Sunday, November 22, 2020

ఆలోచన బాధగా రూపాంతరం చెందుతున్న తీరు ఏమిటి !?

శ్రీరమణీయం -(635)
🕉🌞🌏🌙🌟🚩

"ఆలోచన బాధగా రూపాంతరం చెందుతున్న తీరు ఏమిటి !?"


ఎవరో మనని దొంగ అని నిందించినప్పుడు వెంటనే బాధ కలగటం సహజం. కానీ ఆ విషయాన్ని పదేపదే గుర్తుకు తెచ్చుకోవటమే బాధకు కారణం అవుతుంది. దొంగ అనే రెండక్షరాల మాట అనటం క్షణంలో జరిగిన క్రియ. మనకున్న 24 గంటల్లో ఆ ఒక్క క్షణం అనేది ఎన్నోవంతు. కానీ పదేపదే మనమే దాన్ని గుర్తుకు తెచ్చుకొని ఆ భావనను రోజంతా నింపుకుంటున్నాం. కార్యంలో బాధ ఎలాగూ తప్పదు. ఇక్కడ తలపుల వలన కలిగే బాధ నుండి పరిహరించుకోవాలి. మన మనసు బాధ నుండి విముక్తి కోరుకుంటుంది. మనసుకు శాంతి కావాలంటే తలపులన్నింటినీ లేకుండా చేసుకోవాలనే ఒక అపోహ ఉంది. కానీ ఆ ప్రయత్నం ఎప్పటికీ నెరవేరదు. ఎందుకంటే తలపులు లేకుండా జీవితమే లేదు. అందుకే దీనికి మార్గం ఏమిటంటే.. అప్పటి పనికి సంబంధించని ఆలోచనలను పరిహరించటం అలవాటు చేసుకోవాలి. ఇతర తలంపులకు మన జ్ఞాపకాలే కారణం. అప్పటికి అవసరం లేని అలోచన చేయటం అంటే మనలో నిక్షిప్తమై ఉన్న స్మృతులను [జ్ఞాపకాలను] దుర్వినియోగం చేయటమే అవుతుంది !


{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం }"
"పనిలో ఇతర తలపులు ఆపటం ధ్యానంతో సమానం !''- (అధ్యాయం -77)

🕉🌞🌏🌙🌟🚩

Source - Whatsapp Message

No comments:

Post a Comment