Wednesday, November 18, 2020

నిత్యజీవితంలో ధ్యానం, ఉదయం చేయాల్సిన ధ్యాన పద్ధతులు

🧘🏼‍♀️ నిత్యజీవితంలో ధ్యానం
🧘🏼‍♂️ ఉదయం చేయాల్సిన ధ్యాన పద్ధతులు
🌤️ 1.సూర్యోదయం కోసం ఎదురుచూడడం🌤️🧘🏼‍♀️☀️

🔺 సూర్యోదయానికి పదిహేను నిమిషాల ముందు, ఆకాశంలో కొద్దిగా కాంతి ఉన్నప్పుడు ప్రియతముల కోసం ఎదురు చూసినట్లు ఎదురు చూడండి. అక్కడ గాఢమైన ఎదురుచూపు, ఆశావహమైన ఉద్వేగం ఉన్నా కూడా మీరు శాంతంగా ఉండండి. సూర్యుడు ఉదయిస్తూ ఉంటాడు, మీరు చూడండి. ఏకాగ్రతగా చూడాల్సిన పనిలేదు. మీ కళ్ళు మూసుకో వచ్చు కూడా. అదే సమయంలో మీలో ఏదో ఉదయిస్తున్నట్లు మీరు అనుభూతి చెందవచ్చు.

🔺 సూర్యుడు దిగంతాలు లోకి వచ్చినప్పుడు ఆ వెలుగు మీ నాభిని సమర్పించినట్లు అనుభూతి చెందండి. అది అక్కడికి వస్తుంది. మీ దగ్గరికి, మీ నాభిలోకి అది మెల్ల మెల్లగా వస్తోంది. సూర్యుడు అక్కడ ఉదయిస్తాడు. ఇక్కడ లోపల కేంద్రాలలో కాంతి ఉదయిస్తుంది. దీన్ని పది నిమిషాలపాటు చేయండి. అప్పుడు మీ కళ్ళు మూసుకోండి. ఎప్పుడైతే మీరు తెరిచిన కళ్ళతో సూర్యుడిని చూస్తారో అప్పుడు అది మీకు వ్యతిరేకతని సృష్టిస్తుంది. కాబట్టి మీరు కళ్ళు మూసుకున్నప్పుడు మీ లోపల సూర్యుడు వెలిగి పోవడం చూడవచ్చు.

🔺 ఇది మిమ్మల్ని అద్భుతమైన పరివర్తనకు లోను చేస్తుంది.
ఇది సంపూర్ణ ధ్యాన కళ. చర్యలో గాఢంగా ఎలా ఉండాలి, ఆలోచన ని ఎలా వదిలి పెట్టాలి, ఆలోచన వైపు సాగే శక్తిని మెళకువగా ఎలా పరివర్తింప చేయాలి అన్నదే ధ్యాన కళ.
🔺🧘🏼‍♀️🔺🧘🏼‍♂️🔺🧘🏼‍♀️🔺🧘🏼‍♂️🔺

Source - Whatsapp Message

No comments:

Post a Comment