Sunday, November 22, 2020

జ్ఞానము ఆధారంగా నడిచేవారు శూన్యంగా అవ్వలసి ఉంటుంది.

శుభోదయం.

జ్ఞానము ఆధారంగా నడిచేవారు శూన్యంగా అవ్వలసి ఉంటుంది. ప్రేమ లేదా భక్తి ఆధారంగా నడిచేవారు సంపూర్ణుడుగా అవ్వలసి ఉంటుంది. ప్రతీవారు తమ స్థితిని అర్ధం చేసుకుని యాత్రలో ముందుకు సాగిపోతూ ఉండాలి.

పూర్తిగా పుణ్యం తో నిండిన తరువాత ప్రార్ధన చేద్దాం అనుకోరాదు. మీరు ఎలా ఉన్నారో, ఎక్కడ ఉన్నారో అక్కడే మీ ప్రార్ధన ప్రారంభించాలి. మీ ప్రార్ధనే మీలో స్పృహ కలుగజేస్తుంది. మీరు మేలుకునేలా చేస్తుంది. పాపాన్ని తొలిగించుకోవాలి అంటే పుణ్యం చేయడం మార్గం కాదు. పాపాన్ని తీసివేయాలి అంటే స్పృహ యొక్క అవసరం ఉంటుంది.

మొదటి అడుగు వేసినప్పుడు పొరబాటు జరిగే అవకాశం ఉంటుంది. తప్పుటడుగు వేసి పైకి లేవడం అనేది పొరబాటు కాదు. వాయిదా వేయడం పొరబాటు. తప్పు చేయడం తప్పు కాదు. తప్పు చేస్తామేమో అని ఆగిపోవడం తప్పు. అలాగే చేసిన తప్పే, పదే పదే చేయడం తప్పు. చేసిన ప్రతి తప్పు నుండి అనుభవాన్ని పొంది, ఆ తప్పు నుండి పైకి ఎదుగుతూ పోవాలి.

Source - Whatsapp Message

No comments:

Post a Comment