. గురు బోద
...........................................
ఆత్మ స్వరూపులు అందరికీ శుభోదయం శుభాశీస్సులు
ఆత్మ స్వరూపులు మనమందరం దైవ వారసులం .
మీరొక ఆత్మ
మానవుడు తన నిత్య జీవితములో ఎదురయ్యే ఎన్నో సమస్యలను పరిష్కరించుకొనవచ్చు. కాని “నేను ఎవరు” అన్న చిన్న ప్రశ్నకు మాత్రము సరియైన సమాధానము తెలుసుకొన లేకపోతున్నాడు. ఎవరైనా “నీవు ఎవరు” అని ప్రశ్నిస్తే, నేను ఫలానా రామచంద్రాన్ని మురళికృష్ణని, శంకర్ని అనే సమాధానము లభిస్తుంది. కాని నిజానికి ఈ పేర్లు అన్నీ శరీరమునకు సంబంధించినవి. “నేను” అనేది ఆత్మకు, “నాది” అనేది శరీరమునకు వర్తిస్తుందనే యదార్థ జ్ఞానము లేనందువలన ఈనాడు మానవులంతా దేహాభిమానులై అశాంతి, దుఃఖములతో బాధింపబడుచున్నారు.కావున పరమాత్మ కృష్ణ భగవానుడు మనందరికీ ఆత్మయొక్క స్వ స్వరూప జ్ఞానమును బోధిస్తున్నారు. దీని వలన మనమెవరము? ఎచటి నుండి వచ్చాము? ఆత్మిక సుఖ శాంతులను ఎలా పోగొట్టుకున్నాము? మొదలగు నిగూఢమైన ప్రశ్నలకు సమాధానము లభిస్తుంది. జీవితపు చిక్కు సమస్యలన్నిటినీ తీర్చుకొనగల్లుటయే కాక ఆత్మిక జాగృతి చెంది మానవుడు మాధవునిగా నారి శ్రీమహాలక్ష్మిగా విరాజిల్లుతారు. ఇప్పుడు ఆత్మ యొక్క సత్య యధార్థ తత్వం ద్వారా పరమాత్ముడు మనకు ముక్తి, జీవన్ముక్తి, సంపూర్ణ సుఖశాంతి పవిత్రతలకు అర్హులుగా తయారు కావాలి అని గీతలో తెలియ జేశారు.
నిత్య వ్యవహారంలో “మానవుడు ఎన్నో సార్లు “నేను”, “నేను” అనే పదము వాడుతూ ఉంటాడు. కాని, వింత ఏమిటి అంటే ఎన్నో సార్లు వాడుతూ కూడ “నేను”, “నాది” అనే మాటల నిజమైన అర్థము, “నేను” అనే శక్తియొక్క అసలైన స్వరూపము, అది ఏ వస్తువును సూచిస్తుంది” అనే విషయం ఎవరికీ తెలియదు. నేడు మానవుడు సైన్సు ద్వారా ఎన్నో సమస్యలకు సమాధానం కనుగొన్నాడు. శక్తివంతమైన సాధనాలు ఎన్నింటినో తయారుచేసాడు. మరెన్నో సమస్యలకు పరిష్కార మార్గం కనుగొనడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఈ “నేను” ఎవరు? అనే సత్య విషయం గురించి అతనికి తెలియదు. ఇప్పుడు ఎవరిని అడిగినా నేను ఎవరు అంటే తమ శరీరము పేరు లేదా తమ వృత్తి గురించి చెబుతారు.
