Saturday, October 3, 2020

మంచి మాటలు

సోమవారం --: 24-08-2020 :--
ఈ రోజు AVB మంచి మాటలు ...
ఈ ప్రపంచంలో మనం కొనుక్కోలేనిది ఏదైనా ఉంది అంటే అది గౌరవమే . దాన్ని సంపాదించుకోవాలే తప్ప పేరుతోనే డబ్బుతోనో పరపతితోనో కొనుక్కోలేము .

మనిషిని పరిచయం చేసుకోవటం లో గొప్పతనం ఏమీ లేదు ! వాళ్ళ మనసుని అర్థం చేసుకోవటం లోనే మన గొప్పతనం ఉంది నేస్తమా! .

మనిషికి కావలసింది నేర్పు . మనసుకు కావలసింది ఓర్పు . జీవితానికి కావలసింది కూర్పు . బాధలలో కావలసింది ఓదార్పు . ప్రతి జీవితానికి కావలసింది మార్పు .

నీ బలం ఎవరికి తెలియక పోయినా పర్వాలేదు . బ్రతకే యొచ్చు . కానీ ! నీ బలహీనత మాత్రం ఎవరికీ తెలియనివ్వకు . బ్రతకనివ్వరు

నీలో ఎన్ని లోపాలున్నా బలహీనతలున్నా నిన్ను నీవ్వు ఎలా ప్రేమిస్తావో అలాగే ఎదుటి వారి లోపాలనూ బలహీనతలను అర్థం చేసుకుంటే అందరూ మంచిగానే కనిపిస్తారు అందరూ నీవారవుతారు .

సేకరణ 🖋️ *మీ ..AVB సుబ్బారావు 💐🤝🕉️🌹

Source - Whatsapp Message

No comments:

Post a Comment