Sunday, October 25, 2020

సాధనతో సమకూరు ధరలోన...

ముందుగా మంచిమాట శ్రోతలందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఈ పండుగ రోజు అద్భుతమైన మంచిమాట చదవండి.

సాధన... ఏదైనా ఒక సమయంలో రోజు అదే సమయంలో చేస్తూ దానికోసం మనల్ని మనం కేటాయించటం సాధన.. అంటే ఆ సమయంలో ధ్యానం అవ్వవచ్చు, యోగ అవ్వవచ్చు, వ్యాయామం అవ్వవచ్చు, ప్రవచనం కావొచ్చు.. లేదా నేర్చుకోవడం కావొచ్చు... అన్ని సాధన కోసమే అది మన ఎదుగుదల కోసమే... సాధన వల్ల మనకు మొదట కొంత ఉపశేమానం.. లేదా కొంత ఆనందం కొద్దిపాటి ఉత్సహం వస్తాయి... కానీ అన్ని సాధనలు చివరివరకు ఉండవు చాలావరకు... కారణం అందులో మనకు కావలసిన అంతరమైన ఆనందం దొరకక పోతే వదిలేయడం జరుగుతుంది...

🌸 చాలా సాధనలు మధ్యలో వదిలివేయటానికి కారణం చేసినప్పుడు మినహా తర్వాత ఆనందం లేకపోవడం... అంటే సాధన నుండి ఏదో ఆశించే మొదలుపెడతాం ఆశించింది దొరకదు అని అనిపించిన క్షణం ఇక దానిలో ఉన్న పరిమళం వేగటుగా మారుతుంది... కొన్ని సాధనలు చేసిన కొద్ది చెయ్యాలి అనిపించటమే కాకుండా అదే స్థితిలో ఉండేలా చేసే సాధన ఏమన్న ఉంది అంటే అదే సరైన సాధన అనేది ఖచ్చితం.. అలాంటి సాధనలో ఇమిడిపోవటానికి సాధన లోతులు తెలుసుకోవడానికె సమయం చాలదు... అప్పుడు మన ఆలోచన మొత్తం దానిపైనే కేంద్రీకృతమౌతుంది...
అంటే ఆ సాధన మనకు ఆనందం, ఆరోగ్యం, జ్ఞానం ఇచ్చే సాధన అనేది మనకే తెలుస్తుంది.. ఇక్కడ కొలమానాలు ఉండవు... అనుభవాలు పంచుకోవడం ఆ సాధన తాలూకా మనుషులను కలవడం ఉన్న స్తితి గురించి చేర్చింటం ఉంటుంది.. అంటే సాధనలో మమేకమవ్వడం కోసం చేసే ప్రయత్నం అనేది అసలు విషయం...

🌸 సాధనలో ఉండేది ఒకటే నేర్చుకోవడం మాత్రమే.. జ్ఞానం ఎంతనేర్చుకున్న తనివి తీరదు కారణం జ్ఞానానికి ఆది అంతం లేవు కాబట్టి.. అలాంటి స్థితిలో మనం ఏమి పొందాము అని చెప్పే సమయం ఉంటుందా అనేది అసలు ప్రశ్న... చెప్పిన అది పూర్ణమౌతుందా... ఒకసారి ముల్లా నసురుద్దీన్ ఓ ఇంద్రజాలికుడి దగ్గరకు ఇంద్రజాలం నేర్చుకోవడానికి వెళ్ళాడు నేర్చుకున్నాడు ఇంటికి వచ్చి భార్యకు గొప్పగా చేసి చూపించాడు... మొదట భార్య విస్తుపోయిన తరువాత అడిగిన ప్రశ్నకు నసురుద్దీన్ కు మతిపోగొట్టేసింది... ఇంద్రజాలం వల్ల లాభం ఏమిటి అని ప్రశ్నించింది... మళ్ళీ సమాధానం సంపాదన కొరకే అని చెప్పాల్సి వచ్చింది.. కానీ ఒక్కసారి మనం ఇంద్రజాలం నేర్చుకుంటే ఇక అది మనకు ఇంద్రజాలం అవ్వదు... అంటే అక్కడ ఆనందం ఉండదు గాక ఉండదు అనేది కారణం.. అంటే ప్రదర్శనకు మాత్రమే ఉపయోగపడే సాధనలు ఎక్కువ కాలం చెయ్యము.. అనుభూతి పొందే సాధనలే మనకు ముఖ్యం.. ఎందుకంటే అనుభూతిని పొందగలం కానీ చెప్పలేము... ఆచరణలో ఉంటాం కానీ నేను ఇది అని చెప్పలేము.. నిత్యం దాని గురించే ఆలోచిస్తూ మనల్ని మనం మార్చుకుంటాం... కానీ ఇదే ఆఖరిది అనేది చెప్పటం మన వల్ల కాదు అని మనకే తెలియడం... అది సాధన అంటే.. అది నేర్చుకోవడం నేర్పటంలో ఉన్న ఆనందం చేసే వారికి చెప్పేవారి వినేవారికి అనుభవంగా మిగిలిపోతుంది మినహా కొలవాడనికి రానిదే స్వచ్ఛమైన సాధన... ఇది వాస్తవం అని తెలుసు అందరికి...

సాధనతో సమకూరు ధరలోన..*
💚💚💚💚💚💚

Source - Whatsapp Message

No comments:

Post a Comment