నిజానికి ఈ “నేను” అనే శబ్దము శరీరమునకు వేరైన ఒక చైతన్య శక్తియగు “ఆత్మ”ను సూచిస్తుంది. “ఆత్మ మరియు శరీరముల” సమ్మేళనమే జీవాత్మ. భూమి, నీరు, అగ్ని వాయువు, ఆకాశము అనే ఐదు మూల ప్రకృతి పదార్థాల సమ్మేళనమే శరీరమైనట్లు ఆత్మ కూడ మనస్సు, బుద్ధి, సంస్కారములను కలిగి ఉంటుంది. ఆత్మయే ఆలోచనాశక్తి, నిర్ణయశక్తి కలిగి తను చేసిన కర్మలకు అనురూపమైన సంస్కారాలు కలిగి ఉంటుంది. ఆత్మ మానవ దేహంలో భృకుటి మధ్య అవినాశి చైతన్యవంతమగు జ్యోతిర్బిందు స్వరూపముతో విరాజమానమై ఉంటుంది. దివ్య దృష్టితో చూస్తే ఈ ఆత్మ రాత్రిపూట ఆకాశంలో మినుకు మినుకుమనే నక్షత్రంవలె కనిపిస్తుంది అందుకే ఒక భృకటి (కనుబొమ్మల మధ్య) ఆత్మకు నివాస స్థానం. కనుకనే తీవ్రముగా ఆలోచించే సమయంలో ఎవరైనాసరే “నాగీత బాగాలేదు, నా వ్రాత ఇలా తగులబడింది” అంటూ చేతితో నుదురును చూపిస్తూ అనుకొంటారు. భక్తులు తిలకమును, కనుబొమ్మల మధ్య పెట్టుకొనే కారణం కూడా ఇదే.
ఇక్కడ ఆత్మకూ మెదడుకూ సంబంధం కలుగుతుంది. మెదడుకు, శరీరంలో అంతటా వ్యాపించి ఉన్న జ్ఞాన నాడులకూ క్రియాశక్తికి చెందిన నాడులకు సంబంధం ఉన్నది. ఆత్మలోనే మొదట సంకల్పం కలిగి మెదడు మరియు నాడుల ద్వారా వ్యక్తమవుతుంది. ఆత్మయే శాంతి లేక దుఃఖమును అనుభవిస్తుంది. నిర్ణయాలు చేసుకుంటుంది. సంస్కారములు అలవర్చుకుంటుంది. ఈ కారణం చేత మనస్సు, బుద్ధి ఆత్మకు వేరుగా లేవు. కాని పిల్లలు, వృద్దులు, స్త్రీ, పురుషులు అంతా ఆత్మను మరచి దేహాభిమానులు అగుటయే అన్ని దుఃఖాలకు మూలకారణము అని గ్రహించాలి.
పై రహస్యమును మోటారుకారు మరియు డ్రైవర్ ఉదాహరణ ద్వారా స్పష్టము చేస్తున్నారు. శరీరము మోటారు కారు లాంటిదైతే ఆత్మ దీని డ్రైవరు. అంటే డ్రైవరు, మోటారును అధీనంలో ఉంచుకున్నట్లు ఆత్మ శరీరాన్ని అదుపు ఆజ్ఞలలో ఉంచుకుంటుంది. ఆత్మలేని శరీరం శవం లాంటిది. కావుననే పరమాత్మ కృష్ణుడు చెబుతున్నారు, తనను తాను తెలుసుకున్నట్లయితే తన శరీరము అనే కారును సక్రమంగా నడిపించి లక్ష్యమును చేరుకొనగలుతాడు” అని బోధిస్తారు. అజ్ఞాని చేతిలో ఈశరీరము, చేతగాని డ్రైవరు చేతిలోని కారులాగ ప్రమాదాల పాలై చివరకు తనను నమ్మకొనిన తోటివారికి కూడ ప్రాణహాని కలిగిస్తున్నాడు.. ఆత్మ జ్ఞానము లేనివారి కుటుంబము, బంధుమిత్రులు అందరూ దుఃఖము, అశాంతిని అనుభవించ వలసి వస్తుంది. అందుచే నిజమైన సుఖశాంతులు పొందుటకు ఆత్మ జ్ఞానము చాలా అవసరము.
మనస్సు-బుద్ధి సహితంగా వున్న నేను చైతన్య ఆత్మను, పరoధామ నివాసిని మరియు పరమాత్మ సంతానాన్ని శరీరము నా రథము, నేను శరీరాన్ని కాదు , అని తెలుసుకోవాలి.
👏👏👏
Source - Whatsapp Message

No comments:
Post a Comment