Thursday, December 17, 2020

క్షణికమీదేహం కాటికెల్లేది కాయం.

క్షణికమీదేహం కాటికెల్లేది కాయం.

ఎవరు నీవు ఎక్కడనుండి వస్తున్నావు
అందమైన దేహంతో
సుఖ సంతోషాలనడమ ఊరిస్తున్నావు
అద్భుతమైన బంధంతో

లేనిపోని అపోహల్లో అహంకారల మధ్య
నలిగిపోతున్నావేల?
అశాశ్వతమని తెలిసే చేస్తున్నావా లేదా
శాశ్వతమనుకున్నావా?

క్షణికమైన దేహమా కాటికెల్లేది కాయం తెలుసుకోవా కర్మ ధర్మ సత్యం
ఏనాటి బంధమో తల్లిదండ్రుల అనుబం
ధం ఏపుణ్య ఫలమో ఈ జీవితం

వుండదీ జీవితం తెగిపోవునీ బంధం
కాటికెల్లే కాయమా ఎందుకే వ్యామోహం
తోడురారు నీకెవరు తిరిగిరాదీ కాయం
ఏమున్నా ఎన్నున్నా పెంచుకోకుమోహం

బ్రమలే బంధాలు వుండవనుబంధాలు
వీడుతారు నిన్ను త్రెంచుకోనుబరువులు
కాటికెల్లే దేహమా కనికరమే వుండదు
కర్మఋణ బంధాన్ని తెంచుకోక తప్పదు

ఆచరించు సత్యాన్ని ఆత్మ జ్ఞానంతో అందరి మన్ననల కోసం కాదు ఆత్మ తృప్తికోసం తెలియంది చాలా వుంది తెలుసుకో ఈ జీవి
తాన్ని అందులోనే వుంది ఆత్మానందం

కబురంపుతాడు కాటికి రమ్మని నిన్ను ,
అందరి కళ్ళముందే కాలి పోతున్నావు
ఎక్కడికి వెళ్ళుతున్నామో ఎవరికెఱుక
తప్పొద్దు నీతి నియమం సత్యం ధర్మం.

Source - Whatsapp Message

No comments:

Post a Comment