Wednesday, November 18, 2020

మహనీయుని మాటలు అక్షరసత్యాలు

💓🧘‍♀💓🧘‍♀💓🧘‍♀💓🧘‍♀💓

🔥అప్పో దీపోభవ గ్రూప్🔥

BE A LIGHT IN TO YOUR SELF

💧ఆత్మీయు లందరికి దివ్య శుభోదయం🌞🌄☀️🔆

🙏🏼అందరికి ఆత్మ ప్రణామం🙏🏼

🔅మహనీయుని మాటలు అక్షరసత్యాలు💓

💜ప్రేమ శక్తితో సాధించలేనిది ఏదిలేదు. మీరెవరైనా ఎటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నా ,ప్రేమ మిమ్మల్ని తప్పకుండా విముక్తుల్ని చేస్తుంది.

💜ప్రేమ బలహీనమైనది, సున్నితమైనదీ, చెంచలమైనదీ కాదు . అదొక జీవశక్తి. మన జీవితంలోని ప్రతి సానుకూలాంశానికి, మంచికీ ప్రేమే కారణం.

💜ఉన్నతులైన వ్యక్తులెపుడు తమ కిష్టమైనవీ, తాము ప్రేమించేవీ అయిన విషయాల గురించే మాట్లాడతారు. ఇష్టపడని వాటిగురించి మాట్లాడరు.

💜మీకిష్టమైన వాటి గురించి మాట్లాడే శక్తి మీకు అపారంగా ఉంది. అట్లాగే మంచి విషయాలను సాధించే శక్తి కూడా మీకు అపారంగా ఉంది.

💜జీవితం యాదృచ్ఛిక సంభవం కాదు. అది మీ భావాలకు ప్రతిస్పందన. మీజీవితంలోని అంశాలన్నీ మీరు ఆహ్వానించుకున్నవే. మీరేమి ఇస్తారో అది పుచ్చుకుంటారు.

💜మీ జీవన పరిస్థితులను మార్చుకోవడానికి పెద్ద కష్టపడక్కర లేదు. మంచి భావాలద్వారా ప్రేమను ప్రసరించండి. మీరు కోరిన వన్నీ మీకు లభిస్తాయి.

💜ముందు మీరు సంతోషంగా ఉండాలి. మంచి భావనలతో ఉండాలి. అపుడే మీకు సంతోషం అందుతుంది. మీకు ఏమి కావాలనుకున్నా ముందు అది మీదగ్గరనుండి రావాలి.

💜మీలో కలిగే మంచి భావాలన్ని మిమ్మల్ని ప్రేమ శక్తిలో లీనం చేస్తాయి. ఎందుకంటే ప్రేమే అన్ని మంచి భావాలకూ మూలం.

💜ఇవి జీవనసత్యాలు. మనజీవితంలో ఆచరిస్తే సాధించలేని విజయాలుండవు. చేరుకోలేని గమ్యాలుండవు. నమ్మండి. ఆచరించండి.

🔥అప్పో దీపోభవ గ్రూప్🔥

BE A LIGHT IN TO YOUR SELF

💓🧘🏼‍♂️💓🧘🏼‍♂️💓🧘🏼‍♂️💓🧘🏼‍♂️💓

Source - Whatsapp Message

No comments:

Post a Comment