ 2002 నాటి హిందూస్తాన్ టైమ్స్ పత్రికలో వచ్చింది. అంటే ప్రభుత్వం కానీ, బెస్రాకు చికిత్స చేసిన వైద్యులు కానీ, ఆఖరికి ఆవిడ భర్త కానీ తెరెసా అద్భుతాన్ని అంగీకరించలేదు. అయినా సరే చివరికి 13 అక్టోబర్ 2003న రెండవ పోప్ జాన్ పాల్, ఈ అద్భుతం ఆధారంగా తెరేసాకు సెయింట్ హోదా ఇవ్వడానికి సంబంధించిన మీదటి దశ అయిన బీటిఫికేషన్ ను పూర్తి చేశారు. ఈ కార్యక్రమానికి బెస్రా గారి కుటుంబ సభ్యులను కూడా తీసుకువెళ్లారు.
అయితే ఆశ్చర్యకరంగా కొంతకాలం తరువాత బెస్రాగారు కూడా తనకి వ్యాధి వైద్యం వల్లనే నయం అయ్యింది అని, తెరేసా చేసిన అద్భుతం వల్ల కాదని కుండబద్దలు కొట్టారు. ఈ విషయాలు అప్పట్లో పశ్చిమ బంగకు చెందిన దాదాపు అన్ని పత్రికలలో ప్రముఖంగా వచ్చింది. దాదాపు అందరూ ముక్తకంఠంగా ఈ అద్భుతం నిజం కాదనే రాశాయి.
ఇలా ఒక వ్యక్తికి సెయింట్ హోదా ఇవ్వడానికి కారణం అయిన అద్భుతం జరగలేదు అని అద్భుతం వలన రోగం తాగ్గింది అని ప్రచారం చేసిన వ్యక్తి అనడం కాథలిక్ చరిత్రలో ఇదే మొదటి సారి. ఆ విధంగా తెరేసా గారు ఒక అరుదైన రికార్డు సృష్టించారు
B. రెండవ అద్భుతం విషయంలో కాథలిక్ చర్చి అధికారులు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. చర్చ్ అధికారిక కథనం ప్రకారం బ్రెజిల్ దేశానికి చెందిన ఒక వ్యక్తికి, అతని భార్య తెరేసాకు ప్రార్ధన చేస్తే బ్రెయిన్ ట్యూమర్ తగ్గిందట. ఇది 2008లో జరిగిందట. కానీ చివరి నిమిషం వరకూ ఈ వ్యక్తికి సంబంధించిన ఏ వివరాలూ బయటపెట్టలేదు. చివరికి 2016 సెప్టెంబర్ లో తెరెసాకు సెయింట్ హైదా ఇచ్చారు.
(Mother Teresa: An untold Story - Kindle Page Nbr 5918 - 5997)
19. తెరేసాకు సెయింట్ హోదా తగినదేనా?
నిస్సందేహంగా తగినదే. ఆ హోదా పొందిన ఎందరో తెరెసా కన్నా తీవ్రమైన నేరాలు చేసిన వారు. కాథలిక్ చర్చి అనేది ఒక వ్యాపార సంస్థ అనుకుంటే, వారి వ్యాపారాన్ని ఎవరు బాగా విస్తరిస్తారో వారికే హోదాలు, గౌరవాలు కూడా కల్పిస్తారు. సెయింట్ హోదా అటువంటిదే తప్ప, సెయింట్ హోదా పొందిన వారంతా మహానుభావులే అనుకుంటే అది చాలా పొరపాటు.
వడియాల రంజిత్
Source - Whatsapp Message

No comments:
Post a Comment