Monday, December 21, 2020

చిత్తశుద్ది

🌹చిత్తశుద్ది🌹

✍️ మురళీ మోహన్

🤘అనేక లక్షల జీవరాసులలో మానవుడు సర్వశ్రేష్ఠుడని పరిగణింపబడి ఉన్నాడు. అందువలనే మానవజన్మ లభించటం దుర్లభం అని శాస్త్రాలు చెప్తున్నాయి. మానవజన్మ నెత్తినందుకు దానిని చక్కగా ఉపయోగించుకుని, సార్ధకం చేసుకోకపోతే అది మానవుని యొక్క మూర్కత్వమే అవుతుంది.

"అపి మానుష్యకం లబ్ధ్వా భవన్తి జ్ఞానినో నయే
పశుతైవ వరం తేషాం ప్రత్యవాయాప్రవర్తనాత్"

జ్ఞానార్జన చేయని మనుష్యుని కంటే పశువులు ఎంతో మేలు అని ఈ వాక్యం చెప్తోంది. దీనికి కారణం అర్ధం చేసుకొనటం చాల తేలికే.. పశువు పరిణామ క్రమంలో మరింతగా పతనం చెందటం ఉండదు. కానీ జ్ఞాన హీనుడైన మానవుడు పాపకర్మలు ఆచరించి పతనం కావచ్చు . అందువలన ప్రతి మానవుడు జ్ఞానాన్ని పొందటానికి నిరంతర కృషి చేయాలి. అంతకంటే మానవజన్మ సార్ధకతకు మరో మార్గంలేదు. అందుకనే భగద్గీతలో భగవానుడు ఈవిధంగా చెప్పారు..

"నహి జ్ఞానేన సదృశ్యం పవిత్రమిహ విద్యతే"

ఇక్కడ జ్ఞానమంటే ప్రాపంచిక విషయపరిజ్ఞాణం కాదు, ఆత్మతత్వ జ్ఞానం అని అర్ధం. అటువంటి జ్ఞానాన్ని సంపాదించిన తరువాత, ఇక సంపాదించవలసిందంటూ ఏమి ఉండదు.

ఆత్మజ్ఞానం వలనే అజ్ఞానం నశిస్తుంది. అప్పుడే మోక్షం సిద్ధిస్తుంది. పరిశుద్ధమైన చిత్తమే జ్ఞానప్రాప్తి యోగ్యమవుతుంది.

మానవుడు నిరంతరం, సత్కర్మల ద్వారా మనస్సును శుద్ధిగా ఉంచుకోవటానికి ప్రయత్నించాలి. ఈ విధమైన మానసిక పవిత్రత కరువైనప్పుడు, ఎవరు ఎన్నిసార్లు బోధించినా సత్యాన్ని గ్రహించటం కుదరదు. అదే చిత్తశుద్ధి ఉన్నప్పుడు, గురువు ఒకసారి బోధిస్తే చాలు జ్ఞానం లభిస్తుంది.

"పరిపక్వమతే: సకృత్ శృతం జనయేదాత్మ ధియం శృతేర్వచః"

మనస్సును పరిశుద్ధం చేసుకోవడము అంటే.. ఫలితాలపై మనస్సును నిలపకుండా, సత్కర్మలు ఆచరించటమే అందుకు మార్గం. ఫలితాలు ఆశించి సత్కర్మలు ఆచరిస్తే ఫలితాలు దక్కుతాయి కానీ చిత్తశుద్ధి మాత్రం లభించదు.

అందరు ఈ విషయాన్ని గ్రహించి శాస్త్రాలు సూచించినట్లు ఫలితాలు ఆశించకుండా సత్కర్మలు ఆచరించాలి. అప్పుడు చిత్తశుద్ధి లభించి, జ్ఞానాన్ని పొందటానికి అర్హులవుతారు...👍

Source - Whatsapp Message

No comments:

Post a Comment