Wednesday, November 25, 2020

ప్రత్యక్షంగా,పరోక్షంగా ఓ 10 మందికి మంచి జరిగితే,మన మానవ జన్మ సార్థకమయినట్లే ...

పునర్విత్తం పునర్మిత్రం
పునర్భార్య పునర్మహి
ఏతత్సర్వంపునర్లభ్యం
న శరీరం పునఃపునః ।।

పోయిన ధనం మళ్లీ చేరుతుంది.

దూరమైన మిత్రుడు మళ్లీ చేరువఅవుతాడు.

భార్య గతిస్తే మరొక భార్య లభిస్తుంది.

భూసంపద మళ్లీ ప్రాప్తిస్తుంది.

పోయినవన్నీ మళ్లీ తిరిగి రాబట్టుకోవచ్చు!

కాని మానవ శరీరం మాత్రం మళ్లీ మళ్లీ రాదు.

అందుకే శరీరం ఖలు ధర్మసాధనం అన్నారు.

కేవలం శరీరం ఉంటేనే ధార్మికపనులు చేయవచ్చు.

శరీరం ఉంటేనే నాలుగు మంచి పనులు చేసే అవకాశం వస్తుంది.

శరీరం ఉంటేనే హితవాక్యాలు చెప్పవచ్చు.
ఏ పని చేయడానికైనా శరీరం కావాలి.


కనుక శరీరము ను రక్షించుకోవాల్సింది మానవ జన్మ ఎత్తినవాళ్లే.

జంతువులకు శరీరం ఉంటుంది కాని వాటికి ఆలోచన ఉండదు.

పైగా ఆలోచన కలిగినా దాన్ని అమలు చేయడానికి శరీరం సహకరించదు.

బుద్ధి , ఆలోచన , మాట్లాడే శక్తి , కావలసినది సంపాదించుకొని జ్ఞానంతగిన అవయవ నిర్మాణం
ఉండేది ఒక్క మనుష్యులకే.

వాటిని అమలు చేసే నైపుణ్యమూ మనుష్యులకే ఉంటుంది.
కనుక మనం అందరూ శరీరాన్ని కాపాడుకోవాలి.

అతిగా తిన్నా,
అతిగా ఆలోచించినా,
అతిగా సుఖం కలిగించినా,
అతిగా దుఃఖం కలిగించినా
ఏదైనా అతిగా చేస్తే ఈ "శరీరం" కాస్త పుటుక్కుమంటుంది.

ఇక
శరీరం చేజారిపోయాక చేసేది ఏమీ ఉండదు.

కనుక ముందు
శరీరము ను జాగ్రత్తగా చూసుకోవాలి.

దీనికి

సత్యం,
ధర్మం,
శాంతి,
ప్రేమ,
అహింసలను

పాటించడమే "మహా ఔషధంగా" పనికి వస్తుంది.

విస్తరాకు

విస్తరి ఆకుని ఎంతో శుబ్రoగా ఉంచుకొని నీటితో కడిగి నమస్కారం చేసుకుని భోజనానికి కూర్చుంటాము ,
బోజనము తినే వరకు ఆకుకు మట్టి అంటకుండా జాగ్రత్త వహిస్తాము,

తినిన మరుక్షణం ఆ విస్తరి ఆకును మడిచి , దూరంగా పడేసి వస్తాము. ఎంగిలి ఆకును కూడా ముట్టుకోము.

మనిషి జీవితం కూడ అంతే
'ఊపిరి" పోగానే ఊరిబయట పారేసి వస్తారు,

విస్తరి ఆకు పారేసినప్పుడు సంతోష పడుతుంది, ఎందుకంటే పొయే ముందు
ఒకరి ఆకలిని తీర్చటానికి తను ఉపయోగ పడినాను అన్న తృప్తి ఆకుకు ఉంటుంది ,

విస్తరి ఆకు కు ఉన్న ముందు ఆలోచన భగవంతుడు మనుషులకు కూడా ఇవ్వాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ !

"" సేవ చేసే అవకాశము వచ్చినపుడు సేవ చేయండి"" జారవిడుచుకోకూడదూ

మల్లీ ,
ఇంకొకసారి,
ఎప్పుడో చేయవచ్చు
అనుకొని వాయిదా వేయకండి,
ఆ అవకాశము మళ్లీ వస్తుందని అనుకుంటే, కుండ ఎప్పుడైనా పగలవచ్చు అప్పుడు విస్తరికి ఉన్న తృప్తి కూడ మనకి ఉండదు.

ఎంత సంపాదించి ఏమి లాభం ?

ఒక్క పైసా కూడా తీసుక పోగలమా?

మన చేత
ప్రత్యక్షంగా,పరోక్షంగా ఓ 10 మందికి
మంచి జరిగితే,
మన మానవ జన్మ సార్థకమయినట్లే ......... 👏

(సేకరణ )

ఓం శాంతిః ఓం శాంతిః ఓం శాంతిః*

Source - Whatsapp Message

No comments:

Post a Comment