Sunday, December 27, 2020

నీ సంతోషం నీలోనే వుంది...

నీ సంతోషం నీలోనే వుంది...
""""""""""""""""""""""""""""""""""

సంతోషం ఒక వృత్తం లాటిది.

నీ హృదయంలోంఛి చిన్న మొక్క లాగా అంకురించిన కోరికని తీర్చుకోవడం కోసం,

నీ చేతులు చేస్తున్న పనిని చూస్తున్నప్పుడు నీ కళ్లు... ఆనందంతో వర్షిస్తాయి.

హృదయమూ, చేతులూ, కళ్లు ఆ మూడింటి మధ్యా పూర్తయ్యే వృత్తమే సంతోషమంటే.

తాను చేస్తున్న పనిలో సుఖాన్ని గుర్తించినవాడు,

పని చేస్తున్నానన్న విషయం మర్చిపోతాడు.

అందుకే అతడు అలసిపోడు.

చేస్తున్న పనిలో సంతోషం లేని వాడు తొందరగా వృద్ధుడవుతాడు.

ఒక వ్యక్తి నిద్రలోనూ, పనిలోనూ,కలలోనూ ఒకే విధమైన సంతోషంగా ఉండాలి.

బద్ధకం ఆకర్షణీయమైనదే.
కాని పని తృప్తికరమైనది.

విశ్రాంతిలో వృధాగా వుండే అనవసరమైన ఆనందం ఒకసారి నీకు అలవాటయితే, చేసే పనిని సగంలో ఆపు చెయ్యడం
నీ వ్యసనమవుతుంది.

నీ "కర్మ"నీవు చేసే పనులపై ఆధారపడివుంటుంది.

నీ నుదుటి వ్రాత మీద కాదు"అన్నాడు అరిస్టోటిల్.

సంతోషం కూడా అంతే.

అది నీలో వుంది.
నీవు త్రాగే మధువులో కాదు.

అదే విధంగా సంసారంలో సంతోషం అనేది నీకు మంచి భాగస్వామి దొరకటం వలన రాదు.

నీవు మంచి భాగస్వామి అవటం వలన వస్తుంది.

గెలుపుకీ,విజయానికీ
తేడా తెలుసుకో.

"గెలుపు"నీలోంచి వచ్చేది.

"విజయం" ఇతరులు దాన్ని గుర్తించగా వచ్చేది.

పని చేయలేనివాడు తనెలా చెయ్యాలనుకున్నాడో నీకు సలహా ఇస్తాడే తప్ప తాను చెయ్యడు.... చెయ్యలేడు.....

చేసేటట్టయితే నీకెందుకు చెప్తాడు?

ఇతరులు విమర్శిస్తున్నప్పుడు నువ్వు ఆలోచించు.

ఇతరులు నిద్రిస్తున్నప్పుడు నువ్వు ప్రణాళిక వెయ్యి.

ఇతరులు తటపటాయిస్తున్నప్పుడు నువ్వు నిర్ణయం తీసుకో.

ఇతరులు మాట్లాడుతున్నప్పుడు
నువ్వు విను.

ఇతరులు వాయిదా వేస్తున్నప్పుడు నువ్వు పని చెయ్యి.

మీ... సూర్య మోహన్....!!

Source - Whatsapp Message

No comments:

Post a Comment