Saturday, December 12, 2020

శుచిగా, శుభ్రంగా లేకపోతే ఈ క్షేత్రంలో తేనెటీగలు మీకు శత్రువులు

శుచిగా, శుభ్రంగా లేకపోతే ఈ క్షేత్రంలో తేనెటీగలు మీకు శత్రువులు

భారత పురాణాల్లో సప్త బుుషులకు ప్రత్యేక స్థానం ఉంది. వారు లోక కళ్యాణం కోసం ఈ దేశం మొత్తం మీద వివిధ చోట్ల అనేక యాగాలు చేశారని ఇందుకు ఆ త్రిమూర్తులు కూడా సహకరించారని తెలుస్తుంది.ఈ క్రమంలోనే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం, వరంగల్ జిల్లాలోని పాలకుర్తిలో ఒకసారి ఈ సప్త బుుషులు యాగం చేస్తూ పరమశివుడిని, విష్ణువును స్వయంభువుగా అవతరించాలని కోరుకొన్నారు.

వారి కోరికను మన్నించి పరమేశ్వరుడు సోమేశ్వరుడిగా లింగ రూపంలో ఇక్కడ అవిర్భవించగా, విష్ణువు నరసింహుడిగా పక్క పక్కనే ఉన్న రెండు పర్వత గుహల్లో అవతరించారు. అందుకే ఈ క్షేత్రాన్ని సోమేశ్వర లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం అని అంటారు.

శివుడు, కేశవుడు ఒకే చోట ఉండటం చాలా అరుదైన విషయం . అందువల్లే ఈ క్షేత్రం అటు శైవులతో పాటు వైష్ణవులకు కూడా అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది

పూర్వం ఒక ముసలి భక్తురాలు ఇక్కడి సోమేశ్వరుడికి నిత్యం పూజలు చేసేది. ఇందుకోసం పర్వతం చుట్టుకొని రావాల్సి వచ్చేది. అయితే ఆరోగ్యం ఎంత బాగాలేకపోయినా, వయసు మీద పడుతున్నా ఆమె నిత్య పూజను మాత్రం విడిచిపెట్టేది కాదు.వృధారాలి ప్రయాసను గమనించిన పరమశివుడు ఆమె కోసం తన పర్వతాన్ని చీల్చి ప్రదక్షిణ మార్గాన్ని ఏర్పాటు చేసారు.అప్పటి నుంచి ఆ మార్గంలోనే స్వామికి ప్రదక్షణ ఆ మార్గంలోనే చేస్తారు. ఈ సొరంగ మార్గం చిన్నగా ఉండి కొండ చీలి ఏర్పడినట్లు ఉంటుంది కానీ, ఎక్కడ కొండ పగలగొట్టినట్లు ఉండదు.ఎంత లావు ఉన్నవారైనా స్వామి పై భక్తితో ఆయన పేరును ఉచ్చరిస్తూ ఈ సన్నని మార్గం ద్వారా వెలుతారని భక్తుల నమ్మకం.అయితే అపనమ్మకంతో ఈ మార్గం గుండా స్వామి వారి దగ్గరికి వెళ్లాలని ఎంత సన్నగా ఉన్నవారు ప్రయత్నించినా వారి కోరిక నెరవేరదని స్థానిక పూజారులు చెబుతారు.అదే విధంగా ఇక్కడ ఈ గుహాలయంలో తేనెపట్లు చాలా ఉంటాయి. ఇవి భక్తులను ఏమీ చేయవు. అయితే ఎవరైతే శుచిగా, శుభ్రంగా లేకుండా ఆలయంలోకి ప్రవేశించాలని చూస్తే మత్రం ఈ తేనెటీగలు వారిని తరుముతాయని భక్తులు చెబుతారు

ఇలాంటి ఘటనలు చాలా జరిగాయని స్థానికుల కథనం. అందువల్లే ఆ ఆలయంలోకి మహిళలతోపాటు పురుషులు కూడా చాలా శుచిగా శుభ్రంగా వెలుతారు. ముఖ్యంగా మహిళలు బహిష్టు సమయంలో ఆ ఛాయలకు కూడా వెళ్లరు.

సోమేశ్వరుడిని పూజించి పక్కనే ఉన్న ఇంకొక గుహలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించడానికి అక్కడే మార్గం కూడా ఉంది. ప్రస్తుతం సోమేశ్వరుడిని దర్శించిన ప్రతి ఒక్కరూ లక్ష్మీ నరసింహస్వామిని కూడా తప్పక దర్శించుకొంటున్నారు.

గుహాలయాల్లో ఉన్న పరమేశ్వరుడికి, నరసింహుడి రూపంలో ఉన్న విష్ణువుకు చాలా మహత్యం ఉందని భక్తుల నమ్మకం. ఈ స్వామిని సేవిస్తే సిరిసంపదలతో పాటు అపారమైన తెలివితేటలు లభిస్తాయని స్థానికుల నమ్మకం.

సంతానం లేనివారు ఈ ఆలయంలో కొబ్బరికాయ ముడుపు కడితే పిల్లలు కలుగుతారని నమ్మకం. పిల్లలు పుట్టిన తర్వాత దంపతలు ఇద్దరూ స్వామిని దర్శనం చేసుకొని తొట్టెలు కట్టి తమ ముడుపును తీర్చుకొంటారు.

ఈ క్షేత్రానికి దాదాపు 2 కిలోమీటర్ల దూరంలో భాగవతం రచించిన మహాకవి పోతన నివశించిన గ్రామం బమ్మెర ఉంది. ఈ క్షేత్రాన్ని సందర్శించిన చాలా మంది అక్కడకి వెలుతుంటారు.

హైదరాబాద్ వరంగల్ దారిలో స్టేషన్ ఘనాపూర్ రైల్వేస్టేషన్ వస్తుంది. అక్కడి నుంచి 14 కిలోమీటర్ల దూరం రోడ్డు మార్గంలో ప్రయాణం చేస్తే పాలకుర్తి వస్తుంది.
వరంగల్ నుంచి పాలకుర్తికి 40 కిలోమీటర్ల దూరం. వరంగల్ నుంచి నేరుగా బస్సు సౌకర్యం ఉంది

Source - Whatsapp Message

No comments:

Post a Comment