Sunday, November 29, 2020

ఇస్తేనే వస్తుంది!

🌸ఇస్తేనే వస్తుంది!🌸

పొందిన జ్ఞానాన్ని ఆచరణలో పెట్టాలి. ఆచరణలో పెట్టడమంటే ఒక్కొక్కటి వదిలేయాలి. అధికంగా ఉన్న డబ్బులు, దుస్తులు దానం రూపంలో వెళ్లిపోవాలి. ఈ విషయాన్ని మారద వెంకయ్య రాసిన భాస్కర శతకంలోని ఓ పద్యం ద్వారా తెలుసుకుందాం.

🌹అడిగినయట్టి యాచకుల యాశ లెరుంగక లోభవర్తియైు
కడిపిన ధర్మదేవత యొకానొకయప్పుడు నీదు వాని కె
య్యెడల నదెట్లు పాలు తమకిచ్చునె యెచ్చటనైన లేగలన్‌
గుడువగనీనిచో కెరలి గోవులు తన్నునుగాక భాస్కరా!

‘పెట్టి పుట్టాడు’ అని అంటుంటారు. ‘పూర్వ జన్మలో పెడితే ఇప్పుడు పుట్టాడు’ అని దానర్థం. మనం పెట్టిందే మనకొస్తుంది. పేదవాళ్లు, బలహీన వర్గాలు ఆశ పడితే వాళ్లకు ఇచ్చేయాలి. వాళ్లకు ఇవ్వకుండా మొత్తం మనమే అనుభవిద్దామని చూడకూడదు. సమాజం నుంచి మనం సంపాదించుకున్న ఆస్తిని, తిరిగి ఏదో రూపంలో సమాజానికి అందజేయకుండా మనమే దాన్ని అనుభవిద్దామని పిసినిగొట్టు వాడిలా ప్రవరిస్తే, ఆ ధర్మదేవత ఏదో ఒక సమయంలో ఆ ఆస్తి మళ్లీ రాకుండా చేస్తుంది. ఎలా అంటే... గేదె పాలు కావాలంటే ముందుగా దూడను తాగనివ్వాలి. అలా తాగనివ్వకపోతే గేదెకు కోపం వచ్చి ఒక్క తన్ను తంతుంది. అలాగే ఇతరులకు పెట్టడం ద్వారా సమాజం నుంచి పొందాలే తప్ప, ఏమీ పెట్టకుండా పొందాలనుకోవడం పొరపాటు.

గరికిపాటి నరసింహారావు

Source - Whatsapp Message

No comments:

Post a Comment