Monday, October 12, 2020

మనకు అవసరం లేనిదాన్ని మన దగ్గర ఉంచుకోకూడదు..

""""అవసరమా"""""?

మనకు అవసరం లేనిది మనకు విషమే....
మనిషి తనకు అక్కరలేనివి తన దగ్గర ఉంచుకోవడం
వల్లే అధికంగా బాధలు పడతాడు...
అవి...

అధికారమైనా,,,,
వస్తువులైనా,,,
ఆహారమైనా,,,,,
అహంకారమైనా,,,
ఆశయమైనా,,,,,
ప్రత్యేకించుకోవడమైనా,,,
గర్వమైనా
భయమైనా,,,,
సోమరితనమైనా,,,,
బంధాలైనా,,,
కోపమైనా,,,,,
అజ్ఞానమైనా,,,,

ఇలా ఎన్నో తనకు ఏ మాత్రం ఆనందాన్ని
ఇవ్వని వాటిని తన వెంట ఉంచుకొని
వాటినుండి ఆనందాన్ని ,,,,శాశ్వత తత్వాన్ని
ఆశిస్తాడు...ఎలా ఉంటుందంటే ఎండమావుల్లో
నీళ్లు వెదకడం లాంటిదే,,,,పోనీ వదులుకుందామంటే,,
ఎడారిలో జిత్తును మెసే ఒంటె లెక్కన మనిషి బతుకైంది...
జిత్తుకు ( ఎడారిలో ఒక రకమైన గడ్డిజాతి ) ఒంటినిండా
ముల్లులే,,,,కానీ ఒంటె కు జిత్తు అంటే ఇష్టం....
దాన్ని తింటున్నంత సేపూ దాని చిగుర్లలోంచి
రక్తం కారుతూనే ఉంటుంది...తిన్న తర్వాత
అది చిగుళ్ల బాధతో అలమటిస్తుంది.....
కానీ ఆ జిత్తు నుండి తన శరీరానికి కలిగే మేలు
ఏ మాత్రం లేదు....ఈ ఒంటె ఆ జిత్తును ఎలా
పట్టుకుందో మనిషి అవసరం లేని ఆ
""అజ్ఞానసమూహ చిత్త్తవృత్తి"""ని అలా
పట్టుకు తిరుగుతున్నాడు.....అది తనకు ఒరగబెట్టేది ఏమీ లేకపోయినా అదిగో ఆ ఒంటె లెక్కన.....అనవసరమైనవి గాడిదలాగా
మొస్తుంటాడు.... అవేవో విలువైనవి అన్నట్లు....ఆ ఒంటెకు చిగుళ్ల భాద మిగిలినట్లు వీనికి ఆయాసం మిగులుతుంది...

""""""జిత్తుమీద కోరిక చావనంత వరకూ,, ఒంటెకు చిగుళ్ల భాద తప్పదు.... అనవసరమైన దాన్ని వెంటబెట్టుకు తిరుగుతున్నంత కాలం,, మనిషి తిప్పలు తప్పవు..."""""

మనకు అవసరం లేనిదాన్ని
మన దగ్గర ఉంచుకోకూడదు...🙏🙏🙏🙏

Source - Whatsapp Message

No comments:

Post a Comment