Sunday, October 25, 2020

నమ్మకం.

నమ్మకం.
---మానవ జీవితానికి చిరునవ్వులతోనే స్వాగతం పలకాలి. ఆవేశం ఎంతటిదైనా.. ప్రశాంతత ముందు తల వాల్చాల్సిందే. మనిషి నిలువెత్తు స్వార్థానికి నిర్మల మనస్థత్వంతో సున్నితమైన సమాధానం చాలు...!

కవిత్వానికి యతి, ప్రాసల కఠిన పదాలే కాదు.. సారవంతమైన నాలుగు అక్షరాలతోనూ మనుషుల మనస్సులను కదిలించవచ్చు. అలాగే.. మానవీయ విలువలను కాపాడాలంటే #నమ్మకమనే పునాదులపైనే అనుబంధాల భవనాన్ని నిర్మించాలి...!

అంతేకాదు... మనిషి మర మనిషై.. మమత మృగతుల్యమై.. మనసు జాడ తెలియని యంత్ర ప్రపంచంలో.. నాడి తెలియక వెతుకుతున్న మనిషికి.. నరుని చిరునామా నల్లపూసై పోయింది...!

మనుషుల మధ్య ఆత్మీయ, అనురాగాలు, ఒకరంటే ఒకరికి విశ్వాసం, నమ్మకం ఉండాలే తప్ప.. నమ్మకం అమ్మకం కాకూడదు. నమ్మిన వ్యక్తి జీవితాంతం ఉండాలి. జీవితంలో ఏది సాధించాలనుకున్నా... చేయగలనన్న నమ్మకం, నిజమైన ఆత్మ స్థైర్యం అంతరాల్లో నుండి రావాలి...!

నమ్మకం జీవితానికి అవసరం. అపనమ్మకం అశాంతికి కారణం. మనిషి బతకటానికి కావలసింది ప్రశాంతత. ఆ ప్రశాంతతకి పునాది నమ్మకం. నమ్మకాలన్నీ భ్రమలుగా మిగిలి పోతున్నప్పుడు, ఆ నమ్మకాన్ని పునరుద్దరించుకోవాలి. సరికొత్తగా నిర్మించుకోవాలి...!

తమమీద తమకే నమ్మకం లేని వ్యక్తులు తమని తాము తీవ్రంగా నిందించుకుంటారు. అభద్రతా భావానికి లోనవుతుంటారు. మనపై మనకుండే నమ్మకం శత్రువుని భయపెడుతుంది, మనపై మనకుండే అపనమ్మకం శత్రువు బలాన్ని పెంచుతుంది.. అంటాడు చాణక్యుడు...!

అందుకే నమ్మకం ఒక ఆయుధం. నమ్మకం ఒక సాధనం. నమ్మకం అనేక బంధాల్ని ముడివేస్తుంది. జీవితంలో వేసే ప్రతి అడుగూ నమ్మకంతోనే వేయాలి. అలాంటి నమ్మికతో కూడిన అడుగు మనల్ని మనం సాధించుకోడానికి.. ఆత్మీయులను సంపాదించుకోడానికి సాధనమౌతుంది...!

అన్నిటికంటే ముందు మనల్ని మనం నమ్మాలి.. మన ఆత్మీయులనూ నమ్మగలగాలి. అందుకే ఏ పనిచేయాలన్నా ఆత్మవిశ్వాసం ఉండాలి. అప్పుడే జీవితం ఆనందంగా సాగుతుంది...!


నడిచేటి మనిషికి భూమిపై నమ్మకం.. నదిలోని చేపకి నీటిపై నమ్మకం.. నడిపించు నాయకుడికి వ్యూహంపై నమ్మకం..
నడిచేటి సేనకి నాయకుడిపై నమ్మకం ఉండాలి అంటాడు కవి మౌలాలి...!!
👏👏👏

Source - Whatsapp Message

No comments:

Post a Comment