Tuesday, December 15, 2020

జీవితంలో ఆచరించవలసిన ముఖ్యమైన మానవధర్మాలు

జీవితంలో ఆచరించవలసిన ముఖ్యమైన మానవధర్మాలు

జీవితంలో మనం ఎలా ఉండాలి,

కష్టాలు వచ్చినప్పుడు ఎలా పరిష్కరించుకోవాలి,

సమాజంలో ఎలా మెలగాలి,

అనే దానిపై ప్రస్తుత కాలంలో ఉన్నవారికి అంతగా అవగాహన లేదనే చెప్పాలి ఎందుకంటే ప్రతి ఒక్కరి నిత్య జీవితం కూడా యాంత్రిక జీవన విధానంకు అలవాటు పడిపోయారు.

అందువలన మన సంస్కృతి,సంప్రదాయాలు,మన వేదసంస్కృతి,దానిలో ఉన్న నియమాలు తెలుసుకోలేకపోతున్నారు.

ఒక వ్యక్తి తన జీవితంలో ఎలా జీవించాలి మరియు దానికి గల మార్గదర్శకాలు, నియమ నిబందనలు మన హిందూ సంప్రదాయం మరియు వేద సంస్కృతి చాల స్పష్టంగా తెలియజేసినది దానిలో కొన్ని మీకు అందిస్తున్నాను.

మనిషి చేయవలసినది :
""""""""""""""""""""""""""

👉ü మనిషిని జీవింపచేసేవి --.. నిగ్రహము, ప్రేమ,తృప్తి, త్యాగము,ఆశ, ఆత్మీయత .

👉ü విద్య నేర్పే గురువుకు కావలసినవి -- ఓర్పు,దైవభక్తి, ఔదార్యం, తెలివితేటలు, గురుభక్తి, పిల్లలుపై ప్రేమ

👉ü శిష్యుడికి కావలసినవి -- లక్ష్యం, సహనం,గురువుపై నమ్మకం, వినయం,ఏకాగ్రత, దైవభక్తి,విధేయత.

👉ü ఆచరించి బోదించదగినవి -- నీతులు,సూక్తులు,మంచి బుద్ది, ఇతరులకు సహాయము చెయ్యడం.

👉ü నిత్యమూ ఆచరించదగినవి -- ధర్మమూ, దయా,దాక్షణ్యము,కరుణ, దైవ చింతన.

👉ü నిత్యమూ ఆలోచింపదగినవి -- సద్భావము,సమాజ శ్రేయస్సు, సమైక్యత, సేవ.

👉ü నియమంగా పాటించవలసినవి -- కరుణా,క్రమశిక్షణ, సమయపాలన.

👉ü పూజింపదగినవారు -- తల్లి, తండ్రి, గురువు,దైవం, పరస్త్రీ.

👉ü నిత్యం చేయవలసిన ఆరాధనలు -- సత్యవ్రతము, మౌనవ్రతము,తల్లిదండ్రులుకు సేవ చెయ్యడం,దైవారాధన.

👉ü నిత్యం మనం ఎవరిని ఆదుకొనవలయును -- దీనులను, ఆపన్నులను,సజ్జనులను, చిన్నపిల్లలను, స్రీలను, ముసలివారును, అంగవైకల్యం గలవారిను, అనాధలను.

👉ü నిత్యమూ కోరుకోవలసినవి – అందరిక్షేమం, సమాజ శ్రేయస్సు.

👉ü చేసుకోవలసినవి -- ఆత్మవిమర్శ, ఆత్మరక్షణ.

👉ü వదులుకోవలిసినవి -- ఆర్భాటం, ఆడంభరం,గర్వం, అధికార దాహం.

👉ü కాపాడుకోవలిసినవి -- ఆత్మాభిమానం, శీలం, పరువు, ప్రతిష్ట.

👉ü దైవద్యానానికి ఉండకూడనివి -- కోపం, చింత,వాంఛ, అపనమ్మకం.

👉ü ఎదుటవారిని చేయకూడనివి -- ఆశ పెట్టుట,అవమానపరచుట, నమ్మించి మోసంచెయ్యట,దుష్ట కార్యాలు చెయ్యమని ప్రేరేపించుట.

👉ü నమ్మదగిన వారు -- తల్లి, దైవం, గురువులు.

👉ü కష్టాలను తొలగించేవి --విజ్ఞానం, వివేకం దైవారాధన, దానం చెయ్యటం.

👉ü మర్చిపోకుండా చేయవలసినవి -- పరోపకారం,దైవచింతన, తల్లిదండ్రులు సేవ.

👉ü ఉండవలసిన విధానం -- ఆలోచన తక్కువ,ఆచరణ ఎక్కువ.

👉ü భుజింపవలసినది -- మితాహరం(తక్కువ భోజనం),శాకాహారం.

👉ü నేర్చుకోవలిసిన నీతి --మంచిని చూడు,మంచిగా మాట్లాడు, మంచిని విను, మంచి వారితో స్నేహం చేయు.

👉ü ఉన్నతుడికి కావలసినవి -- భయం లేకపోవడం,భాద్యతగా వ్యవహరించడం, అందరికి భద్రత ఇవ్వడం,

🌞

Source - Whatsapp Message

No comments:

Post a Comment