Saturday, October 24, 2020

మనకు ఒక కోరిక కలిగింది అంటే అది నెరవేర్చుకునే శక్తి కూడా మనకు ఇవ్వబడింది.

భవిష్యత్ అనే పదం మనలోని ఆశలకు,కోరికలకు రూపం.. కానీ ఈ సమయంలో ఇప్పుడు మనకున్న సమస్య వలన మనం తీసుకునే నిర్ణయం బట్టి ఉంటుంది అనేది ఖచ్చితం... అటువంటప్పుడు మన భవిష్యత్ ని మనం సమస్యల ద్వారా సృష్టిస్తున్నాం అనేది కూడా వాస్తవం... సమస్యలు ఉన్నప్పుడు తీసుకునే నిర్ణయం మరో సానుకూలమైన లేదా ప్రతికూలమైన సమస్యను తీసుకొస్తుంది.. ఎప్పుడు సమస్యలు పరిష్కరించటమే పని అవుతుంది... మరి ఎం చేస్తే మనకు కావలసిన భవిష్యత్ ని నిర్మించుకోగలుగుతాం అనేది ప్రశ్న...

🌸 మనం తీసుకునే నిర్ణయాలు ఎప్పుడు ఒక కదలికనో లేదా ఒక సమస్యనో లేదా ఒక కొరికనో తీరిస్తే సరిపోదు... మూడింటిని సమన్వయ పరుస్తూ శాస్వితంగా లాభం చేకూర్చేది అయితే అద్భుతః... ఇక్కడ ఉన్న స్తితి దానికి తగ్గట్లుగా ఉందా అనేదే అసలు సవాల్ అనేది వాస్తవం... పరిస్థితిని బట్టి నిర్ణయం మన ప్రమేయం లేకుండా తీసేసుకుంటున్నాం అనేది కూడా వాస్తవం... ఇక్కడ మనం ముందు అర్ధం చేసుకోవలసింది గతం నుండి ఇప్పటివరకు మన జీవితం మనకు సంతృప్తిగా ఉందా అని చూసుకుంటే మూడు దశలు కనపడతాయి...
మొదటిది కోరిక..
రెండోవది పరిస్థితి..
మూడోవది ఎక్కువగా ఎదురౌతున్న సమస్య.. వీటిని ఆధారంగా నిర్ణయాలు తీసుకొని ఎవరి భవిష్యత్ ని వారు సృష్టిస్తున్నారు... ఇది ఎంతవరకు సబబు... వ్యక్తిగతంగా సబబు కానీ అది తాత్కాలిక0.. ఓ చిన్న కథ మనం చాలాసార్లు చదివినదే..

🌸 పూర్వం ఒక ఊరిలో ఒక సాధారణ కుటుంబం.. తల్లి భార్య తను... ఆ సమయంలో ఇబ్బందులతో జీవితం నడుపుతోంది... దానికి కొడుకు తపస్సుతో దైవం దగ్గర వరం పొంది ఇబ్బందులు తొలగించుకోవాలి అనుకున్నాడు... అలాగే ఇంట్లో చెప్పి పక్కనే ఉన్న అడవికి వెళ్లి తపస్సులో మునిగిపోయాడు..
కొంతకాలానికి దైవం ప్రత్యక్షమై.. నీకు ఒకె వరం ఇస్తా కోరుకో అన్నాడు.. దానికి ఆ తాపసికి కోరికల చిట్టా గుర్తుకొచ్చి ఎలా అనుకోని ఇంటికెళ్లి తల్లి భార్యలను కనుక్కుని వస్తా అని ఒకరోజు గడువు తీసుకొన్నాడు.. ఆ రోజు ఇంటికి వెళ్లి ముందు భార్యను ఆడిగాడు.. ఏమి కోరుకోవాలి అని భార్య సంతానం కోరుకోమంది... తల్లిని అడిగాడు.. తనకు చూపు ఉంటే నీకు కొంత సాయం చేయగలను నీ పిల్లలను చూసుకోవాలి కదా అన్నది.. తనకేమో సంపద ఉంటే ఇబ్బందుల ఉండవు కదా అనుకున్నాడు... మరుసటి రోజు తపస్సు చేసి చోటుకు వెళ్లి ధ్యానంలో కూర్చున్నాడు... దైవం తన సమయానికి వచ్చారు... ఏమి వరం కావాలి అని అడిగాడు..
తాపసి కోరిన కోరిక... మా అమ్మ తన మనుమడిని బంగారపు ఉయ్యాలలో చూడాలి.. అని కోరుకోగానే తథాస్తు అని ఆ దైవం వెళ్ళిపోయింది...

🌸 ఇక మన పరిస్థితికి వస్తే పరిస్థితిని బట్టి నిర్ణయాలు కాకుండా ఎరుకతో నిర్ణయాలు ఎప్పుడు మనకు శుభకరం ఎందుకంటే ఏమి జరిగిన దానికి మనమే బాధ్యులం అనేది మనకు అవగాహన ఉంటుంది... ఇంకొకటి ఎవరిని నిందించం(ఇక్కడే చాలా సమయం వృధా చేస్తుంటాం కాబట్టి..). తదుపరి అడుగు చాలా చక్కగా వేయగలుగుతాం అనేది వాస్తవం... ఇక్కడ కోరిక కన్నా మన ఆనందం ముఖ్యపాత్ర పోషిస్తుంది అనేది అసలు కీలకం... భూమి మీద ఏదైనా కోరిక కలిగింది అంటే అది నెరవేర్చుకునే శక్తి మనకుంది అనేది ఎరుక... ఆ ఎరుక ఉంటే సృష్టి అనేది మన చేతలలోనే ఉంది అనేది వాస్తవం... అంటే నిర్ణయం తీసుకోవడమే అసలు మెలి మలుపు మనకు...

మనకు ఒక కోరిక కలిగింది అంటే అది నెరవేర్చుకునే శక్తి కూడా మనకు ఇవ్వబడింది..

Thank you...🌸🌸🌸

Source - Whatsapp Message

No comments:

Post a Comment